పంచతంత్రం - మిత్రభేదం 2
అన్నా
తన స్వార్ధమే చూసుకుంటూ, ఎదో విధంగా
పొట్టపోసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నవాడు
పైకి రాలేడు. కడుపు నిండినంత మాత్రాన
ఉత్తమ జీవితం అలవడదు. చివరకు కాకి కూడా తన
ముక్కుకు అందిన చెత్త తిని
కడుపు నింపుకుంటుంది. మిత్రులకూ, గురువులకూ,
భృత్యులకూ, ఆపదలో ఉన్న వారికీ
ఉపకరించని జీవితం ఏమి జీవితం? ఒక ఎముక దొరికితే, దానితో
కడుపు నిండక పోయినా
కుక్క సంతృప్తి చెందుతుంది. తోక ఆడిస్తూ,
నోరు తెరిచి, వెల్లికిలాపడి తిండి కోసం
ప్రాధేయ పడే జంతువును చూసి
మనం ఎలా హర్షించగలం? ఏనుగు అలా కాదు;
అది ఆత్మాభిమానం
గలది. ఎంతో బతిమాలితేనే గాని
ఏమీ తినదు. సింహం తన పంజాకు అందుబాటులో
ఉన్న నక్కను కూడా కొట్టదు; అది మదపుటేనుగును మాత్రమే చంపుతుంది.
చంపటంలో కూడా ప్రకృతి ధర్మం ఉంటుంది.
అలాంటప్పుడు జీవించటంలో ఇంకింత
ఉండవచ్చు? చిన్న గుంట త్వరగా నిండుతుంది.
అలాగే హీనులు కొద్ది ఆర్జనతో తృప్తిపడతారు.
మంచి చెడ్డలకూ, ఉచ్చ నీచాలకూ
తేడా లేకపోయినా; సంస్కారం సంపాదించిన
మనం విధిని ధిక్కరించక, పశు ప్రవృత్తితో తృప్తి చెందినా; మానవులు మానవమృగాలుగా
ఉండిపోతారే తప్ప వారికీ
జంతువులకూ తేడా ఎమిటి?"
“కాని,
ఇందులో మన కర్తవ్యం ప్రసక్తం ఏమున్నది?
కర్తవ్య నిర్వహణకు మనం సింహం
కింద కొలువు చెయ్యటం లేదు గదా!”
అన్నది కరటకం.
“పిచ్చివాడా,
ఉద్యోగాలు ఉంటాయి, ఊడుతాయి.
కర్తవ్యం మటుకు ఎల్లప్పుడూ ఉంటుంది.
అర్హులకు పదవుల అవకాశం లేకపోదు.
అనర్హులే త్వరగా తమ పదవులను కోల్పోతారు.
క్రియకు గౌరవాగౌరవాలు మన అర్హతను బట్టి కలుగుతాయి. రాయిని కొండ మీదికి
ఎక్కించటం ఎంతో కష్టం, కిందికి దొర్లించటం చాలా లేలిక. అలాగే గౌరవ మర్యాదలు
సంపాదించటం శ్రమతో కూడిన పని కుక్షింభరులైన చవటలుగా ఉండిపోవటానికి
ఏ శ్రమ అవసరం లేదు అన్నది దమనకం.
“సరి,
ఇంతకూ నీ ఉద్దేశం ఎమిటి?
మన ఏలిక
అయిన సింహాన్ని ఎమి అడుగుదామనుకుంటున్నావు?
'' దానికి ఎం చెప్పాలనుకుంటున్నావు?
అని కరటకం అడిగింది.
“మన ఏలిక దేన్నో చూసి
గాని, ఏదో వినిగాని
భయపడినట్టున్నది. దాని భయం చూసి, దాని భృత్యులైన మిగిలిన మృగాలూ భయపడ్డాయి.
ఏలికకు ఏం చెయ్యటానికీ పాలుబోకుండా
ఉన్నది, అన్నది కరటకం.
“థైర్యం
గల వారికి ప్రమాద భయంఉండదు.
రాజుకు హితమైనది అడగకపోయినా
చెప్పటం పౌరుడి ధర్మం. అదీ గాక రాజుగారి
మన్ననలు పొందగోరే వాళ్ళు రాజుకు
సన్నిహితంగా ఉండాలి. రాజుకు సన్నిహితుడై
మసలేవాడు, రాజుగారి తత్వం మిగిలిన
వారికన్నా సులభంగా గ్రహిస్తాడు, అన్నది
దమనకం.
“సరే,
నీ కంత పట్టుదలగా ఉంటే
వెళ్ళు. కాని
జాగ్రత్తగా ఉండు సుమా. మన
ఇద్దరి అదృష్టమూ
నీ విజయం మీద ఆధారపడి ఉన్నది,
అన్నది కరటకం.
దమనకం
తన అన్నకు నమస్కారం చేసి పింగళకం వద్దకు
వెళ్ళింది.
పింగళకం
దమనకాన్ని చూసి, '“దాన్నినా దగ్గిరికి రానివ్వండి. అదినా పాత భృత్యుడి
కొడుకు, అని తన అనుచరులతో
అన్నది. దమనకం సింహం సన్నిధికి
వచ్చి, సింహానికి నమస్కరించి, సింహం అనుమతితో కూర్చున్నది.
“కులాసాగా
ఉన్నావా ఇంత కాలం నాకు
అసలు కనపడలేదెం ఇప్పుడు రావటానికి కారణమేమిటి?'' అని పింగళకం అడిగింది.
“ఎలికపిలవనంపక
పోయినా, రావటం నా ధర్మమని తోచింది. నావంటి అల్పుడి వల్ల కూడా
ప్రయోజనం ఉంటుంది. తరతరాలుగా
తమను కొలిచిన వాళ్ళం కావటం చేత మంచి
కాలంలోనూ, కష్టకాలంలోనూ మాకు తమరిని
అనుసరించటం విధాయరకం. “నన్ను ఇంత కాలం ఎందుకు చూడరాలేదు?
' అని తమరు
అడిగారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
అయినా, నన్ను తమరు తమ
మంత్రి వర్గంలో చేర్పారా? ఆలోచనకు రమ్మని పిలిచారా?
భృత్యులలో అర్హులెవరో, అనర్హులెవరో యజమాని
గ్రహించనప్పుడు అర్హులైనవారు యజమానులకు
దూరంగా ఉండిపోతారు, అన్నది
దమనకం,
“నక్కా,
ఇంతకూ నువ్వు చెప్పదలిచిన దేమిటి?
' అన్నది పింగళకం. కాస్త చిరాగ్గా. “నక్కనని
నన్ను తమరు చిన్నచూపు చూడవద్దు.
మేలైనపట్టు, పురుగుల నుంచి వస్తుంది.
రాతి నుంచి బంగారం వస్తుంది. కర్ర
నుంచి అగ్ని వస్తుంది. దీనిని
బట్టి జన్మలో
ఎమీ లేదు, గుణం ప్రధానం
అని తెలుస్తుంది.
అందుచేత నన్ను తమరు హీనంగా
చూడవద్దు. నేను విశ్వాసపాత్రుణ్ణి, దూరంగా
ఉన్నప్పటికీ ప్రభువుల మేలు కోరెవాణ్డీ.
ఇతరులలాగా స్వలాభం చూసుకునే
వాణ్ణి కాను, అన్నది దమనకం.
“నాకు
తెలియదా? ఇవాళ నీ రాకకు కారణం
ఎమిటో చెప్పు, ' అన్నది పింగళకం ఆత్రుతగా.
“'క్షమిస్తానంటే
నేనొక ముఖ్య విషయం తమతో
చర్చించాలి. ప్రభువులవారు నీరు తాగటానికి
నది వద్దకు వెళ్ళి, అంతలోనే తాగకుండా
ఎందుకు తిరిగి వచ్చారు?” అని దమనకం
అడిగింది మెల్లగా.
తన భయం గురించి ఈ
నక్కకు తెలియనివ్వటం
మంచిది కాదని, "ప్రత్యేకించి కారణం
ఏమీ లేదు. తాగబుద్ది కాలేదు తిరిగి
వచ్చేశాను, అన్నది పింగళకం.
“చెప్పకూడని
రహస్యమైతే పోనియ్యండి. అన్ని
విషయాలూ అందరితోనూ చెప్పదగినవి కావు, అన్నది దమనకం.
దమనకం
బుద్ధి సూక్ష్మతలో గురి కుదిరి, పింగళకం, ““మన అరణ్యంలోకి ఎదో ఒక భయంకరమైన
మృగం వచ్చింది. దాని రంకే మహాభయంకరం!
అలాంటి భయంకరమైన ధ్వనిని
నేను మునిపేప్పుడు విని ఉండలేదు. అందువల్ల
నేను ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి పోదామనుకుంటున్నాను,
అన్నది.
“అదేమిటి!
ఏలిన వారు ధ్వనికే భయపడుతున్నారా?
మీ వంటి వారి నోటి
నుంచి అలాంటి
మాట రావడం విడ్డూరంగా ఉంది. అదీగాక
ధ్వనులన్ని ప్రమాదం కలిగించవు. ఉరుములు
వింటాం. తుపాను ధ్వని వింటాం. కాని
ఇవి మనకు కీడు చేయవు.
ధైర్యశాలి దేనికీ
భయపడడు, విధికి కూడా జడియడు. మీరు,
ధైర్యంగా ఉండండి. మిరు విన్నరంకిను
లక్ష్యపెట్టకంది. అవునూ, మీరు రణదుందుభి
కథ వినలేదా? ' అన్నది దమనకం.
“ఏమిటా
కథ?” అని పింగళం అడిగింది. దమనకం
ఇలా చెప్పంది:
ఆకలి
గొన్న ఒక నక్క ఆహారం
కోసం వెతుకుతూ
యుద్ధభూమికి వెళ్ళుంది. అక్కడ దానికొక
భయంకరమైన ధ్వని వినవచ్చింది. నక్క
భయపడి, “చచ్చానురా, దేవుడా! ' అనుకుని
వెనక్కు తిరిగి పరిగెత్తింది. మళ్ళీ ధైర్యం
కూడదీసుకుని తీరా చూస్తే ఒక
చెట్టుకింద
కొమ్మకు ఒక రణదుందుఖి కట్టి
ఉన్నది. గాలికి
కొమ్మలు కదిలి, దాన్ని కొట్టటం చేత భయంకర
ధ్వని వస్తున్నది. దాని నిండా మాంసం
ఉంటుంది. తినవచ్చుననుకుని ఆ నక్క
దాన్ని ఒక పక్క నుంచి
కొరికి రంధ్రం చేసింది. s
కాని ఆ దుందుభిలో కొయ్యా, చర్మమూ తప్ప నక్కకు ఏమి కనిపించలేదు. దమనకం ఈ కథ చెప్పి, “కేవలం ధ్వనులను బట్టి ఏమి నిర్ణయించరాదు,” భయపడకూడదు అన్నది. (ఇంకా ఉంది)
కాని ఆ దుందుభిలో కొయ్యా, చర్మమూ తప్ప నక్కకు ఏమి కనిపించలేదు. దమనకం ఈ కథ చెప్పి, “కేవలం ధ్వనులను బట్టి ఏమి నిర్ణయించరాదు,” భయపడకూడదు అన్నది. (ఇంకా ఉంది)
0 Comments