Akber Birbal Stories in Telugu, Balamitra Stories in Telugu,Moral Stories in Telugu

జీవనాదారం 

వెంకటాపురంలో రామశాస్త్రి మంచి పేరుగల పౌరోహిత్యపు బ్రాహ్మణుడు. వూరే కాదు. చుట్టు ప్రక్కల వున్న అన్ని గ్రామాలకు కూడా ఆయనొక్కరే పురోహితుడు
గృహ ప్రవేశం, పెళ్ళి, వ్రతాలు లాంటివాటికి, ముహూర్తాలు పెట్టించుకోడానికి, ఎవరు వచ్చిన రామశాస్త్రి వారి బలహీనతను కనిపెట్టి వారి చేత దానాలు శాంతిపూజలు లాంటివి చెప్పి, అన్నీ చేయించి భారీగా సంభావనలు పుచ్చుకునేవారు
ఒక రోజున రామశాస్త్రి ఏదో పనిమీద బజారు వైపు వెళుతూ చంద్రన్న ఇంటి ముందు కట్టివున్న తెల్లని పాడి ఆవును చూసాడు. ఆవు పుష్టిగా వుంది. బాగా పాలు ఇచ్చేలా వుంది. రామశాస్త్రి కన్ను ఆవు మీద పడింది. సరిగ్గా సమయంలో ఇంట్లో నుండి చంద్రన్న బయటికి వచ్చి, 'దండాలు బాబయ్యా" అని పలకరించాడు. “ఏమోయ్‌! చంద్రన్నా ఎలా వున్నావు. ఇంట్లో అందరూ బాగున్నారు కదా!” అంటూ శాస్త్రి ఆప్యాయంగా పలకరించాడు
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ఏదో తమరి దయవలన బాగానే వున్నాం. కానీ...” అంటూ ఆపాడు చంద్రన్న
ఏమైందీ చంద్రన్న! ఏదైనా వుంటే అడుగు. నీకు నా చేతనైన సహాయం చేస్తానుఅంటూ శాస్తి ఆవును చూడసాగాడు
మరేం లేదండీ. మద్య మా ఇంటి దానికి ఏదో పీడకలలు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. రోజు మా ఆవిడ మిమ్మల్ని కలిసి, ఇది చెప్పమంటుంది. మిమ్మల్ని కలవాలని బయటికి వచ్చాను. ఎదురుగా మీరు వున్నారుఅన్నాడు చంద్రన్న
అన్నిటికి పరిష్కార మార్గాలు వున్నాయి. ఇంతకీ ఎలాంటి కలలు వస్తున్నాయి?” అడిగాడు శాస్త్రిగారు
రోజుతను తను నూతిలో పడి చచ్చిపోయినట్లు, ఇంకో రోజు దయ్యాలతో తిరుగుతున్నట్లు, ఒకసారి బంగారం, డబ్బు మోసుకొస్తున్నట్లు కలలు వచ్చాయి. కలలో బంగారం డబ్బు కనిపిస్తే అమ్మవారికి బలి ఇవ్వాలని పెద్ద మనిషి చెప్పాడు. మీరు దీనికి మంచి మార్గం చెప్పండి. మీరు ఏం చెబితే అది చేస్తానుఅన్నాడు చంద్రన్న. 
నువ్వన్నది నిజం. బంగారం కలలో వస్తే ఇంట్లో ఎవరికో ఆయువు మూడిందని అర్ధంఅని శాస్త్రి అతని భయాన్ని ఎక్కువ చేసాడు
మీరు ఏదో పూజలు చేసి మమ్మల్ని కాపాడు తారని మీ, వద్దకు వస్తే మీరు అదే చెబుతున్నారు. మాకు దారి చూపండిఅన్నాడు
నువ్వన్నట్లు ఇంకా చాలా పరిష్కారాలు వున్నాయి. మీ ఇద్దరి ప్రాణాలు కాపాడుకోవాలంటే, భూదానం, సువర్ణ దానం, గోదానం ఇలా ఏదైనా ఒకటి చేయవచ్చు. ఒక్కొక్క పీడకలకి ఒక్కోదానం చేస్తారు. నువ్వ పేదవాడివి భూదానం చేయలేవు. సువర్ణదానం చేయాలన్నా ఎక్కువ డబ్బు కావాలి. నీ వద్ద లేదు. పోనీ గోదానం చేస్తావాఅన్నాడు . 
గోదానం అంటే మా ఆవును ఎవరికైనా దానం చేయాలి కదా!” అనుమానంగా అడిగాడు
అవును నువ్వు నీ భార్య ఆరోగ్యంగా వుండాలంటే నీ ఆవును దానంగా ఇస్తే మీ కష్టాలు అన్నీ పోయి నువ్వ సంతోషంగా వుండగలుగుతావుఅన్నాడు శాస్త్రి
అది చాలా కష్టం. ఆవు మా జీవనాధారం. నాకు దున్నుకోడానికి పొలాలు లేవు. ఆవుపాలు అమ్మి మా ఇద్దరి కడుపులు నింపుకుంటున్నాము. ఇపుడు ఆవును దానం ఇస్తే మేము ఎలా బ్రతకాలిఅన్నాడు చంద్రన్న
అవును దానం చేయాలంటే బోలెడంత తతంగం. వుంది. నాకు ఆవును దానంగా ఇస్తే పూజలకు నీ వద్ద ఒక్క రూపాయి తీసుకోను. అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. వేరే వారైతే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందిఅన్నాడు శాస్త్రి
చంద్రన్న ఆలోచిస్తుండగా లోపల నుండి అతని భార్య వచ్చి, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు. పంతులు గారు చెప్పినట్లు గోదానం చేస్తాం. మన ఆరోగ్యం ముఖ్యంఅనగానే చంద్రన్న సమ్మతించాడు
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
వారం తిరక్కుండానే గోదానం పేరుతో చంద్రన్న ఆవు శాస్త్రి ఇల్లు చేరింది. నెలంతా శాస్త్రిగారికి పెళ్ళిళ్ళు హడావిడి. వూపిరి సలపలేదు. అందరివద్దా డబ్బు, బంగారం శాస్త్రి బాగా సంపాదించాడు
రోజు రాత్రి తాను సంపాదించిన బంగారం, డబ్బు అంతా లెక్కపెట్టి, పెద్ద గోనె సంచిలో మూట కడుతుండగా ఎవరో తలుపు కొడుతున్న శబ్దం విని, తలుపులు తెరిచాడు. బయట నుండి నలుగురు దొంగలు కత్తులతో లోపలికి వచ్చి, “మీ వద్ద వున్న డబ్బు అంతా ఇవ్వండిఅని అరిచారు
అయ్యో! నేను పేద బ్రాహ్మణుడిని నా వద్ద ఏం దబ్బు వుంటుంది. మీరు వేరే ఇల్లు చూసుకోండిఅన్నాడు శాస్త్రి. 
"అయితే ఆ మూటలో ఏముంది?" అంటూ ఒకడు మూట వద్దకు వెళుతుండగా శాస్త్రి అడ్డుపడి ఇది బియ్యంమూట మీకు డబ్బు కావాలంటే ఇస్తానుఅంటూ తన బొడ్లో దోపి వున్న వెయ్యి రూపాయలు ఇచ్చాడు
అంతలో మరొకడు, “మనం కష్టపడి వచ్చింది వెయ్యి రూపాయల కొరకా. బియ్యం మూట తీసుకు వెళితే నెల రోజులు మన కడుపులు నిండుతాయిఅంటూ మూటను పట్టుకున్నాడు. శాస్త్రి భయంతో అడ్డుపడడంతో, మూట జారి క్రిందపడి లోపల వున్న బంగారం, డబ్బు బయటపడింది. శాస్త్రిని బాగా తన్ని మూటను తీసుకుని పారిపోయారు
తరువాత శాస్త్రి ఏడుస్తూ, “నేను గ్రామ ప్రజలను అంతా మోసం చేసి సంపాదించినది. దొంగలు సులభంగా దోచుకున్నారు. నాకు దేవుడు తగిన బుద్ది చెప్పాడుఅని పశ్చాత్తాపం పడ్డాడు
శాస్త్రి ఇంట బంగారం డబ్బు మూటతో పరిగెత్తుకుపోతున్న దొంగలు చంద్రన్న ఇంటి ముందు వెళుతుంఢగా, వారి మూటలో వున్న యాబై వేల రూపాయల కట్ట ఎగిరి, ఆవు పోయిందన్న దిగులుతో కూర్చున్న చంద్రనపై పడింది. ఉలిక్కిపడిన చంద్రన్న నోట్ల కట్ట చూసి ఆనందంతో ఆవు ద్వారా తన ఇంటీపీడని లాక్కుని, తన జీవనాధారం కొరకు ఈ డబ్బు దేవుడు ఇచ్చాడని సంతోషపడ్డాడు.
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu