పంచతంత్ర కథలు
గుంట నుంచి పైకొచ్చిన మూడు మృగాలూ బ్రాహ్మడితో “గుంటలో ఉన్న మనిషి పరమపాపి. వాణ్ళీ బయటకు లాగకు, వాడి మాట నమ్మకు అన్నాయి. తరువాత పులి బ్రాహ్మడితో “దూరాన కనబడే ఆ కొండ చూశావా? దాని ఉత్తర పార్శ్యపు లోయలో నా నివాసం. నువ్వు అక్కడికి వచ్చినట్టయితే నీకు ప్రత్యుపకారం చేసి, నీ రుణం తీర్చుకుంటాను అన్నది.
అది వెళ్ళిపోగానే కోతి, “పులి ఉండే చోటుకు ఎదురుగా ఒక జలపాతం ఉన్నది. దాని సమీపంలోని మర్రిచెట్టు నా నివాసం. నీకు అవసరమైనప్పుడు అక్కడికి రా ' అని వెళ్ళిపోయింది. “నికు ఎప్పుడైనా అపాయం కలిగితే నన్ను తలుచుకో అని పాము కూడా వెళ్ళిపోయింది.
జంతువులన్నీ వెళ్ళిపోయాక గోతిలో ఉన్న మనిషి, ''బ్రాహ్మడా, నన్ను కూడా పైకి లాగు” అని కేక పెట్టాడు. సాటివాడు గదా అని బ్రాహ్మడు జాలిదలచి ఆ మనిషినీ పైకి లాగాడు. పైకి వచ్చాక వాడు... “నేను భరుకచ్చానికి చెందిన స్వర్ణకారురుణ్ణి. నీకైనా బంగారు నగలు చేయించుకోవాలని ఉంటే నావద్దకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు.
తరువాత బ్రాహ్మడు చాలా రోజులు తిరిగాడు గానీ ఏమీ సంపాదించలేక పోయాడు. తిరుగు ప్రయాణంలో అతను కోతి ఉండే చోటుకి వెళ్ళాడు. కోతి అతనికి తినేందుకు మధుర ఫలాలను ఇచ్చింది. వాటిని తిని అతను ఆకలి తీర్చుకున్నాడు.
కోతి అతనితో ' పళ్ళు కావాలంటే రోజూ రా” అన్నది.
“ఇక నీ రుణం తీరిపోయింది. పులిని చూపించు. అన్నాడు బ్రాహ్మడు. కోతి అతనికి పులిని చూపింది. పులి అతనికి ఒక చంద్రహారమూ, ఇతర అభరణాలూ ఇస్తూ...““ఎవరో రాజకుమారుడు ఎక్కిన గుర్రం అతని వశం తప్పి పరిగత్తుతూ అతన్ని పడేసింది. అతను చచ్చిపోయాడు. అతని ఆభరణాలన్నీ నీ కోసం దాచి ఉంచాను. కనుక విటిని తీసుకుని వెళ్ళు” అన్నది.
బ్రాహ్మడు ఆ ఆభరణాలను తీసుకుని, స్వర్ణకారుడి వద్దకు వెళ్ళాడు. స్వర్ణకారుడు అతనికి స్వాగతం చెప్పి, విందు భోజనం పెట్టి, “నావల్ల ఎమైనా కావాలంటే అజ్ఞాపించు అన్నాడు. “కొంత బంగారం తెచ్చాను. దాన్ని అమ్మిపెట్టు ' అన్నాడు బ్రాహ్మడు.
స్వర్ణకారుడు బ్రాహ్మడివద్ద నుంచి ఆభరణాలు తీసుకుని, అవి తాను రాజకుమారుడి కోసం చేసినవేనని గ్రహించాడు. రాకుమారుడి కోసం వెతకగా, అతని శవం కీకారణ్యం మధ్య ఇటీవలనే దొరికింది. అతని నగలు మాత్రం లేవు. హత్య జరిగిందని భావించిన, రాజు హంతకుణ్ణి పట్టి ఇచ్చిన వాడికి పెద్ద బహుమానం ప్రకటించాడు. ఈ బ్రాహ్మడే హంతకుడై ఉండాలనుకుని, స్వర్ణకారుడు బ్రాహ్మణ్ణి రాజుకు అప్పగించి బహుమానం పొంద నిశ్చయించాడు.
“అయ్యా... నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇద్దరు, ముగ్గురు బంగారు వర్తకులకు ఈ నగలు చూపించి, ఇప్పుడే వస్తాను ' అని రాజభవనానికి వెళ్ళీ, రాజుకు ఆభరణాలు చూపించి, వాటిని తెచ్చిన బ్రాహ్మడు తన ఇంటివద్ద ఉన్నాడని చెప్పాడు.
రాజభటులు వెళ్ళి, ఆ బ్రాహ్మణ్ణి పట్టి బంధించి రాజు వద్దకు తీసుకొచ్చారు. ఆ బ్రాహ్మడు ఏమి చెప్పేదీ వినకుండానే రాజు అతనికి మరణదండన విధించాడు.
అప్పుడు బ్రాహ్మడు పామును తలచుకున్నాడు. వెంటనే పాము అతడి దగ్గిరకు వచ్చి, “నా వల్ల ఏం సహాయం కావాలి?” అని అడిగింది. “నన్ను ఈ కాళ్ళకూ, చేతులకూ ఉన్న బంధాల నుంచీ, చెరనుంచీ విడిపించు. అన్నాడు బ్రాహ్మడు.
పాము బ్రాహ్మడికి చెప్పవలసింది చెప్పి వెళ్ళి రాణీని కాటు వేసింది. అంతఃపురంలో రోదనధ్వనులు బయలుదేరాయి. నగరం అట్టుడికిపోయింది. వైద్యులూ, మంత్రవేత్తలూ, వచ్చి ఎవేవో తంత్రాలు చేశారు. కాని స్పృహతప్పి పడిపోయిన రాణి కళ్లు తెరవలేదు.
రాణీని బతికించిన వారికి గొప్ప బహమానం ఇస్తానని రాజు దండోరా వేయించాడు. అది విని, ఖైదులో ఉన్న బ్రాహ్మణడు రాణీని తాను బతికిస్తానన్నాడు. వెంటనే అతన్ని విడుదల చేసి, రాజు వద్దకు తీసుకుపోయారు. రాణికి చికిత్స చెయ్యటానికి రాజు అనుమతించాడు. బ్రాహ్మణుడు రాణి చెయ్యి తాకగానే విషం విరిగిపోయి, రాణీ కళ్ళు తెరిచింది. రాజు పరమానందభరితుడై, బ్రాహ్మణుడికి అంతులేని కానుకలిచ్చి, '““అయ్యా.. మీకు ఆ నగలు ఎలా వచ్చాయి?” అని అడిగాడు.
బ్రాహ్మణుడు జరిగినదంతా చెన్సాడు. రాజు, స్వర్ణకారుడికి శిక్ష విధించి, బ్రాహ్మణ్ణి తన మంత్రిగా నియమించాడు. బ్రాహ్మడు తన భార్యనూ, బిడ్డలనూ తెచ్చుకుని, వారితో సుఖంగా ఉన్నాడు.
పింగళకానికి కృతఘ్నుడి కథ చెప్పి దమనకం ఇంకా ఇలా అన్నది:
““మిత్రుడు, గురువు, బంధువు, రాజు నేరం చేస్తే దండన పొందాలని మనువు చెప్పాడు. మహారాజా.. ఈ ఎద్దు ద్రోహి. అతనితో పొత్తు పాములపుట్టపై శయనించటంలాంటిది, తగలబడుతున్న ఇంట నివసించటం లాంటిది.”
“నువ్వు చెప్పినది నిజమే మిత్రమా. అందుచేత అతన్ని హెచ్చరిస్తాను అన్నది
పింగళకం. ““ఎమిటీ? హెచ్చరించటమా! అలాంటి వాడిపట్ల తక్షణ చర్యలే తప్ప మాటలు పనికిరావు. నల్లి కథలోలాగా ఇతన్ని తక్షణం చంపి పారెయ్యాలి అన్నది దమనకం.
“ఏమిటా కథ?” అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది:
నల్లి కథ
పూర్వం ఒకరాజు ఉండేవాడు. అతనికి ఉత్తమమైన శయనాగారం ఉండేది. అందులో అత్యంత సుఖప్రదమైన పరుపు ఉండేది. ఆ పరుపు ముడతలలో, తెల్లని దుప్పటి కింద దాగి మందవిసర్పిణి అనే ఆడపేను జీవిస్తూ రోజూ పక్కలు పరిచేటప్పుడు తెలివిగా తప్పించుకునేది. దుప్పట్లు మార్చేటప్పుడు పరుపులో దాక్కునేది. రాత్రిపూట రాజు వచ్చి పడుకుని నిద్రపోగానే, ఆ పేను రాజు తలలో ప్రవేశించి, నిద్రాభంగం కలుగకుండా ఆయన రక్తు తాగేది. ఇలా రాచనెత్తురు తాగి ఆ పేను తెగబలిసి, సుఖంగా జీవిస్తూ వచ్చింది. (ఇంకా ఉంది)
0 Comments