పంచతంత్ర కథలు మిత్రభేదం-5
దమనకం చెప్పిన దంతిలుడి కథ విని సంజీవకం నువ్వు చెప్పిన కథ సరిగానే ఉన్నది.
అందుచేత నువ్వన్నట్లె కానీ, అన్నది.
తరవాత
దమనకం సంజీవకాన్ని పింగళకం వద్దకు తీసుకుపోయి, "మహారాజా ఇదుగో
సంజీవకం, ఆ పైన దేవరవారి చిత్తం,
అన్నది.
సంజీవకం
పింగళకానికి ప్రణామం చేసి, ఎంతో
నమతగా దాని ఎదట కూర్చున్నది.
పింగళకం
వాడీ, భయంకరమూ అయిన గోళ్ళు
గల బలమైన తన కుడి
పంజా చాచి, -'స్వాగతం,
ని ఆరోగ్యం ఎలా ఉన్నది? ఈ అరణ్యానికి
ఎందుకు వచ్చావు? అని అడిగింది.
తాను
వర్హమానుడి బిడారు వెంట వచ్చి ఒంటరిగా
దిగబడిపోవటవమూ, తరవాత జరిగినది
యావతూూ సంజీవకం సింహానికి చెప్పింది.
“మిత్రమా,
నీకు ఎలాంటి భయమూవద్దు.
నువు నీ ఇచ్చానుసారం ఈ అరణ్యంలో జీవించు.
కానీ మరీ దూరం పోకుండా
ఎల్లప్రుడూ
నా కనుచూపు మేరలో ఉండు.
ఎందుకంటే
నిన్నునేను కనిపెట్టి ఉండలేనప్పుడు నీకు అపకారం చేసే క్రూరమృగాలు,
పాపభీతి లేనివి, ఈ అరణ్యంలో చాలా
ఉన్నాయి, నా రక్షణలో ఉంటె
నీకు ఈ అరణ్యంలో, ఏ ప్రమాదమూ సంభవించదు
అన్నది పింగళకం.
సింహం
అభయం ఇవ్వడంతో స్థిమిత పడిన
సంజీవకం 'చిత్తం అని చెప్పి, యమునా
నదికి వెళ్లి, కడుపునిండా నీరు తాగి,
వెనకటిలాగా యధేచ్చగా, నిర్భయంగా'
అరణ్యంలో సంచరించసాగింది.
రోజులు గడిచే కొద్దీ పింగళకానికి, సంజీవకానికీ మధ్య స్నేహ బంధం దృఢం కాజొచ్చింది. పింగళకం ప్రతిది సంజీవకంతో సంప్రదించేది. సంజీవకం చాలా తెలివైనది.
అది కరటకం, దమనకం మొదలైన వాటి రహస్య చర్యలు కనిపెట్టి, వాటిని గురించి పింగళకానికి హెచ్చరించింది. ఆ కారణంగా పింగళకం వాటిని దూరంగా ఉంచి, సంజీవకం చెప్పే సలహాలు మాత్రమె స్వీకరిస్తూ వచ్చింది.
దుర్చుద్దితో
సింహరాజు పంచన చేరి పబ్బం
గడుపుకోవాలని కరటక దమనకాలు పన్నిన
పథకం దింతో ఎదురు తెరిగింది. తవు పథకం బెడిసికొట్టడంతో వాటిలో అంతర్మధనం
మొదలైంది.
“'అన్నా,
కరటకం! మనం నిరాశ్రయులమయిపోయాం.
పింగళకానికి సంజీవకంతో కబుర్లు
చెప్పడంలో ఎంత ఆనందంగా ఉందంటె,
అతగాడు వేటకు కూడా పోవటంలేదు.
అందుచేత మనకు బొత్తిగా తిండిలేకుండా
పోయింది. ఏం చెయ్యాలి? అన్నది
దమనకం.
గడ్జితినే
ఈ ప్రాణిని తగుదునమ్మా అంటూ
రాజుకు పరిచయం చెయ్యటం నీదే
బుద్ది తక్కువ, తనకు మాలిన ధర్మం చేస్తే
ఇలాగే ఉంటుంది అన్నది కరటకం.
“నిజమే,
తప్పునాదే, స్వయుంకృతాపరాధం
రాజుది కాదు. స్వయుం౦కతాపరాధాలు
ఎలా చెరుపు చేసేదీ దేవశర్మ కథ చెబుతుంది
గద! అన్నది దమనకం.
“ఎలాగెలాగూ?””
అని కరటకం అడిగింది.
దమనకం
ఇలా చెప్పసాగింది:
దేవశర్మ కథ:
ఒక మారుమూల ప్రదేశంలో జనపదాలకు దూరంగా ఒక మఠం ఉండేది. దేవశర్మ అనే యతి ఆ మఠంలో
ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని
అర్చిస్తూ ఉండేవాడు. అనేకమంది
భక్తులు ఆ మఠానికి విలువైన
వస్త్రాలు దానం
చేసేవారు.
సర్వసంగ
పరిత్యాగం చేసి యతి అయినప్పటికీ,
దేవశర్మక్రు బంగారం మీద భ్రాంతి ఉండేది.
ఒకనాడు
ఆయన వమారువేషం వేసుకుని,
విలువైన వస్తాలన్నింటిని మూట గట్టి
దూరాన ఉండే నగరానికి తీసుకు పోయి,
వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్ని
ఒక గుడ్డ సంచిలో పెట్టి,
సంచిని తన చంకకు తగిలించుకుని, వుఠానికి తిరిగి
వచ్చాడు.
అటు బమ్మట, ఆయన ఎవరినీ నమ్మక, రాత్రింబగళ్లు
ఆ సంచిని తన చంకలోనే ఉంచుకునే
వాడు.
సంపదను
సాధించటం కష్టం. సంరక్షించడం కష్టం, అది పోవడం దుఃఖం,
ఖర్చుకావడం దుఃఖం, దాని మూలమే ఖేదం,
దాని ఫలితాలు
విషాదం, అని ఊరికి చెప్పారా?
ఆషాఢ
భూతి అనేవాడు దుర్మార్గుడు, పాపభీతి
లేనివాడు. ఇతరులది కాజెయ్యడమే వాడి లక్ష్యం. దెవశర్మ
చంకలో ఉండే బంగారం
ఒకనాడు వాడి కంట పడింది. దాన్ని
ఎలా కాజెయ్యడమా అని ఆలోచించాడు.
మఠం గోడలు రాతితో కట్టినవి
కావటం చేత వాటికి కన్నం వెయ్యటం సాధ్యం
కాదు. కిటికీలు
చాలా ఎత్తున ఉన్నాయి. అందుచేత ఆషాఢ భూతి దేవశర్మదగ్గిర
శిష్యుడిగా చేరి,
తియ్యటి కబుర్లతో ఆయనకు విశ్వాసపాత్రుడు
కావాలనుకున్నాడు.
ఇలా అనుకుని అషాఢభూతి దేవశర్మ వద్దకు వె ల్లి, “పరమశివుడికి ప్రణామం!” అంటూ ఆయన కాళ్లపై సాష్టాంగ పడ్డాడు.
తరవాత అతను దేవశర్మతో వినయంగా,“మహాత్మా, జీవితసాగరం నిరుపయోగమైనది. సుఖాలు నిర్జల మేఘాలు. బంధుపుత్ర కళత్రాదులు కలలోని భ్రాంతి.
ఈ విషయం పూర్తిగా గ్రహించి మోక్షమార్గం తెలుసుకోవడానికి తమ వద్దకు వచ్చాను, నన్ను కరుణించి మి శిష్యుడిగా స్వీకరించి నాకు ముక్తిమార్గం ప్రసాదించండి అన్నాడు.
దేవశర్మ
ఈ మాటలు విని, "నాయనా ఇంత చిన్న ప్రాయంలో లౌకికలంపటాన్ని వదిలించుకున్న నీవు ధన్యుడవు. యౌవనంలో
సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం.
ఈ నిగ్రహబలమే నిన్ను మనుషులలో ఉన్నతుడిని చేస్తుంది.
జీవితంపై
ఆశలు లేని నువ్వు నన్ను మోక్షమార్గం అడిగావు. ఓం నమశ్శివాయ అంటూ
శివుడిపైన ఒక్క పుష్పం ఉంచిన వాడికి
మరి జన్మ లేదు, అన్నాడు.
ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకుని, “స్వామి,
ఆ మంత్రం ఎలా పునశ్చరణ చేయాలో
చెప్పి, నన్ను ధన్యుడిని చెయ్యండి, అన్నాడు.
“చెబుతాను,
నాయనా, అయితే నువు రాత్రివేళ
మఠంలోకి రాగూడదు. యతి (పాపంచిక
బంధాలకు దూరంగా ఉండాలి. అందుకు
గాను రాత్రివేళ ఒంటరిగా ఉండటం అవసరం.
ఉపదేశం పొందిన అనంతరం నువు
బయట ఉన్న పర్థకుటిరంలో పడుకో గురువాజ్ఞను
ఎన్నటికీ మీరకు,” అన్నాడు దేవశర్మ
ఆషాఢభూతి.
“స్వామీ, తమ ఆజ్ఞ శిరసావహిసాను,”
అన్నాడు.
ఆరాత్రి
పడుకోబోయేముందు దేవశర్మ ఆషాఢభూతికి
మంత్రోపదేశం చేసి, అతన్ని తన శిష్యుడుగా చేర్చుకున్నాడు.
అతను
రోజూ గురువుగారికి కాళ్లూ చేతులూ
పట్టి, పూజకు వూలూ, పత్రీ
తెచ్చి పెట్టి
సంతోష పరిచేవాడు. అయినప్పటికీ దేవశర్మతన
చంకలో ఉండే సంచీని ఆషాఢభూతికి
అందనిచ్చే ధోరణి ఏమీ కనబరచలేదు.
కాలం
గడుస్తున్నది. ఈ మనిషి నన్ను పూర్తిగా
ఎప్పటికీ నమ్మడా? పట్టపగలే ఇతన్ని
హత్య చేయాలా? లేక విషం పెట్టనా? లేక గొడ్డును చంపినట్లు కొట్టి చంపనా? అనుకున్నాడు
ఆషాడభూతి. బంగారం కోసం
దేనికైనా తెగించడానికి సిద్ధపడిపోయాడు
అషాఢభూతి. ఈ లోగా అవకాశం రానేవచ్చింది.
ఒకనాడు
ఒక భక్తుడి కొడుకు వచ్చి, దేవశర్మను
మర్నాడు తము ఇంట జరిగే యజ్ఞ్టోపవిత
ధారణకు దయచెయ్యమని ఆహ్వానించాడు.
ఆ ఆహ్వానాన్ని మన్నించాడు దేవశర్మ,
మర్నాడు
దేవశర్మ ఆషాఢభూతిని వెంటబెట్టుకుని,
ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలు
దేరాడు. వాళ్లు కొంత దూరం వెళ్లేసరికి
ఒక నది వచ్చింది.
దేవశర్మ
నదిని చూడగానే తన బట్టలు విప్పి,
చంకలోని సంచి తీసి బట్టల
మధ్య చుట్టిపెట్టాడు.
స్నానం
చెయ్యబోతూ, కాలకృత్యాలు నిర్వర్నించవలసిన
అవసరం వచ్చి, ఆషాఢభూతీ,
ఇప్పుడే వస్తాను. అంత దాకా ఈ బట్టలూ,
ముఖ్యంగా ఈ సంచీ చూస్తూ ఉండు.
అది శివుడి సొత్తు! అన్యులపాలు కానివ్వకు''
అని చెప్పి వెళ్లిపోయాడు.
దేవశర్మ
కనువురుగైన దాకా ఉండి, బంగారం
ఉన్న సంచి సంగ్రహించి, కాలి సత్తువ
కొద్దీ పారిపోయాడు ఆషాఢభూతి. (ఇంకా ఉంది)
0 Comments