పంచతంత్ర కథలు - మిత్రభేదం
ఆయన ఒకనాడు తన మంత్రులను పిలిచి,
నా కొడుకులు మూఢులన్న సంగతి మీరెరుగుదురు.
జ్ఞానమూ, సద్బుద్దీ లేని కొడుకు
గొడ్డుమోతు ఆవులాగా నిరర్ధకం. అలాంటి
కొడుకులను కనేకన్నా సంతానం లేకుండా
ఉండడమే మేలు; సన్యసించటం మేలు.
అందుచేత నా కొడుకులలో జ్ఞానాన్ని వికసింపచేసి,
వారిలో రాజనీతీ, పరిపాలనా దక్షతా
కలిగించేమార్గం ఐదో చెప్పండి,” అన్నాడు.
“'ఈ నగరంలోనే విష్ణుశర్మ అనే గురువు ఉన్నాడు.
ఆయన సమస్త కళలను కాచి వడబోసినవాడు.
అంతే కాదు; ఆయన చాలా సులువుగా
విద్యాబోధ చెయ్యగలడు. ఆయనకు మహారాజుగారు తమ కుమారులను అప్పగించినట్టయితే
అతి శీఘ్రకాలంలో ఆయన వారిని రాజనీతిలోనూ, ప్రపంచ జ్ఞానంలోను ఆరితేరేటట్టు చేయగలడు, అని ఒక మంత్రి చెవ్పాడు.
రాజు
విష్ణుశర్మను పిలిపించి, తన కొడుకులకు
రాజనితీ, వివేకమూ నేర్పినట్టయిళతే నూరుగ్రామాలు ఇస్తానన్నాడు.
“మహారాజా,
నేను విద్యను విక్రయించను.
ఎనభై ఎళ్ళవాళణ్ణి, నాకు ధనం ఎందుకు? అడిగిన
వారికి విద్యాదానం చెయ్యటం నా రాజనీతీ,
వివేకమూ కలిగిస్తాను, అన్నాడు విష్ణుశర్మ,
రాజుసంతోషించి,
తనపిల్లలను ఆయనకు అప్పగించాడు.
ఆయన వారికి పంచతంత్రం అనేది
అయిదు భాగాలుగా చెప్పాడు. ఆ భాగాలేవంటే-మిత్రభేదం, మిత్రసంప్రాప్తి, కాకోలూకీయం,
లబ్బప్రణాశం, అపరీక్షిత కారకం.
విష్ణుశర్మ చెప్పిన ఈ పంచతంత్రం ద్వారా
రాజకుమారులు అయిదు మాసాలలో రాజనీతిలోనూ,
లోకజ్ఞానంలోనూ ఆరిలేరిన వారైనారు.
1. సింహము-ఎద్దు
దక్షిణదేశంలో
మహిళారూప్యమనే నగరంలో వర్హమానుడనే
వర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప
ధనికుడు, నీతిపరుడూ, దాతకూడానూ. ఆయన,
ధనాన్ని ధర్మబద్ధమైన వ్యాపారం ద్వారా
తేలికగా సంపాదించి, వివేకంతో ఖర్చు చేసేవాడు.
ఒకనాడు
ఆయన రెండెడ్లబళ్ళ మీద ఖరీదైన
వర్తకపు సరుకులు వేసుకుని, యమునా
తీరానగల మధురానగరానికి బయలుదేరాడు.
ఒక బండికి కట్టిన నందికం, సంజీవకం
అనేవి మేలైన ఎద్దులు.
కొన్నాళ్ళకు
బిడారు యమునా తీరానగల అడవిని
చేరుకున్నది. ఆ అడవిలో అనేక రకాలచెట్లూ, అడవి జంతువులూ ఉండేవి. ఇక్కడ
సంజీవకం అనే ఎద్దు బురదనేల మీద కాలుజారి,
మడమ విరిగి, పడిపోయి కదలలేకపోయింది.
బండివాడు వర్ణమానుడికి తానసంగతి
చెవ్పాడు.
వర్ధమానుడు
ఎంతో చింతించి, అయిదు రోజులపాటు
ప్రయాణం నిలిపి, సంజీవకానికి
చికిత్సలు చేయించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ఆయన శీఘ్రంగా మధుర
చేరుకుని, పని చూసుకోవలసి ఉండటం
చేత, సంజీవకానికి బండివాణ్ణో, మరొక
సేవకుణ్లీ తోడు ఉంచి, తగినంత మేతా,
డబ్బూ వారికి ఇచ్చి, “ఎద్దును శ్రద్ధగా సంరక్షించి,
బాగుకాగానే నా వద్దకు తీసుకు రండి.
ఒకవేళ అది చావటం జరిగితే,
దానికి శ్రద్దగా
దహన సంస్కారాలు జరిపి మీరు వచ్చెయ్యండి,
'' అన్నాడు.
ఇలా చెప్పి ఆయన తన బళ్ళనూ,
సరుకునూ
మధురకు తరలించుకుని వెళ్ళిపోయాడు.
ఆ ఇద్దరు మనుషులూ ఒంటరిగా అడవిలో
ఉండటానికి భయపడి, ఎద్దును దాని
మానాన అక్కడే వదిలేసి, మర్నాడే తమ యజమానిని
చేరుకుని, ఎద్దు చచ్చిపోయిందని చెప్పారు.
అయితే,
అదృష్టవశాన సంజీవకం కోలుకున్నది.
అది క్రమంగా లేచి, కుంటుతూ తిరగసాగింది.
అది నింపాదిగా నడుచుకుంటూ,
అరణ్యంగుండా యమునానది ప్రవహించే
చోటుకు చేరుకున్నది. అది నది ఒడ్డున
గల పుష్టికరమైన గడ్డిమేసి, స్వచమైన నదీ జలం తాగి త్వరలోనే
బలాన్నీ, ఆరోగ్యాన్నీ పొంది,
శివుడి వాహనమైన నందికి సమానంగా తయారైంది.
ఆ అరణ్యంలోనే పింగళకం అనే సింహం, నక్కలనూ,
ఇతర జంతువులనూ పరివారంగా పెట్టుకుని
నివసిస్తున్నది. ఆ సింహం ఒకనాడు యమునలో
నీరు తాగబోయి, సంజీవకం పెట్టిన
పెద్ద రంక విని, అలాంటి
భయంకర ధ్వనిచేసే
ప్రాణి ఎమై ఉంటుందో తెలియక బెదిరిపోయింది.
అది తన భయాన్ని పైకి తెలియనివ్వక,
నీరు తాగే ప్రయత్నం మాని, మర్రిచెట్టు
కింద తన నివాసానికి తిరిగి
వచ్చి, జరిగిన
దాన్ని గురించి ఆలోచించసాగింది. ఇతర మృగాలు దాన్ని పరివెష్టించి ఉన్నాయి. భయపడినప్పటికి దాని గాంభీర్యం తగ్గలేదు.
మృగరాజుకు మనిషి రాజులలాగా అభిషేకమూ,
దుస్తులూ, చదువులూ, అవసరం లేదు. ప్రకృతే దానిని
రాజుగా సృష్టించింది.
సింహం
వెంట ఉన్న జంతువులలో కరటకమూ,
దమనకమూ అనే రెండు నక్కలున్నాయి.
అవి పూర్వం సింహం కింద కొలువు చేసిన
జంతువు బిడ్డలు. ప్రస్తుతం వాటికి పదవి
లేదు. సింహం నది దాకా
వెళ్ళికూడా నీరు
తాగకుండా తిరిగి రావటం దమనకం గమనించింది.
అది తన తోబుట్టువైన కరటకాన్ని
ఎడంగా తీసుకుపోయి, “మన ఎలిక అయిన
పింగళకాన్ని చూశావా? నీరు తాగటానికి
యమున వద్దకు వెళ్ళింది. నీరు తాగకుండా
ఆకస్మాకంగా ఎ౦దుకు తిరిగి వచ్చిందీ?
దాని ముఖం మరీ దీనంగానూ, విహ్వాలంగానూ
ఎందుకు ఉన్నదీ?” అని అడిగింది.
దానికి
కరటకం, “'తమ్ముడూ, ఎప్పుడు గాని
రాజుకు సంబంధించిన విషయాలలో అనవసరంగా
జోక్యం కలిగించుకోకు. అలా చపలచిత్తంతో
లేనిపోని విషయాలలో జోక్యం కలిగించుకునే
వాళ్ళు, సీల పెరికిన కోతిలాగా వెంటనే నశించిపోతారు ,””
అన్నది. “అదెలాగ?” అని అడిగింది దమనకం ఆశ్చర్యంతో.
కరటకం
చిలిపికోతి కథ ఇలా చెప్పింది: ఒక నగరం వెలుపల ఒక
వర్తకుడు ఆలయం కట్టిస్తున్నాడు.
ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ పనివాళ్ళు
తిండి తినటానికి నగరానికి వెళతారు.
ఆ ప్రదేశమంతటా పెద్ద పెద్ద దుంగలను రంపాలతో కోస్తారు.
ఒకనాడు, కట్టుతూ ఉన్న దేవాలయం దగ్గిరికి కోతుల మంద వచ్చింది. ఒక బ్రహ్మాండమైన మాను సగం కోసి ఉన్నది. పసవాళ్ళు కోత ఆగిన చోట దుంగలో బిగువుగా ఒకసీల గుచ్చారు.
ఒకనాడు, కట్టుతూ ఉన్న దేవాలయం దగ్గిరికి కోతుల మంద వచ్చింది. ఒక బ్రహ్మాండమైన మాను సగం కోసి ఉన్నది. పసవాళ్ళు కోత ఆగిన చోట దుంగలో బిగువుగా ఒకసీల గుచ్చారు.
కోతులన్నీ
గెంతుతూ ఆడుతూ ఉంటే ఒక చిలిపి కోతి ఆ సీలను
చూసి, “ఇది ఇక్కడ
ఎందుకున్నదీ? ' అనుకుని, సీలను రెండు
చేతులా పట్టి బలం కొద్దీ
పెరికింది. సీల లాగగానే, ఎడంగా ఉన్న దుంగ
భాగాలు కలుసుకున్నాయి.
కోతి వాటి సందున నలిగి చచ్చిపోయింది.
కరటకం
ఈ కథ చెప్పి, “అందుకే
నువ్వు లేనిపోని
విషయాల జోలికి పోవద్దన్నాను. పిచ్చివాడా,
మనకు కొలువు లేక పోయినా, ప్రభువు
వదిలిన ఆహారం తిని బాగానే
బతుకుతున్నాం.
ఈ కాస్తా పోగొట్టుకోవటందేనికి?”' అన్నది. కరటకం కోతి కథ చెప్పగానే దమనకం ఇలా అన్నది: (ఇంకావుంది)
0 Comments