కంటికి కనిపించని కానుక
స్వర్ణసునందిని రాజ్య రాజు ఆకాశదీప్తుడికి చాలా కాలంగా సంతానం లేదు. సంతానం కోసం రాజదంపతులు ఎన్నో యాగాలు, వ్రతాలు చేసారు. మునులను, యోగులను ఎందరినో కలిసారు.
చివరికి దైవం కరుణించి మహారాణి వకుళాదేవి గర్భం దాల్చింది. నెలలునిండి వకుళాదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
రాజదంపతుల ఆనందానికి అవధుల్లేవు. పుట్టిన బిడ్డకు స్వర్థదీపిక అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు.
ఏడాది గడిచింది. ముహారాజు ఆకాశ దీప్తుడు యువరాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించాడు. ఆ సమయాన రాజ్యవాసులందరికి ఘనంగా విందు ఇవ్వాలని భావించి ఆ విషయమై చాటింపు వేయించాడు.
మహారాజు తామందరినీ విందుకు ఆహ్వానించినందుకు ప్రజలందరూ సంతోషభరితులయ్యారు. విందుకు వెళ్ళే సమయాన తమ శక్తి కొలదీ యువరాణికి ఏదో ఒక కానుక పట్టుకెళ్ళాలని ఖావించారు.
అదే రాజ్యంలో శివయ్య అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. శివయ్యది మంచి మనసు. శివయ్య నిరుపేద కావడంతో ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చయ్యేది. యువరాణీ జన్మదినాన తను చెప్పులు కుట్టగా వచ్చే డబ్బుతో, తను పస్తుండైనా, అ పాపకు ఎటో ఒక కానుక కొని తీసుకువెళ్ళాలనుకున్నాడు.
అయితే ఆ రోజు శివయ్య దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. అందుకు శివయ్య ఎంతో చింతించాడు. యువరాణికి చిన్నకానుక అయినా కొనలేకపోతున్న తన అశక్తతకు కుమిలిపోయాడు.
ఏ కానుకా లేకుండా విందుకు వెళ్ళడం శివయ్యకు ఇష్టం లేదు.
అలాగని రాజుగారు ఎంతో ప్రేమగా పిలిచిన విందుకు వెళ్ళకపోవడం కూడా శివయ్యకు నచ్చలేదు.
చివరకు శివయ్య తన మనసు స్థిమిత పరుచుకొని ఏ కానుకా లేకుండానే విందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
శివయ్య విందు జరుగుతున్న ప్రదేశం చేరేసరికి అక్కడ వేలాది మంది ప్రజలు కనిపించారు. అందరూ వరుసలో నిలబడి యువరాణీకి చదివింపుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
రాజసేవకులు కొందరు ప్రజలు ఇచ్చిన కానుక వివరాలను వ్రాసుకుంటున్నారు.
కానుకలను స్వీకరించి, ఇచ్చిన వారి పేరు ఇచ్చిన కానుక వివరాలను వ్రాసుకుంటున్నారు.
శివయ్య మరోసారి యువరాణికి ఏం చదివించలెకపోతున్న తన పేదరికానికి బాధపడ్డాడు.
వరుసలతో నిలబడ్డ శివయ్యతో, రాజసేవకుడు 'నీ పేరు, కానుక వివరం చెప్పు,' అన్నాడు.
అప్పుడు శివయ్య 'నా పేరు శివయ్య. కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని వ్రాసుకో! అని చెప్పాడు.
అందుకు రాజసేవకుడు ఆశ్చర్యపోయి “కానుక ఇవ్వకుండానే కనిపించని కానుక అని వ్రాసుకోమంటావెం? అన్నాడు.
“చెప్పానుగా! కనిపించని కానుక అని అది: నీకే కాదు, ఎవరికీ కనీపించనిది' అన్నాడు శివయ్య.
ఆ సేవకుడు శివయ్యను మతిమాలినవాడిగా భావించి కానుక వివరం దగ్గర కంటికి కనిపింఛని కానుక అని వ్రాసుకుని శివయ్యను లోనికి పంపించాడు. శివయ్య విందు భోజనం చేసి తన గుడిసె చేరాడు
మరునాడు మహారాణీ వకుళాదేవి యువరాణి జన్మదినాన ప్రజలు ఏం కానుకలు చదివించారోనని కుతూహలంగా జాబితాలు తెప్పించి తిరగేసింది. ఒక జాబితాలో శివయ్య అన్న పేరు దగ్గర కంటికి కనిపించని కానుక అని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ విషయం మహారాజు చెవిన వేసింది.
ఆకాశదీప్తుడు ఆ జాబితా తయారుచెసిన సేవకుడిని పిలిపించి వివరం అడిగాడు.
అప్పుడా సేవకుడు “ముహారాజా! ఆ శివయ్య ఎవడో మతిమాూలిన వాడిలాగా ఉన్నాడు. కానుక ఏం ఇవ్వకుండానే కంటికి కనిపించని కానుక అని వ్రాసుకోమన్నాడు. కానుక ఏదని అడిగితే అది కంటికి కనిపించదు అని చెప్పాడు అని విన్నవించాడు.
ఆకాశదీప్తుడికి శివయ్య మతిమాలిన వాడిలా అనిపించలేదు.
అతడి ఆంతర్యం తెలుసుకోవడానికి భటులను పంపి శివయ్యను రప్పించాడు.
భటులు వెంటబెట్టుకు వచ్చిన శివయ్యతో, ఆకాశదీప్తుడు 'శివయ్యా! నీవిచ్చిన కంటికి కనిపించని కానుక వివరం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడకు రప్పించాను అని చెప్పాడు.
అప్పుడు శివయ్య మహారాజా! చెప్పులు కుట్టుకు బతికే నిరుపేదను. యువరాణి జన్మదినాన ఆ రోజు నాకొచ్చిన ఆదాయంతో ఎదైనా చిన్ని కానుక కొని తేవాలని అనుకున్నాను. అయితే ఆ రోజు చిల్లి గవ్వ ఆదాయం రాలేదు. ఆలోచిస్తే కంటికి కనిపించని కానుక గురొచ్చింది. అందుకని అదే చదివించాను. అది మరేమిటో కాదు మహారాజా! నిండుమనసుతో యువరాణికి నేనిచ్చిన ఆశీర్వచనమే ఆ కంటికి కనిపించని కానుక' అన్ని చెప్పాడు శివయ్య.
అది విన్న ఆకాశదీప్తుడు సంతోషంతో శివయ్యను కౌగిలించుకొని ' మణిమాణిక్యాల కంటే నిండు మనసుతో నీవిచ్చిన ఆశీర్వచనమే విలువైనది అని చెప్పి శివయ్యకు విలువైన కానుకలు ఇవ్వబోయాడు.
అప్పుడు శివయ్య మహారాజా! ఎందరో ప్రముఖులు యువరాణికిచ్చిన మణీమాణిక్యాల కంటే నేనిచ్చిన ఆశీర్వచనం విలువైనదని మీరన్నారు.
అలానే మీరు ఇవ్వబోతున్న కానుకలకంటె మీఠు నాపై చూపిన అభిమానం విలువైనది. అందుకే ఈ కానుకలు స్వీకరించలేను. నన్ను క్షమించండి అని మహారాజు దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు.
ఆ తరువాత మహారాజు ఆకాశదీప్తుడు నిరుపేద శివయ్యకు ఆర్థికంగా నిలదొక్కుకొవడానికి ఉపాధి చూపించి తన అభిమానం చాటుకున్నాడు.
0 Comments