పట్టువదలని
విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని
ఎప్పటిలాగానే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు
శవంలోని
బేతాళుడు “రాజా! నువ్వు ఎవరి
మేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైన
కార్యానికి పూనుకున్నావో నాకు బోధపడడం లేదు.
కొందరు వ్యక్తులు మొదట మేలు తలపెట్టినా
చివరికి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. నువ్వు అటువంటివాడివేమో ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలుగా నీకు అనంతుడి కథ
చెబుతాను శ్రమ తెలియకుండా విను, అంటూ
ఇలా చెప్పసాగాడు.
వింధ్యవర్దని రాజ్యానికి రాజు అశోకవర్దనుడు. అతని
రాజ్యానికి దక్షిణ దిశగా నైమిశారణ్యం ఉండేది. అందులో సిద్ధయోగి అనే మునీశ్వరుడు గురుకులం
నడిపేవాడు. సిద్దయోగికి
తెలియని ధర్మశాస్త్రాలు గాని, వీరవిద్యలు గాని లేవు. అందుకే ఎందరో రాజులు
తమ బిడ్డలను సిద్దయోగి వద్ద శిష్యులుగా చేర్పించడానికి
ఇష్టపడేవారు.
అశోకవర్హనుడు
కూడా తన కుమారుడైన హర్షవర్దనుడిని,
సిద్ధ్దయోగి సమక్షానికి తీసుకుపోయి 'మునీశ్వరా! నా కుమారుడిని శిష్యుడిగా
స్వీకరించి భావి మహారాజుగా తీర్చిదిద్దండి,
అని కోరాడు. సిద్ద యోగి అందుకు
సమ్మతించాడు.
అదే సమయానికి పురుషోత్తముడు
అనే రైతు తన కుమారుడైన
అనంతుడిని, సిద్దయోగి వద్దకు తెచ్చి 'మహానుభావా! నా కుమారుడికి వేదవిద్యల పట్ల, వీరవిద్యల
పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే తమ వద్దకు తీసుకువచ్చాను.
శిష్యుడిగా స్వీకరించి మంచి భవిష్యత్తును ప్రసాదించండి,'
అని కోరాడు. సిద్దయోగి, అనంతుడిని కూడా శిష్యుడిగా స్వీకరించాడు.
హర్టవర్దనుడు, అనంతుడు గురువు చెప్పే విద్య పట్ల అమితమైన శ్రద్ద చూపేవారు. సిద్దయోగి వారిరువురూ సమ ఉజ్జీలని గ్రహించాడు.
అయితే హర్షవర్దనుడు ప్రతిసారీ అనంతుడిని మించి ప్రతిభ కనబరచాలని
ఆరాట పడేవాడు.
అనంతుడు మాత్రం హర్షవర్దనుడుని రాజకుమారుడిగా గౌరవించేవారు. అభిమానం
చూపేవాడే గానీ అసూయ, పడేవాడు
కాదు. పోవాలని తాపత్రయ పడేవాడు కాదు.
ఒక రోజు
యాగానికి అవసరమైన సమిధలు ఎరడానికి విద్యార్దులందరూ కలసి అరణ్యంలోకి వెళ్ళారు.
అప్పుడు ఒక భల్లూకం వారి
మీద దాడి చేసింది.
విద్యార్దులు భల్లూకాన్ని చూసి పారిపోయారు. హర్షవర్ధనుడు
ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. కాని దాని బలం
ముందు నిలువలేకపోయాడు. అంతలో అనంతుడు, హర్షవర్ధనుడిని
ప్రక్కకు నెట్టి, భల్లూకంతో కలబడ్డాడు. భల్లూకంతో పోరులో తీవ్ర గాయాలైనా అనంతుడు
వెరవ లేదు.
శిష్యుల ద్వారా
భల్లూకం విషయ౦ తెలుసుకున్న సిద్దయోగి
అక్కడకు వచ్చి భల్లూకం మీద మంత్రజలం జల్లాడు.
అంతటితో భల్లూకం స్పృహ తప్పి పడి
పోయింది.
సిద్ధయోగి,
తీవ్ర గాయాలైన అనంతుడిని
ఆశ్రమానికి తీసుకుపోయి మూలికా వైద్యం
చేసాడు. అనంతుడు వారం రోజులకు గానీ కోలుకోలేక పోయాడు.
ఒక రోజు హర్దవర్దనుడు దూరంగా
ఉన్న సమయాన
సిద్దయోగి "అనంతా! హర్షవర్ధనుడిని ప్రాణాలకు తెగించి కాపాడావు. నీకు
ప్రాణంమీద తీపి లేదా?' అని
అడిగాడు.
అందుకు
అనంతుడు 'గురువర్యా! హర్టవర్ధనుడు
భావి మహారాజు. ఒక సామాన్యుడినైన
నాప్రాణం కంటే అతడి ప్రాణం విలువైనది.
అందుకే అలా చేసాను' అని చెప్పాడు.
సిద్దయోగి,
అనంతుడి వంక ప్రశంసాపూర్వకంగా
చూసాడు.
హర్షవర్ధనుడు,
అనంతుడు వీరవిద్య లన్నింటిలో
సమంగా ఉన్నా విలువిద్యలో మాత్రం
అనంతుడిది పై చేయిగా ఉండేది. ఆ విషయంలో హర్షవర్దనుడికి తీవ్రమైన అసంతృప్తి
ఉండేది. అందుకే అనంతుడ్ని మించి
ప్రతిభ కనబరచడానికి తీవ్రమైన కృషి
చేసేవాడు.
ఒక పర్యాయం సిద్దయోగి విద్యార్డులను రెండు జట్టులుగా విడగొట్టి
విలు విద్య
పోటీ పెట్టాడు. చివరిగా హర్షవర్ధనుడు,
అనంతుల మధ్య పోటీ జరిగింది.
సిద్దయోగి
ఒక పూలదండను చెట్టు కొమ్మకు
తగిలించి బాణంతో ఆ పూలదండను
కాసింత దూరంలో ఉన్న దేవతా విగ్రహం
మెడలో పడేలా చేయమని పరీక్ష పెట్టాడు.
అంతేకాదు... పూలదండలోని ఒక పువ్వు కూడా నేలరాలరాదని షరతు పెట్టాడు.
క్లిష్టమైన ఆ పరీక్షలో ఎవరు నెగ్గుతారోనని
శిష్యులందరూ ఆసక్తి కనబరిచారు.
తొలుత
హర్షవర్హనుడు వేసిన బాణం సూటిగా
పోయి పూలదండను తాకింది. మరుక్షణం
పూలదండ వెళ్ళి దేవతా విగ్రహం
మెడలో పడింది. ఒక్క పూవు కూడా
నేల రాలలేదు.
తరువాత అనంతుడు వేసిన బాణం పూలదండను సరిగ్గా దేవతా విగ్రహం మెడలో పడేసింది గాని.. కొన్ని పూలు నేలరాలాయి. సిద్ధయోగి హర్షవర్దనుడిని విజేతగా ప్రకటించాడు.
తరువాత అనంతుడు వేసిన బాణం పూలదండను సరిగ్గా దేవతా విగ్రహం మెడలో పడేసింది గాని.. కొన్ని పూలు నేలరాలాయి. సిద్ధయోగి హర్షవర్దనుడిని విజేతగా ప్రకటించాడు.
ఆ రాత్రి ఎద్యార్ధులందరూ నిద్రించాక సిద్దయోగి
అనంతుడితో "అనంతా! నీవు పోటీలో
కావాలనే ఓడిపోయావని నేను గ్రహించాను.
ఎందుకలా చేసావు?” అని ప్రశ్నించాడు.
అందుకు
అనంతుడు “గురుదేవా! హర్షవర్దనుడు
విలు విద్యలో నా కంటే తక్కువగా
భావించి ఆత్మన్యూనతా భావం పెంచుకుంటున్నాడు.
అతనిలో ఆత్మవిశ్వాసం
నింపడానికే నేను కావాలని ఓడిపోయాను,”
అని చెప్పాడు. సిద్దయోగి అనంతుడివంక
మెచ్చుకోలుగా చూసాడు.
విలువిద్య
పోటీలో తను గెలుపొందాక హర్షవర్ధనుడు,
అనంతుడిని చిన్నచూపు చూడసాగాడు.
తోటి విద్యార్ధుల దగ్గర తనంతటి
గొప్పవాడు లేడని, అనంతుడిలాంటి
పదిమందిని ఎక కాలంలో ఓడించగలనని
గొప్పలు చెప్పుకోసాగాడు.
అందుకు
అనంతుడు బాధ పడేవాడు కాదు
గాని, నిజం తెలిసిన సిద్ధయోగి మాత్రం
బాధపడేవాడు.
ఒక పర్యాయం సిద్దయోగి, అనంతుడిని
చేరబిలిచి, “నాయనా! నా దగ్గరున్న శిష్యులందరిలో
నీవు ఉత్తముడివి. నాకు ప్రియతముడివి.
గురువు ఎప్పుడూ మరెవరికీ
నేర్చని కొన్ని మెళకువలను తన ప్రియతమ శిష్యుడికి, నేర్చ్పుతాడు. అందుకే ఖడ్గ చాలనంలోని
కొన్ని రహస్య మెళకువలు నీకు
నేర్పుతాను' అన్నాడు. అందుకు
అనంతుడు “గురుదేవా! మీరు
నాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుడిని.
అయితే నా అభ్యర్థన ఏమంటే ఆ మెళకువలు హర్షవర్ధనుడికి నేర్పండి. ఎందుకంటే
నాకంటే అతడికి శతృభయం ఎక్కువ.
ఖడ్గచాలనంలోని ఆ మెళకువలు అతడికి
మరింత ఉపయోగపడగలవు, అని కోరాడు.
అప్పుడు
సిద్దయోగి “అనంతా! నీవంటి స్నేహితుడిని
పొందిన రాజకుమారుడు అదృష్టవంతుడు,
అన్నాడు.
కొద్ది
సంవత్సరాలకు వారి విద్యాభ్యాసం ముగిసింది.
చివరిసారిగా
విద్యార్దుల మధ్య సిద్ధయోగి
పోటీలు పెట్టదలిచాడు. ఆ పోటీలకు హాజరుకమ్మని మహా రాజుతో
పాటు అందరి తల్లిదండ్రులకు వర్తమానం
పంవాడు.
మహరాజుతో
పాటు అందరూ ఎంతో ఆసక్తితో
ఆ పోటీలకు హాజరు అయ్యారు.
అన్ని
పోటీల్లో హర్షవర్దనుడు, అనంతుడు
ప్రధములుగా నిలిచారు. చివరిగా సిద్దయోగి
వారిరువురి మధ్య కత్తియుద్ధం పోటీ
పెట్టాడు.
వారిరువురు
పోటాపోటీగా చాలాసేపు కత్తి
యుద్దం చేసారు. వారి చేతుల్లోని ఖడ్గాలు మెరుపు వేగంతో కదలాడాయి. కొంతసేపటికి
అనంతుడు ఒక అసాధారణ ప్రక్రియతో
హర్షవర్ధనుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టాడు.
సిద్దయోగి అనంతుడ్ని విజేతగా
ప్రకటించాడు.
అనంతుడు
తన తండ్రితో కలసి గ్రామానికి
బయలుదేరే సమయాన సిద్దయోగి అనంతుడిని
చేరబిలిచి “నాయనా! నీవు వీరుడివే
కాదు. వివేకవంతుడివి కూడా. అంతకు
మించి నిజమైన స్నేహితుడివి, ఆని అభినందించాడు.
అనంతుడు
గురువు పాదాలకు భక్తితో నమస్కరించి
బయలుదేరిపోయాడు.
అంతవరకూ
కథ చెప్పిన బేతాళుడు “రాజా!
ఒకపర్యాయం అనంతుడు ప్రాణాలకు తెగించి భల్టూకం బారినుంచి రాజకుమారుడిని
కాపాడాడు. మరో సందర్భంలో
రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి
కావాలని విలువిద్య పోటీలో ఓడిపోయాడు.
అతడు
ఎందుకలా ప్రవర్తించాడు? అందరిముందు
తన గొప్పతనం ప్రదర్శించడానికా?
లేక ఓడిపోయి తన తండ్రి మనసు
నొప్పించడం ఇష్టం లేకనా?
అలా కాని పక్ష్తాన మహారాజు ముందు తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే తనకు మంచి పదవి
దొరకగలదన్న ఆశతోనా? అలాగే సిద్ధయోగి,
అనంతుడిని వివేకవంతుడని, నిజమైన
స్నేహితుడని అభినందించడం ఈ సందర్భంగా
ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించాడు.
అప్పుడు
విక్రమార్కుడు 'బేతాళా! అనంతుడు,
రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి
చేసిన ప్రయత్నం అతడిలో అహంకారాన్ని నింపింది.
అందుకే
రాజకుమారుడు, గతంలో అనంతుడు
తన ప్రాణం కాపాడిన వైనం కూడా
మరచి అతన్ని పదేపదే చిన్నచూపు చూసాడు.
తోటి విద్యార్దుల దగ్గర తూల నాడాడు.
కాబోయే రాజుకు అసలు ఉండ కూడనిది
అహంకారం. రాజు అహంకారం అతనికే
కాదు... రాజ్యానికి కూడా చేటు తెస్తుంది.
అది గ్రహించబట్టె అనంతుడు, హర్ష వర్ధనుడిలోని
తనను మించిన వాడు లేడన్న అహంకారం
పారద్రోలడానికి, అతన్ని ఓడించాడు.
అంతేగాని.. తండ్రిని సంతోష పెట్టడానికి
గాని... రాజు మెప్పు పొంది పదవి
సంపాదించడానికి గాని ఎంతమాత్రం
కాదు.
నిజమైన
స్నేహితుడు, తన మిత్రుడి ఉన్నతి
కోరుకుంటాడే గాని.. పతనాన్నికాదు.
ఆ విషయం అవగతం చేసుకోబట్టే, సిద్దయోగి,
అనంతుడిని వివేకవంతుడని...
నిజమైన స్నేహితుడని ప్రశంసించాడు,
అని చెప్పాడు.
రాజుకి
ఈ విధంగా మౌనభంగం కలగగానే
బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ
చెట్టెక్కాడు. - కల్పితం
0 Comments