పంచతంత్ర కథలు
నక్క కాకికి కొంగా, ఎండ్రకాయల కథ ఇలా చెప్పిందిః
కొంగా, ఎండ్రకాయల కథ :
ఒక చెరువు గట్టున ఒక ముసలి కొంగ నివసిస్తూ ఉండేది. అది శ్రమ లేకుండా చేపలను తినాలనుకున్నది. అది నీటి అంచున దైన్యంతో నిలబడి, తనకు సమీపంగా వచ్చిన చేపలను కూడా తినటం మానేసింది.
చేపల మధ్య ఒక ఎండ్రకాయ ఉన్నది. అది కొంగను సమీపించి, “మామా, ఇవాళ నువు తిండి, ఆటలూ మానేసినట్టున్నా వేమిటి?” అని అడిగింది.
దానికికొంగ, “ఎంతోకాలం చేపలను తిని సుఖంగా జీవించాను. అవి నా మిత్రులు, మీకందరికీ గొప్ప విపత్తు రానున్నది. అందుచేత, ఈ వార్ధక్యంలో నాకు సుఖజీవనం లేకుండా పోతున్నది. అదే నాకు పట్టుకున్న విచారం, ' అన్నది. “ఈ రాబోయే కష్టం ఎలాటిది మామా? '' అన్నది ఎండ్రకాయ.
“ఇవాళ ఉదయం కొందరు జాలర్లు అనుకుంటుంటే విన్నాను: “ఇది చాలా పెద్ద చెరువు. ఇందులో చాలా చేపలున్నాయి. ఆదివారం సాయంకాలానికల్లా మిగిలిన నాలుగు చెరువుల్లోనూ వేట ముగించి, సోమవారం తెల్లవారెసరికి ఇక్కడికి వచ్చి, మనం కొత్తగా చేసిన వలలతో చేపలనూ, ఇతర జలచరాలనూ పట్టేద్దాం కనుక, వారం తిరిగేసరికి ఈ చెరువులో ఒక్క చేపగాని, ఇతర జలచరం గాని మిగలదు. ఇవాళ సోమవారం గద. ఈ వార్ధక్యంలో నాకు నోటి ముందరి కూడు కాస్తా పోతుంది, అన్నది కొంగ.
కొంగచెప్పిన మాయమాటలు విని చెరువు లోని చేపలూ, ఇతర జీవాలూ ప్రాణభయంతో కొట్టుకుపోయాయి. అవి అన్నీ తమ తమ వయసునూ, హోదాను బట్టి కొంగను తండ్రీ, తాతా, మామా, అన్నా, మిత్రమా, గురూ అని సంబోధిస్తూ, “ఆపద గురించి ముందుగా మాకు తెలియజేయడం మంచిదయింది. ఈ ఆపదనుంచి మమ్మల్ని కాపాడటం నీకు సాధ్యం కాకషోదు, అన్నాయి.
''అండజాన్ని అయిన నేను పిండజాలైన మనుషులతో ఏం పోటీ చేయగలను. మీరంతా నాతో సహకరిస్తే ప్రయత్నం ఫలించవచ్చు. కొద్ది దూరంలో ఒక పెద్ద దలయం ఉన్నది. దాని పక్కన లోతైన కోనేరున్నది. దానినిండా తామరపూలు ఉన్నాయి. ఆ కోనేట్లో చేపలు పట్టరాదు. అక్కడ మీరు క్షేమంగా ఉండవచ్చు. జట్టు, జట్టుగా మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుపోయి, అక్కడ చేర్చగలను, అని కొంగ అన్నది. ఈ మాటలు విని మోసపోయిన చేపలన్నీ ఆనందంతో కొంగకు తమ కృతజ్ఞత తెలుపుకున్నాయి. కొంగ కూడా లోలోపల నవ్వుకుని, చేపలను మోసగించి తేలికగా తినవచ్చనుకున్నది.
అది ఒక్కొక్క జట్టు చేపలనూ తన వీపు మీద ఎక్కించుకుని, దేవాలయపు కోనేరు కని బయలుదేరి, ఎండకు కాలిన ఒక కొండరాతి మీదవాలి, చేపలను దానిమీదపడేసి, తింటూ వచ్చింది. రోజు రోజుకూ దాని ఆనందం పెరిగి పోతున్నది. చెరువులో మిగిలి ఉన్న చేపలకు అనుమానం కలగకుండా, కొలను చేరిన చేపల నుంచి సందేశాలు తెచ్చి చెబుతూ ఉండేది. ఎండ్రకాయకు కూడా ప్రాణభయం పట్టుకుని, జాలరులు వచ్చి రోజు దగ్గర పడుతూ ఉండటం చేత, “మామా నన్ను కూడా రక్షించుదూ!”' అని కొంగను వేడుకున్నది.
రోజూ చేపలను తిని మోహం మొత్తి ఉండటం చేత కొంగ, కొత్త రకం ఆహారం తినవచ్చునన్న ఆశతో, ఎండ్రకాయను తన వీపుమిద ఎక్కించుకుని ఉత్సాహంగా ఎగిరి పోయి, కొండరాయిమీద వాలబోయింది.
“మామా, దేవాలయం ఏది? లోతైన కోనేరేది?”* అని ఎండ్రకాయ కొంగను అడిగింది.
కొంగవెటకారుగా, '“ఆ రాయిని చూశావా? నేను చెరువు నుంచి తెచ్చిన చేపలన్నీ దాని మీదనే శాశ్వత శాంతి సంపాదించుకున్నాయి, అన్నది.
ఎండ్రకాయ తొంగి చూసేసరికి ఆ రాతి మీద అనేకంగా చేపల ఎముకలు కనిపించాయి. అప్పుడది తనలో, ''ఈ ప్రపంచంలో తెలివిగల వాళ్లు తమ స్వార్ధం కొరకు మిత్రులై ఉండి కూడా శత్రువులు గానూ, శత్రువులై ఉండి కూడా మిత్రులుగానూ, అభినయిస్తారు. శత్రువులై ఉండి కూడా మిత్రులుగా నటించే వారితో చెలిమి చెయ్యటం కన్న పాములతో చెలిమి మంచిది. కొంగ చేపలన్నిటినీ అదివరకే తినేసిందన్నమూట. వాటి ఎముకలే ఇవన్నీ, వాటికోసం పగతీర్చుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం,” అనుకున్నది. కొంగ రాతిమిద వాలబోతుండగా ఎండ్రకాయ, కొంగ తనను రాతి మీద పడెయ్యక ముంది దాని మెడను తన గిట్టలతో గట్టిగా పట్టెసింది. ఆ పరిస్టితిలో కొంగ ఎండ్రకాయను ఏమి చెయ్యలేక పోయింది. అది అక్కడనుంచి ఎగిరి పోబోయింది. కాని, ఎండ్రకాయ సన్నగా ఉన్న కొంగ మెడను గిట్టల మధ్య గట్టిగా పట్టి, తెగిపోయే దాకా నొక్కింది. తరవాత ఎండ్రకాయ కొంగ తలను పట్టుకుని చెరువుకు తిరిగి వచ్చింది.
అక్కడ ఉన్న చేపలు ఎండ్రకాయను, “అన్నా, తిరిగి వచ్చావేం?”' అని అడిగాయి.
ఎండ్రకాయ, వాటికి కొంగతలను చూపి, “ఈ దుష్పుడి మాటలు నమ్మి పాపం చేపలన్నీ చచ్చిపోయాయి. ఈ నమ్మకద్రోపిని చంపి, వాడి తల తెచ్చాను. పల్లెకారుల కథ అంతా ఈ దుర్మార్గుడి కల్పన, ' అన్నది.
నక్క ఈ కథ చెప్పిన తరవాత కాకి, “మిత్రమా, పామును ఎలా చంపాలోచెప్పు,” ఏదైనా గుడికో, కోనేరుకో వెళ్ళు ధనికులది ఏ రత్నహారమో, మరేదైన్న నగో తీసుకుని వచ్చెయ్యి. జనం నీ వెంట పడతారు. వాళ్లు చూసేటట్టుగా అ నగను పాము పుట్టలొ పడెయ్యి. వారు ఆ నగకోసం తప్పక పుట్టను తవ్వుతారు. అప్పుడు పామును తప్పక చంపేస్తారు.”
కాకి తన ఇంటికి వెళ్లి, నక్క చెప్పిన ఉపాయం తన భార్యకు చెప్పింది. రెండూ బయలు దేరి రాజభవనం లోని కొలనుకు వెళ్లాయి. త్వరలోనే రాణి స్నానానికి కొలనుకు వచ్చి, తన రత్న హారమూ, ఇతర నగలూ తీసి ఒడ్డున పెట్టి, కొలనులోకి దిగి జలకాలాడ సాగింది. ఆడ కాకి చప్పున రత్నహారాన్ని తీసుకుని తన గూడు ఉన్న చెట్టుకేసి నింపాదిగా ఎగురుతూ పోయింది. ఇది చూసి మనుషులు గట్టిగా అరుస్తూ దుడ్దుకర్రలతో వెంటపడ్డారు. ఆడ కాకి రత్తహారాన్ని పాముపుట్టలో పడేసి, ఎడంగా ఒక కొమ్మ మీద వాలి గమనించసాగింది. ప్రతీహారులూ, సేవకులూ హారం కోసం పుట్ట తవ్వారు. పాముకు కోపం వచ్చి, పుట్టలో నుంచి పైకి వచ్చింది. అందరూ చేరి పామును చంపి హారం తీసుకుపోయారు.
ఈ విధంగా కాకులకు పాము బెడద తీరిపోయింది. (ఇంకా ఉంది)
0 Comments