సర్పముఖి

Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడురాజానువు అర్దరాత్రి వేళ  ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు. బహశా నీవు ఏ దేవతనయినా సంతృప్తి పరిచి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా చేస్తున్నట్లయితే ఆ మేరకు నీ నిర్ణయం మంచిదే అవుతుందిసర్పముఖంతో పుట్టిన తన కూతురుకు మానవ రూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఒక రాజు కథను సందర్భంగా నీకు చెబుతాను. తన ప్రార్ధనలకు మెచ్చి నాగదేవత తనముందు ప్రత్యక్షమైనప్పుడు రాజు మరొక సమస్యను కూడా పరిష్కరించు కోడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. విశేషమేమిటో చెబుతాను, శ్రమతెలియకుండా వినుఅని కథ చెప్పసాగాడు.
జ్ఞానదీపిక రాజ్యం రాజు జీమూత వాహనుడు ధార్మికుడు. ప్రజాసంక్షమ పథకాలు ప్రవెశపెట్టడంలోనూ, ప్రజల బాగోగులు చూడడంలోనూ అతనిది అందెవేసిన చెయ్యి. జీమూతవాహనుడి పట్టమపిషి చూడామణి దేవి భర్తకు తగిన ఇల్లాలురాజదంపతులకు సందీపుడు ఒక్కడే కొడుకు. వయసు అయిదేళ్లు మించదు.
రాజదంపతులు ఒకసారి వనవిహారానికి వెళ్లారు. మధ్యాహ్నం భోజనానంతరం యువరాజుతో కలిసి తమ కోసం నిర్మించిన గుడారంలో విశ్రాంతి తీసుకోసాగారువిశ్రాంతి సమయంలో వారికి చిన్నపాటి కునుకు పట్టింది.
సమయంలో నిద్రిస్తున్న యువరాజు మీద ఎండ పడసాగింది. అదే సమయానికి గుడారంలోకి ఒక నాగసర్పం వచ్చింది. బాలుడి మీద ఎండ పడడం చూసిన నాగసర్పం పడగ విప్పి యువరాజు శిరస్సుమీద ఎండ పడకుండా గొడుగు పట్టింది.
అదే సమయానికి కళ్ళు తెరిచిన మహా రాజుకు దృశ్యం భయం గొలిపిందిఅతను, నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదం శంకించి ప్రక్కనున్న కత్తి అందుకుని పైకి లేచి తటాలున నాగసర్పం శిరసు ఖండించాడు. నాగసర్పం గిలగిలా కొట్టుకుని మరణించింది.
సవ్వడికి మేల్కొన్న మహారాణి జరిగిన సంఘటన తెలుసుకుని భీతిల్లి యువరాజును అక్కున చేర్చుకుందిమరికొంచెం సేపటికి రాజదంపతులుయువరాజుతో కలిసి అంతఃపురం చేరుకున్నారు.
సంఘటన జరిగిన కొంత కాలానికి మహారాణి చూడామణి దేవి గర్భం ధరించింది. శుభవార్త తెలుసుకుని మహారాజుతో పాటు, రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు. నెలలు నిండిన మహారాణి ఒక ఆడశిశువును ప్రసవించింది. ప్రసవించిన బిడ్డను చూసి మంత్రసానులు భీతి చెందారు. ఎందుకంటె జన్మించిన బిడ్డకు దేహమంతా మానవదేహమే కాని శిరస్సు స్థానంలో పాము తల ఉంది.
క్షణాల్లో వార్త మహారాజు చెవిన పడింది. అతను హటాహటిన అక్కడికి వచ్చి జన్మించిన బిడ్డను చూసి బాధతో విల విల్లాడాడు. అతనా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
రాజ్యవాసులకు మహారాణి, ఆడ శిశువును ప్రసవించిందన్న వార్త మాత్రమే తెలిసింది గాని బిడ్డ సర్పముఖముతో జన్మించిన విషయం తెలియలేదు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
అటువంటి బిడ్డ పుట్టడానికి కారణం మహారాజు నాగసర్పం శిరస్సు ఖండించడమేనని మహారాణి భావించి మహారాజుతో మనవి చేసింది. మహారాజు సర్పదోష నివారణకు పూజలు జరిపించాడు. అయితే ఫలితం కానరాలేదు.
జ్యోతిష్కులు యువరాణి జాతకం చూసి విషయం చెప్పడానికి తటపటాయించారు. మహారాజు పదే పదే అడగ్గారాజాయువరాణి జన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికి ఆపద రానున్నది అని మనవి చేశారు. యువరాణికి రాగచంద్రిక అని నామకరణం చేశారు. రాజదంపతులు మాత్రం యువరాణిని సర్పముఖి అని పిలుచుకోసాగారు. జీమూత వాహనుడు ఎందరో రుషులను, మునీశ్వరులను కలిసి తనకు జన్మించిన బిడ్డకి మామూలు రూపు వచ్చేలా చూడమని ప్రార్ధించాడు. అయితే వాళ్లు అదంత తేలికయిన విషయం కాదని తేల్చి చెప్పారు.
సర్పముఖికి అయిదేళ్ల ప్రాయంవచ్చింది. అంతలో రాజ్యంలో క్షామం అలుముకుంది. వర్హాలు పడలేదు. పచ్చటి పంట పొలాలు బీళ్లుగా మారాయి. త్రాగు నీటికి కట కట అయింది. పచ్చిక లేక పశువులు మరణించసాగాయి.
పరిస్థితికి కారణం యువరాణి జననమేనని అర్ధం చేసుకున్నాడు జీమూతవాహనుడు. అతను ప్రజాక్షేమం గురించి విచారిస్తుండగా, అతని దగ్గరకు దివ్యచరితుడు అనే సన్యాసి వచ్చి కలిశాడు. “రాజానీ మనోవ్యాధి నాకు తెలుసు. సర్ప్వముఖి జననం. రాజ్యంలోని క్షామం నీ మనసును కలిచివేస్తున్నాయి. అవునా,” అని అడిగాడు.
తను చెప్పకుండానే యువరాణి జన్మ రహస్యం తెలుసుకున్న సన్యాసి సామాన్యుడు కాదని గ్రహించిన మహారాజు; “అవును మహాత్మా! తరుణోపాయం సెలవీయండి,' అని ప్రార్థించాడు.
రాజా! దీనికంతటికీ కారణం నీవు చంపిన నాగసర్పమే! నీడనిచ్చిన సర్పాన్ని తొందరపాటుతో చంపావు. దోషమే నిన్ను వెంటాడుతున్నది. నేను చెప్పినట్లు చేస్తే పరిస్థతి చక్కబడుతుంది. రాజ్యానికి దక్షిణదిశన నాగభైరవ కోన అనే ప్రదేశం ఉంది.
అక్కడ అతి పురాతనమైన నాగదేవత విగ్రహం ఉంది. నీవా ప్రాంతానికి వెళ్లి నాగదేవతను క్షమాబిక్ష కోరి, పూజలు జరిపిస్తే మంచి ఫలితం ఉంటుంది, అని చెప్పాడు.
జీమూతవాహనుడు, దివ్య చరితుడికి పాదాభివందనం చేసి 'మహానుభావా మీరు చేసిన సహాయం ఎనలేనిది. అందుకు కృతజ్ఞతలు, ' అని చెప్పాడు.
శుభముహూార్తం చూసి జీమూతవాహనుడు, ఒంటరిగా అశ్వారూఢుడై నాగభైరవ కోనను వెదుక్కుంటూ వెళ్లాడు. వారం రోజుల ప్రయాణం తర్వాత అతడా కోన చేరాడు. అక్కడ నాగదేవత విగ్రహం కనిపించింది. జీమూతవాహనుడు అక్కడున్న కొలనులో శుచిగా స్నానం చేసి, చెట్లకున్న పరిమళభరిత పుష్పాలను కోసి వాటితో నాగదేవతకు పూజ చేశాడు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
మాతా! కన్న తండ్రినైనందున మమ కారంతో, బిడ్డను రక్షించుకోవాలన్న తొందరలో నాగసర్పాన్ని చంపాను. అది తప్పే! అందుకు నన్ను శిక్షించు. అంతేకాని నా బిడ్డను గాని, రాజ్యప్రజలను గాని శిక్షించకు, అని ప్రార్ధించాడు.
కొద్ది క్షణాలకు ఆకాశంలో మెరుపు వెంరిసింది. బలమైన గాలి వీచిందిఅంతలో నాగదేవత విగ్రహం నుంచిరాజాపశ్చాతాప హృదయంతో నన్ను వెదుక్కుంటూ ఇంత దూరం వచ్చావునిన్ను క్షమిస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకో! అన్న స్వరం వినవచ్చింది.
అప్పుడు జీమూతవాహనుడు, 'నాగదేవతా, నేను చేసిన తప్పిదం వలన జన్మించిన బిడ్డ సర్పముఖంతో జన్మించింది. బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు. అలాగే రాజ్యంలో ఎన్నడూ లేని క్షామం అలుముకుంది. ఆకలితో ప్రజలు అలవుటిస్తున్నారు. వర్హాలుకురిసి క్షామం తొలిగేలా చూడు,' అని కోరాడు.
అప్పుడు నాగదేవతరాజా! నీ రెండు కోరికల్లో ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను. ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పాన్ని చంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు. ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించక నిదానంగా ఆలోచించి వరం కోరుకో! అని చెప్పింది.
క్షణం ఆలోచించిన జీమూత వాహనుడుతల్లీ! రాజ్యంలోని క్షామం తొలిగేలా అనుగ్రహించు,” అని కోరాడు. “తథాస్తు అని దీవించింది నాగదేవత. జీమూత వాహనుడు సగం తృప్తితో, సగం అసంతృప్తితో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్కరించి వెనుదిరిగాడు.
అతను రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమయింది. తరువాత కూడా విస్తారంగా వర్షాలు కురిశాయిబీళ్ళుగా మారిన పంట పొలాలు చిగురించాయి. మెల్లగా రాజ్యంలో క్షామపరిస్థితులు వైదొలిగి ప్రజల కష్టాలు తీరాయి.
పరిస్టితులలో దివ్యచరితుడు మరలా రాజును కలిసి, “రాజా! నేనొక శాంతియజ్ఞం జరిపిస్తాను. అందువలన అంతఃపుర పరిస్థితులు చక్కబడతాయిఅని చెప్పి రాజదంపతుల చేత శాంతి యజ్ఞం జరిపించాడు
కొద్ది రోజులు గడిచేసరికి యువరాణి రాగచంద్రికకు సర్ప్వముఖం మాయమై మానవ శిరము ప్రత్యక్షమయింది.
రాజదంపతుల సంతోషానికి అవధుల్లేవు. సంతుష్టి చెందిన జీమూత వాహనుడు, దివ్యచరితుడిని ఘనంగా సత్కరించబోయాడు. అప్పుడు దివ్యచరితుడు రాజా! నీముందు నేనెంత? నాకెందుకు సత్కారం?” అని నిష్కమించాడు. మహారాజు, నాగదేవతకు రాజ్యంలో ఆలయం కట్టించి తన భక్తిని చాటుకున్నాడు.
అంతవరకూ కథ చెప్పిన బేతాళుడు, “రాజా! ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పం శిరసు ఖండించిన జీమూత వాహనుడు, నాగదేవత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ తన కుమార్తె బాగు కోరకుండా, క్షామం తొలగాలని ప్రార్దించడం అవివేకం కదాఎలాగూ కొడుకు ఉన్నాడు కాబట్టి ఆడపిల్ల ఎమైనా ఫర్వాలేదన్న చులకన భావంతో అలా ప్రవర్తించాడా? ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవత కంటెశాంతియజ్ఞం జరిపించి యువరాణికి మామూలు రూపు తెప్పించిన దివ్య చరితుడు మహిమాన్వితుడు కాదా? ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవతను అశక్తురాలిగా భావించి చిన్నచూపు చూడవలసిన జీమూతవాహనుడు, దేవాలయం కట్టంచి ఎ౦దుకు కృతజ్ఞత చాటుకున్నాడు? కాగా, దివ్యచరితుడు మహారాజును తనకంటే గొప్పవాడిగా ఎందుకు స్తుతించాడు?' అని ప్రశ్నించాడు.
అందుకు విక్రమార్కుడు, 'బేతాళారాజ్యంలోని క్షామం తొలగాలని నాగదేవతను ప్రార్ధించడం ద్వారా జీమూతవాహనుడు రాజుగా తన ప్రథమ కర్తవ్యం నిర్వర్తించాడం. రాజుకు భార్య అయినాబిడ్డలైనా ప్రజల తర్వాతే. అతనికా పరీక్ష పెట్టడానికే నాగదేవత ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చగలను అన్నది. పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా మహారాజు నాగదేవత అనుగ్రహం పొందగలిగాడుకాబట్టి అతనా కోరిక కోరడంలో తొందరపాటు ప్రదర్శించాడు తప్ప అవివేక నిర్ణయం అనడానికి వీలులేదునాగదేవత అనుగ్రహాన్ని అర్ధం చేసుకోబట్టే దివ్యచరితుడు శాంతి యజ్ఞం జరిపించి కాగల కార్యం త్వరగా సానుకూలం అయ్యేలా చేశాడే గాని అందులో అతని దివ్య శక్తులేం లేవు. నాగదేవత ఒక కోరిక నెరవేరుస్తానని చెప్పిరెండో కోరికను కూడా నెరవేర్చడం అర్ధం చేసుకోబట్టె జీమూతవాహనుడు దేవాలయ నిర్మాణం గావించాడు.
దివ్యచరితుండు, మహారాజును స్తుతించడానికి కారణం, తనవారిని త్యజించడం అన్నది సన్యాసులకే కష్టమైన విషయం, అటువంటిది మహారాజు ప్రజల క్షేమం కోసం కన్నబిడ్డ క్షేమాన్నే పక్కన పెట్టడం చాలా అరుదైన  విషయం. అందుకే అతను రాజును స్తుతించాడు, అని చెప్పాడు.
బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు .
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu