పంచతంత్ర కథలు-మిత్రబేధం 6
కరటకం
దవముకానికి ఆషాఢభూతి పలాయనం విషయం చెప్పి, ఇంకా
ఇలా చెప్పసాగింది:
అషాఢభూతి మీద పూర్తి నమ్మకంతో తన కాలకృత్యాలు నిర్వర్శించటానిక్ అవతలికి
వెళ్లిన దేవశర్మ తన నమీపంళలొనే ఒక దృశ్యం
చూశాడు.
పొట్టెళ్ల మంద ఒకటి మేత మెస్తున్నది. అందులో
రెండు పొట్టెళ్లు పోట్లాడసాగాయి. అవి రెండూ పరిగెత్తుకుంటూ వచ్చి,
తలలు ఢీ కొట్టుకుని, మళ్తీ వెనక్కు వెళ్ళి
పరిగెత్తుకుంటూ
వచ్చి బలంగా తలలు డీ
కొట్టుకుంటున్నాయి.
వాటి తలలు పగిలి రక్తం నేల మీద కారుతున్నది. నేల మీద కారిన
రకాన్ని నాకాలన్న
ఆత్రంతో ఒక నక్క వచ్చింది. పొట్టేళ్లు
ఆ సమయంలో ఎడంగా వెళ్లాయి.
దేవశర్మ
ఆ నక్కను చూసి, “ఈ నక్కకు బుద్ది
లేదు. ఈ సారి పొట్టేళ్లు
తలలు డీ కొట్టినప
ప్పుడు ఇది నిశ్చయంగా వాటి
మధ్య నలిగి
చస్తుంది, అనుకున్నాడు.
ఆయన అనుకున్నట్లే పొటేళ్లు మళ్లీ పరిగెత్తుకుంటూ
వచ్చి తలలు మోటించాయి. రక్తం
తాగటంలో మైమరిచి ఉన్న నక్క ఆ పొటెళ్ళ
తలల మధ్య నలిగి చచ్చింది.
చచ్చిన
నక్క గురించి చింతిస్తూ దేవశర్మ తన శిష్యుడు ఉండిన చోటికి వచ్చాడు. అషాఢభూతి
కనిపించలేదు.
దేవశర్మగబగబా
స్నానం చేసి వచ్చి చూసే సరికి
ఆయన బట్టల మూట ఉన్నది
కాని, బంగారం
మూట మాత్రం కనబడకుండా పోయింది.
అయ్యో,
“నా బంగారం పోయింది,” అనుకుంటూ
దేవశర్మ మూర్చపోయాడు.
కొద్ది
సేపటికి స్పృహ వచ్చిన దేవశర్మ “ఒరె,
ఆషాఢభూతీ! నన్ను మోసగించి ఎక్కడికి
పోయావురా? జవాబు చెప్పరా! అని వైనవైనాలుగా ఎడుస్తూ, వాళ్డు కలుసుకుందామనే
ఆశతో, వాడి అడుగు జాడలను బట్టి
బయలుదేరాడు.
సాయంకాలం
అయేసరికి అతడు ఒక గ్రామం
చేరాడు. కల్లు అంగడికి పోతున్న సాలె
దంపతులు తనకు కనిపించారు.
అతడు
సాలెవాడితో “నాయనా అసుర సంధ్యవేళ
నేను నీకు అతిథిగా వచ్చాను. నాకు
ఇక్కడ ఎవరూ తెలియదు. అందుచేత నన్ను
అతిథిగా స్వకరించి, ఆతిథ్యం ఇయ్యి, అన్నాడు.
ఈ మాటలు విని సాలెవాడు
తన భార్యతో,
“ఏమే,
ఈయనను మన ఇంటికి తీసుకు పోయి,
కాళ్ళు కడిగి, భోజనంపెట్టి పక్కవెసి ఆయనకు
ఏం కావాలో చూస్తూ ఇంటి దగ్గర ఉండు.
నేను వెళ్లి ఇంత మాంసమూ, కల్లూ తెస్తాను.”
అన్నాడు.
సాలెవాడి
భార్య మరొకరితో సంబంధంలో ఉంది.
తన ప్రియుడైన దేవదత్తుడిని కలుసుకోవటానికి
మంచి అవకాశం దొరికినందుకు
పరమానందభరితురాలై, ఆమె దేవశర్మను
వెంటబెట్టుకుని ఇంటికి వడివడిగా బయలు
దేరింది. ఇంటికి చేరగానే ఆమె దేవశర్మకు
ఒక కుక్కి మంచం చూపి, కూర్చుండబెట్టి
తనకు కలిగిన రీతిలో సపరిచర్యలు చేసింది.
దేవశర్మ
కాస్త స్థిమిత పడ్డ తర్వాత ఆమె ప్రాధేయపూర్వకంగా
అతడితో ఇలా చెప్పింది. “స్వామీ!
నా స్నేహితురాలు ఒకతె ఇవాళే వాళ్ల గ్రామం
నుంచి వచ్చింది. దానితో మాట్టాడి ఇప్పుడే
వస్తాను. నేను వచ్చేదాకా ఇల్లు
కాస్త చూస్తూ
ఉండండి. అని చెప్పి, మంచి బట్టలూ,
నగలూ ధరించి, దేవదత్తుణ్ణీ కలుసుకోవడానికి
వెళ్లింది.
కాని
దారిలో ఆమెకు తన భర్త
తప్పతాగి తూలుతూ,
అడుగులు తడబడుతూ, జుట్టు రేగి,
చేతిలో కల్లుముంత పట్టుకుని వస్తూ కనిపించాడు.
అది చూసి గజగజా వణికిపోయిన ఆమె అతి వేగంగా
ఇంటికి పరిగెత్తుకుని
వచ్చి, తన మంచి బట్టలూ,
అలంకారాలూ
తీసేసి, పాత బట్టలు ధరించింది. ఏమీ ఎరగనట్టుగా భర్త రాక కోసం
ఎదురు చూస్తున్నట్టుగా
గడప ముందు నిలుచుంది.
అయితే
ఆమె మంచి బట్టలూ, అలంకారాలూ
ధరించి పరిగిత్తిపోతూ ఉండడం సాలెవాడు
చూసి కూడా చూడనట్లు నటించాడు.
తన భార్య తిరుగుళ్లను గురించి
అతడికి తెలుసు.
అతిథికి మర్యాద చేయవలసిన భార్య
అలా విధిలో కనబడగానే అతడికి ఆమెపై
మరింత అనువమూనం కలిగింది. అతడు
ఇంటికి వచ్చి భార్యను చూసి,
పట్టరాని
కోపంతో, “ఓసీ, నీచురాలా! కులటా! ఎక్కడికి
పోతున్నావు? అన్నాడు.
“నిన్ను
వదిలినాక నేను ఎక్కడికీ పోలెదే? ఎందుకా
తాగుడు వాగుడు? తాగిన వాడి నోటికి
శుద్ధి, బుద్ధి ఉండదంటారు. అన్నది అతడి
భార్య
తన భార్య పొగరు మాటలు
విని, ఆమె చీరమార్చి
ఉండటం గమనించిన సాలెవాడు, “నీ పోకిళ్ళ గురించి అదివరకే విన్నాలే. ఇవాళ కల్లారా
చూశాను. నిన్ను ఏం చేస్తానో చూడు! అంటూ
ఒక దుడ్డుకర్ర తీసుకుని తన భార్య ఒళ్లంతా
హూనం చేసి, ఆమెను స్తంభానికి పలుపుతో
కట్టెసి, తాగిన మైకంలో పడుకుని నిద్రపోయాడు.
ఈ సాలెవాడి భార్యకు ఆమె స్వభావమే కలిగిన
స్నేహితురాలు మంగలి మహిళ ఒకతె ఉన్నది.
ఆమె వచ్చి, సాలెవాడు నిద్రపోతున్నాడని
రూఢి చేసుకుని, అతని భార్యతో, “దేవదత్తుడు
నీకోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకు
ఆలస్యం చేస్తున్నావు త్వరగా వెళ్లు, అన్నది.
“నేను
ఎలా వెళ్లేది? ఎ స్టితిలో ఉన్నానో చూడు.
నన్ను చావబాదింది కాకుండా ఇలా పలుపుతో
కట్టేశాడు. ఎలా హ్మోది? నామొగుడేమో
ఇంట్లోనే ఉన్నాడాయె, ' అన్నది సాలెవాడి
భార్య విచారంగా.
“నేను
నీ కట్లు విప్పుతాను. ఎనుగొచ్చి ఘీంకరించినా,
నీ మొగుడు రేపు మొహం మీద ఎండపడే దాకా లేవడు. అంతగా అయితే
నీకు బదులు నన్ను కట్టెయి.
నీ మొగుడు
రాత్రివేళ లేచినా మైకంలో నన్ను చేయకుండా
నువ్వు దేవదత్తుడి వద్దకు వెళ్లి త్వరగా
రా ' అన్నది స్నేహితురాలు.
సాలెవాడి
భార్య తన కట్లు విప్పించుకుని, తన స్థానంలో తన స్నేహితురాలిని స్తంభానికి కట్టి
వేసి, ఆ తర్వాత దేవదత్తుణ్ణి
కలుసుకోవడానికి
వెల్సింది.
ఆమె వెళ్లిన కొంతసేపటికి సాలెవాడు శాంతపడి
లేచి, '““ఒసే గయ్యాళి గంపా!
ఇక ముందు
ఇల్లు కదలననీ, నాతో పొగరుగా మాట్లాడనని
మాట ఇస్తే నీ కట్లు
విప్పుతాను. నన్నే
మోసగిస్తావా? ఎంత బరితెగింపే నీకు? అన్నాడు.
మంగలామె,
తన గొంతు గుర్తిసాడని సాలెవాడికి
సమాధానం చెప్పలెదు. దాంతో సాలెవాడికి
ఒళ్లు మండి, పదునైన కత్తి
తెచ్బి, మంగలి
దాని ముక్కు పరపరా కోసి, “ఎప్పటికీ
ముక్కిడి ముండవుగా ఉండిపో దరిద్రపుదానా,””
అని తిట్టి మల్తీ వెళ్లి నిద్రలోకి జారుకున్నాడు.
మంగలామెకు
వణుకు పుట్టింది. పుణ్యానికి
పోయి పాపమెదురైనట్టుగా సాలెవాడి ఇంట్లో
తన ముక్కుకు కోత పడిందే అని ఆమె తీవ్రంగా విచారపడింది. మరో వైపు గాయం
సలుపుతోంది. గట్టిగా ఎడుద్దామన్నా
పరిస్థితులు అనుకూలంగా లేవు. నోరు
పెగిలిందా భండారం బయటపడినట్లై. దాంతో
ఆమె కదలక మెదలక గుంజకు ఆనుకుని
నిలుచుండిపోయింది.
బంగారాన్ని
పోగొట్టుకున్న బాధకు ఆకలీ, దప్పీ
తోడై, నిద్రపోలేకుండా ఉన్న దేవశర్మ సాలెవాడి
ఇంట్లో జరుగుతున్న ఈ నాటకమంతా
కళ్లారా చూశాడు.
కొంత
సేపు గడిచాక, సాలెమనిషి తిరిగి వచ్చి
మంగలి మనిషిని, “ఎలా ఉన్నావు? నేను
వెళ్లినాక ఆ దుర్మార్గుడు లేచాడా?
అని అడిగింది.
“నేనైతే
బాగానే ఉన్నాను గాని, నీ మాయదారి
మొగుడు లేచి, నా ముక్కు
కోశాడు. వాడు
లేచి నా చెవులు కూడా
కోసే లోపల కట్టు విప్పి నన్ను ఇంటికి పోని తల్లీ!, అన్నది మంగలి మనిషి. సాలె మనిషి మంగలిదాని కట్లు
విప్పి, ఆమె స్థానంలో తాను
కట్టించుకున్నది.
తరువాత ఆమె భర్తను ధిక్కరిస్తూ, “ఓ మూఢుఢా! నావంటి శీలవతిని గాయపరచటమూ,
తరవాత వికృతం చెయ్యటమూ నీ తరమా?
ఓ దిక్పాలాకులారా! సూర్యచంద్రులారా! అగ్నిహోత్రుడా!
వాయుదేవుడా! వినండి! నెనే పతివ్రతనైతే
నా ముక్కును యధాప్రకారం చేయండి...!
చూశావా దుర్మార్గుడా? నువ్వు ముక్కు
కోసివేసినా నా శీలబలం చేత
నా ముక్కు
ఎప్పటిలాగే అయింది!” అన్నది.
తన భార్య అబద్దం ఆడుతూంటే
దాన్ని అగ్నికి
ఆహుతి చేద్దామని, సాలెవాడు మండే కొరివితో
వచ్చి, తన భార్య ముక్కు
ఎప్పటిలాగే
ఉండటం చూసి నిర్ధాంతపోయాడు. తొలిసారిగా
అతనికి భయం పట్టుకుంది.
తాను
నిజంగా ముక్కు కోయలెదేమో అనుకుందామంటే
నేల మీద రక్తం మడుగు ఉన్నది.
అతను వెంటనే ఆమె కట్లు విప్పి, ఆమెకు
వెయ్యి క్షమాపణలు చెప్పుకుని, ఆమెను
సంతోష పెట్టడానికి సర్వవిధాలా యత్నించాడు. (ఇంకా ఉంది)
0 Comments