పంచతంత్ర కథలు మిత్రబేధం 7
సాలెవాడి భార్య చేసిన మాయ అంతా కళ్లారా చూసిన దేవశర్మ తనలో, “ఆహా, స్త్రీలు ఎంత మాయలవారివాళ్లు! వాళ్ల తెలివితేటల ముందు శుక్రుడూ, బృహస్పతీ ఎందుకు పనికి వస్తారు? అనుకున్నాడు. ఈ లోపల మంగలి స్త్రీ తెగిపోయిన ముక్కును చేత బట్టుకుని, “ఎం చెయ్యాలా, తెగిపోయిన ముక్కును ఎలా కప్పిపెట్టాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లింది.
ఇంతలో తెల్లవారింది. రాత్రి అంతా రాజభవనంలోనే ఉండిపోయిన దాని భర్తవచ్చి, నా పొది ఇలా తీసుకురావే అన్నాడు. తెలివిగల మంగలామె కత్తి మాత్రమే బయటకు విసిరేసింది. పొది ఇవ్వమంటే ఒక్క కత్తి మాత్రమె పారెసిందని భార్య మీద మండిపడి, మంగలి ఆ కత్తిని ఆమె కేసి విసిరి కొట్టాడు. వెంటనే ఆమె చేతులు పైకెత్తి ' "రక్షించండి! రక్షించండి! దుర్మార్గుడు, నామొగుడు, నాముక్కు కాస్తా కోసేశాడు! '” అని కేకలు పెట్టింది.
ఆ కేకలు విని రక్షకభటులు పరిగెత్తుకుంటూ వచ్చి, మంగలిని చావతన్ని, అతడినీ, అతడి భార్యనూ, తెగిన ముక్కునూ తీసుకుపోయి న్యాయాధికారుల ముందు పెట్టి ఈ దుర్మార్గుడు ఈ స్త్రీ రత్నాన్ని అకారణంగా హింసించాడు. విడికి ఏ దండన విధిస్తారో విధించండి,”' అన్నారు.
న్యాయాధికారి మంగలిని, “ఇలాంటి ఘోరం ఎందుకు చేశావు? నీ భార్య ఏం చేసింది?" అని అడిగారు. అసలే మూఢుడైన మంగలికి జరుగుతున్నది అర్ధం కాక మౌనంగా ఉండిపోయాడు. న్యాయాధికారులు శిక్షాస్టృతులన్సీ తిరగవెసి, మంగలికి మరణదండన విధించారు. దేవశర్మ ఈ సంగతి వినటమే గాక, వధ్యస్థ్రానానికి పోతున్న మంగలిని చూశాడు. ఆయన న్యాయాధికారుల వద్దకు పరిగెత్తి వెళ్లి, అయ్యలారా, ఈ అమాయకుడైన మంగలీని అన్యాయంగా చంపబోతున్సారు. నిజం నేను చెబుతాను వినండి. అనవసరమైన
విషయాలలో జోక్యం చేసుకుని నక్కా, నేనూ, మంగలావే ఆపదలు తెచ్చుకున్నాం, అన్నాడు. అది ఎలా జరిగింది? అని న్యాయాధికారులు దేవశర్మను అడిగారు.
దేవశర్మవారికి పోట్లాడుకున్న పొట్టేళ్ల కథా, తన బంగారం కాజేసిన ఆషాఢభూతి కథా, తప్పతాగిన సాలెవాది కథా వివరంగా చెప్పాడు.
న్యాయాధికారులు దేవశర్మ చెప్పిన కథలను ఆశ్చర్యంతో విని, వెంటనే మంగలిని విడుదల చేశారు. కాని వారు మంగలి భార్యను విడిచి పెట్టక, ఆమె చెవులు కూడా కోయించి, ఆమె చేసిన దుర్మార్లానికి శిక్షపూర్తి చెశారు.
నక్క పొందిన శిక్షా, మంగలామె పొందిన శిక్షా చూసిన మీదట దేవశర్మకు తన బంగారం పోయిందన్న విచారం పోయింది. ఆయన తన మఠానికి తిరిగివచ్చి, శివుడి ముందర సాష్టాంగపడి, “మహాదేవా, నీ దయవల్ల మా ముగ్గురిలోనూ తక్కువ ఆపద పొందిన వాణ్ణినేనే. రక్తదాహంతో నక్క తన ప్రాణాలనే పోగొట్టుకున్నది. మంగలిది ముక్కూ చెవులూ పోగొట్టుకున్నది. నీ అనుగ్రహం చేత బంగారం మీద వ్యామోహంతో బంగారాన్ని మాత్రమే పోగొట్టుకున్నాను. ఇక దాన్ని కోరను, అన్నాడు.
దమనకం చెప్పిన దేవశర్మ కథ విని కరటకం, “సరే మనం ఇప్పుడు ఎం చెయ్యాలి? అని అడిగింది.
దానికి దమనకం “తప్పు తోవలో పడి పోయిన మన రాజును సరి అయిన తోవకు మళ్లించాలి. కేవలం ఎద్దు స్నేహాన్ని, సలహానూ పురస్కరించుకుని మన రాజు గడ్డి తినే నీతి అవలంబించటం జరిగింది. ఆయనను అటునుంచి మళ్లించాలి,” అన్నది.
“మనవంటి దుర్బలులకు అది ఎలా సాధ్యం? అని కరటకం అడిగింది.
దేహబలం చాలనప్పుడు యుక్తులు పనిచేస్తాయి. భయంకరమైన పామును చంపటానికి ఆడకాకి బంగారు హారాన్ని ఉపయోగించలేదా? అన్నది దమనకం;
“ఆ కథ ఎమిటి?” అని కరటకం అడిగింది. దమనకం ఇలా చెప్పంది.
పామును చంసిన కాకుల కథ:
ఒక ప్రాంతంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. దానిమీద ఒక కాకుల జంట నివసించేది. ఆ కాకులు పొదిగిన పిల్లలను ఒక పాము తిని పోసాగింది. చాలా కాలంగా అదే చెట్టు మీద ఉంటున్న ఆ కాకులకు ఫైల్లలు దక్కటం లేదన్న విచారం ఉన్నప్పటికి, చెట్టును విడిచి పోబుద్ది కాలెదు. పాము ప్రతి రోజూ విడవకుండా చెట్టు ఎక్కి వచ్చి, కాకి పిల్లలను మింగేస్తూ ఉండటం చేత ఒక్క పిల్ల అయినా బతికి బట్టకట్టటం జరగలేదు.
చిట్టచివరకు ఆడకాకి ' 'ప్రాణనాథా, దుష్ట సర్పం మన పిల్లలందరినీ పొట్టబెట్టుకున్నది. మనకు పుట్టబోయే పిల్లల గతి కూడా ఇంతే అవుతుంది.
అందుచేత మనం ఇంకెక్కడికైనా పోయి, దూరాన మరొక చెట్టుమీద నివాసం ఏర్పాటు చేసుకుందాం. కన్న పిల్లల మీది ప్రేమా, వారు మరణిస్తే కలిగే శోకమూ, ఇంతా అంతా కాదు. అందుచేత మనం వేరొక చోటికి పోదాం, అన్నది...
దానికి మగకాకి, ''ప్రియా, మనం ఎంతో కాలంగా ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నాం. అందుచేత నాకు దీన్ని వదిలి పెట్టడం ఇష్టంలేదు. పిడికెడు గడ్డీ, పుడిసెడు నీరూ మాత్రమే కోరే లేడి ఎక్కడైనా బతకగలదు; కాని అది
ఎన్ని అపాయాలకైనా ఓర్చి తన జన్మ స్థానమైన అరణ్యంలోనే ఉంటుంది. లేడి కూడా చెయ్యని పని, తెలివితేటలు గల కాకులం చెయ్యటమా? ఎదో ఒక ఉపాయం చేత నేనీ పాపిష్టి పామును చంపేస్తాను,” అన్నది.
“అది విషసర్పం. దాన్ని ఎలా చంపుతావు?' ' అని ఆడకాకి అడిగింది.
నేను స్వయంగా ఆ పని చెయ్యలెక పోతే నేం? ధర్మశాస్తమూ, రాజనీతీ తెలిసిన ఉద్దండ పండితులైన మిత్రులున్నారు. నేను వారితో సంప్రదించి, వారి సలహా పొంది శ్రీఘ్రమె ఈ పామును చంపేస్తాను,” అన్నది మగకాకి.
అది రోషంతో ఎగిరిపోయి మరొక చెట్టును చేరి, అక్కడ నివసించే తన ఆప్తమిత్రుడైన నక్కను పిలిచి, తనకు వచ్చిన కష్టం చెప్పుకుని, “మిత్రమా, మా పిల్లలనన్నిటిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గపు పామును చంపటానికి మంచి ఉపాయం ఉంటే చెప్పు. అన్నది.
దానికి నక్క, ' నేనొక చక్కని ఉపాయం ఆలోచించాను. ఇక నీ కష్టాలు గట్టెక్కుతాయి. చెడ్డ పనులు చెసేవారు నది ఒడ్డున ఉన్న చెట్టులాగా తమకు తామె నాశనమైపోతారు.
వెనకటికి కొంగ చేపలన్నిటినీ తిని కూడా తృప్తి తీరక చివరకు ఎండ్రకాయ చేత చావలేదా? అన్నది.“ఎమిటా కథ? ' అని మగకాకి అడిగింది. (ఇంకా ఉంది)
0 Comments