Panchatantra stories in telugu-Moral stories in telugu-bethala kathalu-chandamama kathalu-balamitra kathalu

పంచతంత్ర కథలు 

సాలెవాడు మాత్రం రాజకుమార్తెకు మాట ఇచ్చిన మరుక్షణం౦ నుంచీ విచారంలో మునిగిపోయాడు. తాను ఏం చెయ్యాలి? గరుడవాహనం మీద తాను ఎటైనా పారిపోవచ్చు. కాని తన ప్రియురాలు తనకు దక్కదు. విక్రమసేనుడు తన మామను చంపి, సుదర్శనను ఎత్తుకు పోయి పెళ్లి చేసుకుంటాడు. తాను యుద్ధం చేస్తే తన చావు తప్పదు. ప్రియురాలి ఎడబాటు వల్ల కూడా తనకు చావే కలుగుతుంది. ఎలాగూ చావు తప్పనప్పుడు ధైర్యంగా చావటమే వివేకం. తాను నారాయణమూర్తి వేషంలో యుద్దానికి పోతే శత్రువు భ్రమపడి, బెదిరిపారిపోనూ వచ్చు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,rabbit and lion story,panchatantra rabbit and lion story in telugu
సాలెవాడు ఇలా నిర్ధయించుకునేసరికి అసలు వైకుంఠంలో గరుత్మంతుడు శ్రీమన్నారాయణ మూర్తి వారితో భూలోకంలో జరిగినదంతా చెప్పి, “దేవా, నీ రూపం ధరించి తిరుగుతున్న ఈ సాలెవాడు యుద్దంలో చస్తే ఇక మీకు పూజా పునస్కారాలుండవు. మీలో ప్రజలకు విశ్వాసం పోతుంది. వురి ఎం చేస్తారో ఆలోచించండి, అన్నాడు.
దానికి నారాయణమూర్తివారు, “పక్షి రాజా, అక్రమంగా కప్పాలు వసూలు చేస్తున్నందుకు విక్రమసేనుడు చావాలి. ఫైపెచ్చు, వాడు నా భక్తులైన రాజవంశాన్ని నిర్మూలించ జూస్తున్నాడు. నేను సాలెవాన్ని ఆవహించి, వాడి చక్రంలో ప్రవేశిస్తాను అన్నాడు.
తెల్లవారుఝామునే సాలెవాడు రాజకుమార్తె సహాయంతో యుద్ధసన్నద్ధుడైనాడు. రాజు కూడా తన సైన్యంతో సహా యుద్దం చెయ్యడానికి నగరం వెలువడ్దాడు. రెండు సేనలూ యుద్దానికి తలపడ్హాయి. సాలెవాడు తన గరుడ వాహనం మీద ఆకాశం మీదుగా ఎగురుతూ యుద్దరంగానికి వెళ్లి, సేనలకు ఎగువగా గాలికి నిలిచి, శంఖం పూరించాడు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,rabbit and lion story,panchatantra rabbit and lion story in telugu
శంఖనాదం విని పైకి చూసే, శత్రుసేనలు, విష్ణుమూర్తే తమతో యుద్దానికి వచ్చాడనుకుని బెదిరిపోయాయి. చాలా మంది పడిపోయారు. కొందరు మూర్చపోయారు. కొందరు వెరిగా ఆకాశం కేసి  చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో సాలెవాడు తన చక్రాన్ని విక్రమసేనుడిపై విసిరాడు. అది విక్రమసేనుణ్ణి రెండుగా నరికి, సాలెవాడి చేతికి తిరిగి వచ్చింది. అతని సామంతులందరూ సాలెవాడి ముందు సాష్టాంగపడి, శరణు వేడారు. “ఇకనుంచీ మీరు సుప్రతివర్మక్షు లోబడి ఉండండి. ' అన్నాడు సాలెవాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. విక్రమసేనుడి బలాలన్నీ సుప్రతివర్మ పరం అయాయి. అనంతరం సాలెవాడు శాశ్వతంగా రాజకుమార్తెతో సమస్త సుఖాలూ అనుభవించాడు.
దమనకం చెప్పిన కథ విని కరటకం, “సరే నీకంత నమ్మకం ఉన్నది గనక పింగళకం వద్దకు వెళ్లి, నీ యుక్తి పారుతుందేమో చూడు, విజయీభవ!' అన్నది. దమనకం పింగళకం వద్దకు వెళ్లి వంగి నమస్కరించి, పింగళకం అనుమతితో కూర్చున్నది.
“నన్ను ఇంతకాలం చూడవచ్చావు కావేం?”” అని పింగళకం అడిగింది.
“ఏలినవారి క్షేమ భద్రతల దృష్ట్యా ఒక అతి ముఖ్య విషయం మనవి చేయటానికి ఇలా వచ్చాను. ఒక్కొక్కసారి, యజమానికి రుచించని మాటలు కూడా భృత్యులు మనసు విప్పి చెప్పవలసి ఉంటుంది. రుచించని సత్యాలు చెప్పే ధైర్యం విశ్వాసపాత్రులైన భృత్యులకే ఉంటుంది, ' అన్నది దమనకం.
“ఎమిటి నువు చెప్పదలిచిన సంగతి?” అని పింగళకం ఆసక్తితో అడిగింది.
“మహారాజా, ఏలిన వారి ఆదరానికి పాత్రమైన సంజీవకం రాజద్రోహానికి ఒడి గట్టాడు. తమరిని చంపి, సింహాసనం చేజిక్కించుకునే ఎత్తుగడలను చాలా మందికి తెలిపాఢు. ఇవాళే ఈ కుట్ర అమలు జరుగుతుందట. అనువంశికంగా తమ కొలువు చేస్తున్న నా విధి గనక, తమర్ని హెచ్చరించటానికి వచ్చాను,” అన్నది దమనకం.
ఈ వార్త విని పింగళకం అదిరి పోయింది. అది గమనించిన దమనకం, “మహారాజా, కదిలిన పంటిని పెరికయ్యాలి. వ్యాధిని అంకురంలోనే తుంచెయ్యాలి. శత్రువుగా తయారైన వాణ్ణీ నాశనం చెయ్యాలి. పరిపాలన యావత్తూ ఈ ఎద్దుకు అప్పగించి, తమరు పెద్ద చిక్కులో పడ్డారు, ' అన్నది.
“కాని, సంజీవకం ఉన్నట్టుండి నాకెందుకు ద్రోహం తలపెట్టాలి? నేను అతనికి అసంతృప్తి కలిగించడానికి ఎమీ చెయ్యలేదే?” అని పింగళకం అడిగింది.
“దుర్మార్గుడికి కారణాలు కావాలా మహారాజా? అతను మొదటి నుంచి ద్రోహబుద్ధి తోనే ఉన్నాడని అనుమానం. తమరూ, ఈ ఎద్దూ లాంటి బలశాలులు ఇద్దరికీ, ఈ అరణ్యంలో తావు లేదు. అతను కపటంగా తమ అనుగ్రహం సంపాదించి, పెట్టిన చేతినే కరిచే ఉద్దేశంలో ఉన్నాడు. మిరు కృతఘ్నుడి కథ వినలేదా? ” అన్నది దమనకం.
““ఎమిటా కథ?”” అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది:

కృతఘ్నుడి కథ

యజ్ఞదత్తుడనే పనికిమాలిన దరిద్రుడికి గంపెడు పిల్లలు. ఒక రోజల్లా ఇంటిల్లిపాదీ పస్తులున్న మీదట యజ్ఞదత్తుడి భార్యకు కోపం వచ్చి, "పనికిమాలిన కటికవాడా, పిల్లలు ఆకలికి చూడడం కనబడటం లేదా? ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చున్నావేం? ఎటైనా వెళ్లి ఎమైనా సంపాదించి మరీ తిరిగిరా, అన్నది.
ఈ మాటకు నొచ్చుకుని ఆ బ్రాహ్మడు ఇంటినుంచి బయలు దేరాడు. చాలా దూరం వెళ్లగా, ఒక అడవి వచ్చింది. అతనికి దాహం వేసి, నీటి కోసం వెతక సాగాడు. కీకారణ్యం మధ్య ఒక లోతైన గుంట కనిపించింది. దాని చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి ఉన్నది గాని, అందులో నీరు లేదు. యజ్ఞదత్తుడు అందులోకి తొంగి చూసే సరికి అతనికి ఒక పులి, ఒక కోతీ, ఒక పామూ, ఒక మనిషీ కనిపించారు. గుంటలో ఉన్నవాళ్లు అతన్ని చూశారు.
పులి యజ్ఞదత్తుడితో, “మహాత్మా ప్రాణ రక్షణను మించిన పుణ్యం లేదు. అందుచేత నన్ను బయటకి తీసి నా వారిని కలుసుకునేటట్టు చెయ్యి, అన్నది.
“నీ పేరు చెబితేనే ప్రాణులకు భయం కదా, నేను నిన్ను గుంటలోపలి నుంచి ఎలా పైకి తీయను?” అన్నాడు యజ్ఞదత్తుడు.
“అయ్యా ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది గాని, కృతఘ్నతకు పరిహారం లేదు. నా గురించి నువు భయపడవలసిన పని లేదు. ప్రాణాపాయ స్టితిలో ఉన్న నన్ను జాలి దలిచి పైకి తియ్యి  అన్నది పులి.
ప్రాణ రక్షణ యత్నంలో ప్రాణం పోయినా పుణ్యమే గదా అనుకుని ఆ బ్రాహ్మడు, వనలతలను బలమైన మోకుగా చేసి, దాని సహాయంతో పులిని పైకి లాగాడు.
“అయ్యా నన్ను కూడా పైకి లాగు,” అని కోతి బతిమిలాడింది. పాము కూడా అలాగే కోరింది. బ్రాహ్మడు ఆ రెంటిని గుంట నుంచి పైకి లాగాడు.(ఇంకా ఉంది)