రత్న మాల
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి,
చెట్టుపై నుంచి శవాన్ని దించిన
భుజాన వేసుకుని,ఎప్పటిలాగ మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.
అప్పుడు
శవంలోని బేతాళుడు,, నీవెవరో ఇక మంత్రసిద్ధుడెనవాణ్లి అవమానించి, అతడి
వల్ల శాపగ్రస్తుడివై ఇలా
రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలూ అనుభవిస్తున్నావేమో
అన్న శంక కలుగుతున్నది. గృహస్థుల
ఇళ్ళకు అతిథి, అభ్యాగతులుగా వచ్చే సాధు, సన్యాసి, బైరాగుల్లో కొందరు మంత్రవిద్యల్లో ఆరితేరినవారుంటారు. ఆ సంగతి గ్రహించలేని
గౌరవుడు అనేవాడు, మిడిసిపాటుతో ప్రవర్తించి ఒక బైరాగి వల్ల
శాపం పొంది ఎలా కష్టాలపాలయ్యాడో చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,”
అంటూ ఇలా చెప్పనాగాడు:
శ్రీనివాసుడు సిరివురుంలో
ప్రముఖ వ్యావారి. ఆయన భార్య అనుకూలవతి,
సుగుణవతి. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమ్మదస్తుడు. చిన్నవాడు
గౌరవుడు దుడుకు మనిషి.
ఒక రోజున వాళ్ళింటికి ఓ బైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు. సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది. బైరవుడాయనకు వినయంగా సేవలు చెశాడు. గౌరవుడు మాత్రం ఆకలికి భిక్షాందేహి అంటూ వచ్చినవాడికిన్ని మర్యాదలేమిటని చిరాకు పడ్డాడు.

బైరాగి అది విని, “అన్నార్తులను
ఈసడించకు. మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని బీవించాల్సిరావచ్చు,” అన్నాడు.
“మా ఇంట్లో భోంచేసి నన్నే శపించే నిలాంటి దుష్టుల్ని నేను లెక్కచేయను,” అని గౌరవుడు అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
శ్రీనివాసుడు, సుజాత, భెరవుడు, బైరాగి మాటలకు భయపడి, గౌరవుడి తప్పు కాయమని బ్రతిమాలారు. బైరాగి నవ్వి, “మీకేంకావాలో కోరు కోండి” అన్నాడు.

“మాకే
కోరికలూ లేవు. గౌరవుడి దుడుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి,” అని
కోరారు.
బైరాగి వారితో, “మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం. మీరు అతడి. కతణ్లి
విడిచి పెట్టండి. మీకేం కావాలో కోరు
కోండి,” అని హితవు చెప్పాడు.
“గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప, మాకే కోరికలూ లేవు,” అన్నారు ముగ్గురూ,
బైరాగి, “అతడి వక్రబుద్ధిని, మార్చేశక్తి నాకు లేదు,” అంటూ నిట్టూర్చి, ధగధగ మెరుస్తున్న ఒక రత్నమాలను తన అంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి, “ఈ మాల మహిమాన్వితం! దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. కాని దిన్ని అనర్హులు ధరించినా, ఇంకొకరికి దానం చేసినా ఎలాంటి ప్రయోజనం వుండదు,” అని చెప్పాడు.

గౌరవుడు
బాగుపడాలన్న ఆశతో, శ్రీనివాసుడా మాలను బైరాగి సమక్షం లోనే పూజా మందిరంలో
వుంచాడు. బైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు.
కొంతకాలంగడిచింది.
ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్ధర్నీ
పిలిచి, “నాకు వృద్ధాప్యం చేరువవుతున్నది.
నా తనువు, మనసు విశ్రాంతి కోరుతున్నాయి.
ఇక మీదట బైరవుడు వ్యాపారం
కొనసాగిస్తాడు. గౌరవుడు, అన్నకు చేదోడువాదోడుగా వుండాలి,” అన్నాడు.
తండ్రీ,
అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు, తానిక ఆ ఇంట్లో
వుండనని, తనకు కొంత డబ్బిస్తే,
స్వంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. చేసేది లేక శ్రీనివాసుడు అతడికి
కొంత డబ్బిచ్చాడు.
గౌరవుడా
డబ్బు తీసుకుని ఇంట్లొంచి వెళ్ళి పోయాడు.
ఐతే,
అతడే వ్యాపారం చేసినా నష్టాల మీద నష్టాలొచ్చి, ఏడాదిలోనే
తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది.
గౌరవుడు ఇంటికి తిరిగివచ్చి తండ్రితో, తను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయానని చెప్పి, “అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్పతనం కాదు. నేను రాణించక పోతే అది నా తప్పూ కాదు. అంతా పూజా మందిరంలోని రత్నమాల మహిమ. నాకా రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర వుంచుకుని తిరిగి ఇచ్చేస్తాను,” అన్నాడు.

“రత్నమాలను పూజామందిరంనుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది. ఆ మాలను గురించి బైరాగి చెప్పిందేమిటో, ఆ తర్వాత మా
ద్వారా విని కూడా, నువ్వింకా
ఆ మాల కావాలనదం, నీది
వక్రబుద్ధి అని చెప్పుకోవడమే!” అన్నాడు శ్రీనివాసుడు.
తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించిన్నె ఆ
రాత్రి అంతా నిద్రపోయాక అతడు
ఇంట్లొంచి కొంత డబ్బూ, రత్నమాలా
తీసుకుని, ఊరొదిలి తెల్లవారేసరికి మరొక ఊరు
చేరాడు. ఆ ఊరు చాలా
పెద్దది. చుట్టూవున్న ఐదారు ఊళ్ళకు కూడలిస్థలం.
అలాంటి
ఊరు వస్తవ్యావారానికి అనువుగా వుంటుందని భావించన గౌరవుడు, అక్కడ ఒక ఇల్లు
అద్దెకుతీసుకుని, దాపులవున్న పట్టణానికి పోయి, భారీగా వస్త్రాలు
కొనుగోలు చేశాడు.
తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలో వేసుకుని వస్తుండగా, మూటలు హఠాత్తుగా ఉరుములూ మెరుపులతో జడివాన ప్రారంభమైంది.

ఆ తర్వాత కొద్దిసేపటికి ముగ్గురు దొంగలు బండిని అటకాయించి బండివాడికీ, గౌరవుడికీ కత్తులు చూపి బెదిరించి, బండిని
మరో మార్గం పట్టంచారు.
గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించే సరికి, అది పిడుగు పాటుకు గురై భగభగ మండిపోతున్నది.

ఈ జరిగిన రెండు దుర్హటనలతో గౌరవుడికి
తన దగ్గరున్న రత్నమాల విషనాగుకంటి భయంకరంగా తోచింది. అతడు దాన్ని వదిలించుకోవడం
అటకాయించి ఎలాగా అని ఆలోచిస్తూండగా, బైరాగి, కారలిబూడిధై పోతున్న ఇంటి ముందు కనిపించి
“ఓ పాపీ నీ దుష్ప్రవర్తనే నీకు
శాపమైంది! ఈ రోజు నుంచీ
ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పొట్టపోసుకో. నిన్ను నిస్వార్ధంగా, మనస్ఫూర్తిగా పెళ్ళిచేసుకుంటానన్న
అమ్మాయికిస్తే, నీకా రత్నమాల నుంచి
విముక్తి లభిస్తుంది,” అని చెవ్పాడు.
అప్పట్నించీ గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకుని, తనను పెళ్ళాడితే రత్నమాల ఇస్తాననేవాడు. రత్నమాల కోసం ఆశపడి, ఇద్దరు ముగ్గురు, బిచ్చగాడెనా అతణ్ఞి పెళ్చాడతామన్నారు.
కాని వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల, గౌరవుడి. దగ్గరకు వచ్చెసింది. అలా కొన్నాళ్ళకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు.

అక్కడ దేవయ్య అనే అతడున్నాడు. తల్లిదండ్రులు
చిన్నప్పుడే పోగా, కాయకష్టం చేసి
జీవిస్తూ, చెల్లెలు శివానిని పెంచి పెద్ద చెశాడు.
ఆ అన్నాచెల్లెళ్ళకు ఒకరంటే ఒకరికి ప్రాణం.
దేవయ్య ఆ ఊళ్ళో వుండే దేవకి అనే అందమెన్ర అమ్మాయిని ప్రేమించాడు. నాలుగిళ్ళల్లో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకికి నా అన్నవాళ్ళు ఎవరు లేరు. డబ్బున్నవాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ. అది తెలిసిన దేవయ్య, ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంకోచించాడు. అన్న మనసెరిగిన శివాని, దేవకిని కలుసుకుని, “నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను. అన్న నాకు దేవుడెత్రే వదిన దేవత. నా అన్నను పెళ్ళిచేసుకో,” అని అడిగింది.
“దేవతలు రత్నమాల ధరిస్తారు. నాకో రత్నమాల తెచ్చివ్వు. నీ అన్నను పెళ్ళి చేసుకుంటాను,” అన్నది దేవకి వెంటనే.

“రత్నమాల
కోసం ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్ప
దొరకదే!” అన్నది శివాని బాధగా. సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆఇంటి ముందు
కొచ్చిన గౌరవుడా మాటలు విన్నాడు.
అతడు శివానిని గుచ్చిగుచ్చి చూస్తూ, “డబ్బడక్కుండా నీకు రత్నమాల ఇస్తాను.
మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా అంటూ
సంచీలోవున్న మాలను బయటకు తీశాడు.
రత్నమాలను
చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి. ఆమె
మారో ఆలోచన లేకుండా గౌరవుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడింది.
గౌరవుడు రత్నమాలను
శివాని చేతిలో పెడితే, అది అక్కడ స్థిరంగా
వుండిపోయింది. శివాని దానిని దేవకి మెడలో వేసింది.
గౌరవుడు పరమానందంగా, “ఆహా! నాకు బైరాగి శాపం నుంచి విముక్తి కలిగింది.
ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్ళాడే అమ్మాయివి దొరికావు,” అన్నాడు.
ఆ సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన
దేవయ్య, గౌరవుడు తన దుడుకు స్వభావం
వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప, మంచికుటుంబానికి చెందిన
వాడని అతడి ద్వారా వివరంగా
సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు. ఆ
తర్వాత గౌరవుడికి శివానీతోనూ; దేవయ్యకు దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, బైరాగి తను ఇచ్చిన రత్నమాలవల్ల, శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కానీ, దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకుతనం కొద్ది శాపగ్రస్తుడె బిచ్చగాడుగా ఊళ్ళుపట్టిపోయాడు. ఇది. శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగడంకాదుగదా? ఆ రత్నమాలవల్ల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేపాటి? ఆ మాల వల్ల నిజంగా మేలు పొందినవాడు దెవయ్యగదా?
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో, నీ తల పగిలి పోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “బైరాగి, గౌరవుడికిచ్చిన శాపంలోని వింతా, విడ్దూరమేమంటంటే, గౌరవుడికేకాక, ఇతరులకు కూడా మేలు జరిగింది. గౌరవుడు నానా కష్టాలకు గురెన్ర తర్వాత, శ్రీనివాసుడి కుటుంబం ఆశించినట్టు సరెన్ర మార్గంలోకి వచ్చాడు. అతడు, శివానికి భర్త అవడం ఆమెకు జరిగిన మేలు. దేవయ్యకు తను ప్రేమించిన అమ్మాయి అభించింది. ఇందువల్ల, బైరాగి శాపం అందరికీ మేలు చేసిందనడంలో సందేహం' లేదు,” అన్నాడు.

0 Comments