దంతిలుడి కథ
దమనకం
సంజీవకానికి దంతిలుడి కథ ఇలా చెప్పింది:
వర్టమాన
నగరంలో దంతిలుడు అనే ఒక గొప్ప
వర్తకుడుండేవాడు. ఆయన నగర పాలకుడిగా
ఉండి, నగరానికి సంబంధించిన విషయాలన్ని
చూసేవాడు.
ఆయన రాజుగారి సాంత ఖర్చు వెచ్చాలు కూడా
చూసేవాడు. మెడమీది కత్తి లాంటి రాచరికపు
వ్యయాలను పకడ్పందీగా నిర్వహిస్తూ
ఆయన అటు రాజుగారినీ, ఇటు ప్రజలనూ
కూడా సంతోషపెట్టి, అందరి గౌరవమన్ననలనూ
పొందుతూ వచ్చాడు.
రాజుకు
హితుడైన వాణ్ణి ప్రజలు ద్విషిస్తా రనీ,
రాజ క్షేమానికీ, ప్రజా క్షేమానికి వైరుధ్యం ఉండటం
చేత ఉభయులనూ తృప్పపర చటం చాలా అరుదనీ చెబుతారు.
కాని దంతిలుడు
అలాటి అరుదైన మనిషి.
ఒకప్పుడు
దంతిలుడు తన కుమార్తె వివాహం
జరిపాడు. దానికి ఆయన పౌరులనూ,
రాజోద్యోగులనూ ఆహ్వానించి, విందు భోజనాలు
పెట్టి, విలువైన బట్టలు పెట్టి పంపేశాడు.
వివాహం
పూర్తి అయ్యాక ఆయన వధూ వరులను
ఆశీర్వదించటానికి రాజునూ, ఆయన భార్యలనూ ఆహ్వానించాడు. వారు ఆహ్వానం
అందుకున్నారు.
ముందుగా
దివాణం నుంచి అనేక మంది ఉద్యోగులూ,
నౌకర్లూ దంతిలుడి ఇంటికి వచ్చారు.
వారిలో రాజుగారి ఇంట కసువు ఊద్చేవాడు
గోరభుడు అనేవాడు కూడా ఉన్నాడు.
గోరభుడు
ఆస్థాన గౌరవమర్యాదలు పాటించక
రాజ పురోహితుడి కొరకు ఏర్పాటు చేసిన
ఆసనంలో వెళ్లి కూర్చుని లేవ నిరాకరించాడు.
అర్హతకు అనువుకాని సత్కారాన్ని కోరటం
పద్ధతి కాదని నచ్చచెప్పినా
వినక పోవడంతో
దంతిలుడు వాణ్ణి బయటకు 'గెంటించాడు.
తరవాత రాజు తన రాణులతో సహా వచ్చి, దంతిలుడు చేసిన సత్కారాలు పొందాడు.
దంతిలుడి
ఇంట తనకు జరిగిన ఘోరమైన అవమానానికి ఉడికి పోతూ గోరభుడు ఆ రాత్రి నిద్రపోలేదు. వాడు ఇలా ఆలోచించాడు.
ఈ అవమానానికి ప్రతిక్రియ ఏమిటి?
దంతిలుడిపై
రాజుకు ఆగ్రహం తెప్బంచి, అవమానం
పాలు చేయ్యగలనా? లేక నేను ఏమీ చెయ్యలేక అవమానంతో కృశించి పోవలసినదేనా?
గుండెల్లో నిత్యమూ రగిలే బాధను
చూస్తూ నిస్సహాయంగా బతికే బతుకు
వ్యర్థం!
పగ తీర్చుకోలేకుండా ఆగ్రహం చెందేవాడు
సిగ్గుమాలిన వాడు. పెనం మిద
వేసిన ఆవగింజ
ఎంత ఎగిరిపడినా పెనాన్ని విరగ గొట్టలేదు.
నేను కసువు ఊద్బేవాబ్దీ, ఆయన కోటీశ్వరుడూ,
నగర పాలకుడూ; అయినా నన్ను
అవమానించి ఆయన తప్పించుకు పోలెడని
చూపిసాను. అని శపధం చేశాడు.
రాజుగారు
పక్కవదలక ముందే ప్రతి రోజూ
రాజుగారి శయనాగారం చిమ్మటం గోరభుడి
పని. ఇది జరిగిన మర్నాటి
ఉదయం రాజుగారు
నిద్రలేచి, ఇంకా పక్కమిదనే ఉండగా,
గోరభుడు గది చిమ్ముతూ, “దంతిలుడు
పెద్ద రాణీగారిని ఆలింగనం చేసుకోవడం
ఎంత సాహసం!” అని రాజుకు వినబడేలా
గొణుక్కున్నాడు.
ఈ మాటలు విని రాజు
చివాలున లేచి, “ఒరే
నువ్వు ఇప్పుడు గొణిగినది నిజమా? దంతిలుడు
పెద్దరాణీని కొగలించంకున్నాడా?
' అని అడిగాడు.
““దొరా,
రాత్రి పొద్దుపోయేదాకా పాచికలాడుతూ
మేలుకుని ఉండటం చేత, నిద్రమత్తుతో
జోగుతూ ఎమన్నానో నాకే తెలీదు అన్నాడు
గోరభుడు.
రాజు
తనలో “'రాణులుండే గదులలోకి వెళ్లే
పర పురుషులు దంతిలుడూ, ఈ గోరభుడూ
మాత్రమే. అందుచేత దంతిలుడు పెద్దరాణిని
ఆలింగనం చేసుకోవడం ఈ గోరభుడి
కంట పడి ఉండవచ్చు.
నిన్న
సాయంకాలం దంతిలుడు పెద్ద రాణి పట్ల, మిగిలిన రాణుల పట్ల కన్న, హచ్చు
శ్రద్ద చూపటమూ, ఆవిడ అతనితో కొంచెం
హెచ్చు చనువుగా ఉండటమూ గమనించి
అదంతా లాంఛన మనుకున్నాను. కాని
వీడు అనే మాటలను బట్టి
అందులో విశేషార్దం
కనిపిస్తున్నది.
తాగుబోతుల
నోటా, నిద్రపోయేవారి నోటా రహస్యాలు
బయటపడతాయి. అనెకమంది భార్యలు
ఉండటం చేత నేను పెద్ద
రాణి పట్ల నిర్లక్ష్యంగా
ఉంటున్న మాట నిజమే. అందుచేత ఆమె దంతిలుడి ప్రేమ
కోసం ఆశపడి ఉండవచ్చు.
నాకు ఎంత కష్టం వచ్చింది! అనుకుని
దంతిలుణ్ణి రాజభవనంలో అడుగు పెట్టనివ్వవద్దని
ద్వారపాలకులకు ఉత్తర్వుచ్చాడు.
ఆ ఉదయం దంతిలుడు ఎప్పటిలాగే రాజభవనానికి
వచ్చి, ద్వారపాలకులు తనను లోనికి
పోనివ్వక పోవటం చూసి ఆశ్చర్యపడి “నన్ను
లోపలకు పోవద్దనటానికి మీకెన్ని గుండెలు!
అన్నాడు.
“అయ్యా,
మాపైన కోప్పడకండి. ఇది రాజుగారి
ఉత్తరువు, అన్నారు వాళ్లు.
““రాజుగారి
ఉత్తరువా? ఆయన అలాటి ఉత్తరువు
ఒక్కనాటికీ ఇయ్యడు, ' అన్నాడు దంతిలుడు.
“సరేలెండి.
రాజుగారికి మీమిద ఎందుకో చాలా
కోపం వచ్చి ఉండాలి. ఆయన
ఉత్తరువు
ఇచ్చారు. దాన్ని పాలించటం మా ఐథధాయకం,
' అన్నారు ద్వారపాలకులు.
రాజుగారికి
తనపై కలిగిన అకారణ క్రోధానికి
దంతిలుడు నిర్దాంతపోయి తనలో ఇలా అనుకున్నాడు: "డబ్బు రావటంతో గర్వించనివాడూ, భోగలాలసత వల్ల ఎటో ఒక చిక్కు రానివాడూ, రాజుగారి ప్రేమకు నిజంగా పాత్రుడైనవాడూ,
చావును తప్పించుకున్న వాడూ,
గౌరవం పొందిన యాచకుడూ ఉండడని పెద్దలు చెబుతారు...
““కాకిలో
శౌెచమూ, జూదరిలో నిజమూ, త్రాగుబోతులో
వేదాంతమూ ఎవరు చూశారు? నేను
రాజుకు గాని, రాజ బంధువులకు
గాని కలలో
కూడా ఎలాంటి అన్యాయమూ చేసి ఎరగనే,
రాజుకు నాపై ఆగ్రహం ఎల
కలిగింది?”
దంతిలుడు
నిస్సహాయుడై నిలబడి ఉండటం
చూసి గోరభుడు ద్వారపాలకులతో ““నన్ను
ఈయనగారు నిన్న తన ఇంట్లోంచి బయటికి
గెంటేసినట్టే మీరు ఈయనగారిని ఇప్పుడు
బయటికి గెంటండి, అన్నాడు.
ఇది విని దంతిలుడు, ఈ
గోరభుడే దీని కంతకూ
కారకుడని గ్రహించి, ఆ రాత్రి గోరభుణ్జి
తన ఇంటికి పిలిచి, వాడికి మేలైన బట్టలు
పెట్టి, “నాయనా, నేను నిన్ను పొగరెక్కి
అవమానించలేదు. రాజపురోహితుడి ఆసనం
మిద కూర్చుని దిగమంటిే దిగక, చెజేతులా
అమూనం తెచ్చిపెట్టుకున్నావు, అన్నాడు.
గోరభుడు
తనకు పెట్టిన బట్టలు చూసి మహదానందం
చెంది, ఆ అవమానం అప్పుడె పోయింది
లెండి. రాజుగారికి మీమిద మళ్ళి అనుగ్రహం కలిగేటట్టు ఎలా
చేస్తానో చూడండి.”
అని వెళ్లిపోయాడు.
మర్నాడు
ఉదయం రాజుగారు పక్కమిద మేలుకుని
పడుకుని ఉండగా గోరభుడు గది చిమ్ముతూ,
రాజ్యమేలే రాజుగారికి ఇంగిత జ్ఞానం
లేదేం? దొడ్డికి వెళ్లి దోసకాయలు తింటాడు!
అని గొణిగాడు.
రాజుగారు
ఆ మాట విని, గోరభుణ్ణి
దగ్గరికి
పిలిచి, ''ఎందుకురా మూర్చుడా అబద్దాలాడుతున్నావు?
మరొకడైతే అక్కడే వాడిని చంపేసి
ఉందును. ఎంత కండకావరం? నేను దొడ్డికి
పోయి దోసకాయలు తినగా నువు చూశావురా?”'
అని అడిగాడు.
''తప్పుకాయండి
దొరా, రాత్రి చాలా పొద్దుపోయిన
దాకా పాచికలాడటం చేత నిద్రమత్తున
ఏమన్నానో నాకే తెలీదు. క్షమించండి,
'' అని పాత పాటే పాడాడు
గోరభుడు.
ఒక్కసారిగా
రాజుకు జ్ఞానోదయమైంది. వాడి
మాటకు ఎమి విలువ లేదని
తనకు తెలిసిపోయింది.
నిజంగానే దంతిలుడికి తాను
చాలా అన్యాయం చేశాడు. అతను చాలా
పెద్దమనిషి ఎన్నడూ తప్పుడు పనులు చెయ్యనివాడు.
అదీగాక, దంతిలుణ్జి ఒక రోజు రానివ్వక పోయేసరికి, దివాణం పనులూ, నగరం పనులూ అస్త్వవ్యసమయిపోయాయి. యధార్ధం
తేటతెల్లమవగానే రాజు దంతిలుణ్ణి పిలవనంపి,
ఆయనకు మంచి బట్టలూ, కానుకలూ
ఇచ్చి, ఎప్పటిలాగే పదవిలో ఉండనిచ్చాడు. (ఇంకా ఉంది)
0 Comments