Panchatantra stories in telugu-Moral stories in telugu-bethala kathalu-chandamama kathalu-balamitra kathalu

పంచతంత్ర కథలు 

రాజకుమార్తె అడిగిన దానికి విష్ణు రూపంలో ఉన్న సాలెవాడు "ఓ సుదర్శనా, నేను నీకోసమే వచ్చాను. నన్ను కౌగలించుకో. అన్నాడు. “స్వామీ మీరు దేవతలు. నేను మనుష్య స్త్రీని. మనకు పొత్తు ఎలా కుదురుతుంది?' అని సుదర్శన అన్నది.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,rabbit and lion story,panchatantra rabbit and lion story in telugu
“ప్రియా, నువు నా అర్జాంగి అయిన లక్ష్మివి. నీకు గుర్తు లేదా? శాపవశాన నువు మనుష్యజన్మ ఎత్తటమూ, మనకు కొద్ది కాలం ఎడబాటు కలగటమూ జరిగింది. నేను మానవ రూపంలో కొంత కాలం నీకు భర్తగా ఉన్నమీదట శాపం తీరిపోతుంది. నిన్ను మనుష్య భర్తనుంచి కాపాడటానికి వచ్చాను. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం, - అన్నాడు సాలెవాడు.
రాజకుమార్తె పరమానందం చెంది, అతనికి భార్య కావటానికి ఒప్పుకున్నది. ఇలా చాలా రోజులు వారికి సుఖంగా గడిచాయి. అర్ధరాత్రి సమయాన సాలెవాడు తన గరుడ వాహనం మీద రాజకుమార్తె వద్దకు వచ్చి, తెల్లవారబోయే ముందు ఎవరికంటా పడకుండా తిరిగి వెళ్తిపోతూ ఉండేవాడు. వెళ్లే ముందు వాడు రాజకుమార్తెతో తాను వైకుంఠానికి పోతున్నానని, మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పేవాడు.
కొంత కాలం గడిచినాక, రాజకుమార్తె చెలికత్తెలు రాజకుమార్తె వద్దకు ఎవరో వచ్చి పోతున్నారని పసికట్టి, రాజుగారు తమ అశ్రద్ద తెలిసి దండిసాడని భయపడి, రాజు వద్దకు వెళ్లి, ఆయన కాళ్ళమీద పడి, “మహారాజా మాకు అభయం ఇయ్యండి, మేము తమరికి ఒక సంగతి మనవి చెయ్యాలి, అన్నారు.
“అలాగే ఇచ్చాను. మీరు చెప్పేది చెప్పండి, అన్నాడు రాజు. “మహారాజా మేము రాజకుమార్తె సుదర్శనను వెయ్యి కళ్లతో కనిపెట్టి ఉన్నప్పటికి ఎవడో ఆమె వద్దకు వచ్చి పోతున్నాడు. వాడు ఎలా వస్తున్నాడో, ఎలా పోతున్నాడో మాకు తెలియటం లేదు. వాడు మెట్లెక్కి రాజకుమార్తె గదికి పోవడం లేదు: అలా చేస్తే మాకు తెలుస్తుంది. వాడు ద్వారం గుండానూ రావడం లేదు; అక్కడ కాపలావాళ్లు ఉన్నారు. మేము రాత్రి పదిగంటల దాకా రాజకుమార్తె వెంటనే ఉండి, ఆమెను పడుకో బెట్టి వచ్చెస్తాం. తిరిగి తెల్లవారు జామున అయిదు గంటలకు ఆమె వద్దకు పోతాం. ఈ మధ్య కాలంలో ఆమె పిలిస్తే తప్ప ఆమె శయన మందిరం వద్దకు వెళ్లం. ఆ వచ్చేవాడు ఆ సమయంలోనే వస్తూ ఉండాలి. ఎలా వసాడో, ఎలా పోతాడో ఊహించరాకుండా ఉన్నది. ఇది నిజం. ఆపైన దేవరవారి చిత్తం, అన్నారు రాజకుమార్తె చెలి కత్తెలు.
Panchatantra Stories in telugu,Panchatantra Stories for kids in telugu,Panchatantra Stories by vishnu sharma,telugu Panchatantra Stories,Panchatantra  kathalu in telugu,Panchatantra kathalu in telugu,balamitra stories in telugu,chandamama stories in telugu,bethala kathalu in telugu,bala baratam in telugu,moral stories for kids in telugu,moral stories in telugu,akber and birbal stories in telugu,neeti kathalu,mitrabedam story in telugu,rabbit and lion story,panchatantra rabbit and lion story in telugu
ఈ సంగతి విని రాజు చాలా చింతించాడు. గొప్ప వంశంలో పుట్టి కూడా తన కుమార్తె హేయమైన దారి తొక్కింది. ఇందులో తన అశ్రద్ధ ఎమి లేదు. ఆడపిల్లను కన్నవారికి అన్నీ అగచాట్లె గద! ఇలా అనుకుంటూ రాజు తన భార్య వద్దకు వెళ్ళీ, తాను విన్నదంతా చెప్పి, “ఎవడో దుర్మార్గుడికి ఆయువు తీరిపోతున్నది, అన్నాడు.
రాణి లబ లబ లాడుతూ తన కుమార్తె మందిరానికి వెళ్లి, “వంశం చెడబుట్టిన నిర్బాగ్యురాలా, నీ శీలం చెడగొట్టుకున్నావా? నీ వద్దకు వచ్చే అల్ఫాయుష్కుడు ఎవడు?” అన్నది. రాజకుమార్తె సిగ్గుతో తల వంచుకుని తల్లికి నారాయణుడు గరుడ వాహనం మీద తన కోసం వచ్చి పోతున్న వార్త తెలిపింది,
ఈ అద్భుత కథ విని రాణికి అమితమైన ఆనందం కలిగింది. ఆమె గగుర్పాటు చెందుతూ, తన భర్త వద్దకు పోయి, “మీరు ధన్యులు! మన కులదేవత అయిన నారాయణ మూర్తి ప్రతి రాత్రి మన అమ్మాయి కోసం వస్తున్నాడట. అది లక్ష్మి అవతారమట! వాళ్సిద్దరికి గాంధర్వ వివాహం జరిగింది. ఇవాళ రాత్రి మనం కిటికీ గుండా నారాయణమూర్తి వారి దర్శనం చేసుకుందాం. ఆ దేవుడు మనలాటి మానవ మాత్రులను పలకరించడనుకోండి! అన్నది.
రాజుకు కూడా అపారమైన ఆనందం కలిగింది. ఆ పగలు ఆయన అతి కష్టం మీద గడిపాడు. రాత్రి అయింది. రాజూ, రాణీ కిటికీ వద్ద చేరి, ఆత్రంగా ఆకాశం కేసి చూడసాగారు. శంఖు చక్ర గదా పద్మాలు ధరించి సాలెవాడు గరుడ వాహనం మీద రావడం వారి కంట పడింది. ఆనంద పారవశ్యలో రాజు రాణితో "ప్రపంచంలో మన కంటె ధన్యులు లేరు. లక్ష్మినే మనం గర్భవాసాన కన్నాం. సాక్షాత్తూ నారాయణమూర్తి మనకు అల్లుడయ్యాడు! మన కలలు పండాయి. మన అల్లుడి ప్రతాపంతో నేను ప్రపంచమంతా జయిస్తాను,' అన్నాడు.
కొంత కాలానికి విక్రమ సేన చక్రవర్తి మనుషులు సుప్రతి వర్మనుంచి కప్పం తీసుకు పోవడానికి వచ్చారు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తివారి మామగారు కావటం చేత, సుప్రతివర్మ.. చక్రవర్తి దూతలకు మామూలు మర్యాదలు చెయ్యలేదు. వాళ్లు ఆగ్రహించి, ''రాజా! కప్పం కట్టే గడువు దాటిపోయినా, నువ్వు ఇంకా కట్టలేదు. విక్రమసేన మహారాజు ఆగ్రహం కార్చిచ్చులాంటిది. ఎ దేవుడో నిన్ను ఆదుకుంటాడనుకుంటున్నావా? అన్నారు.
రాజు వాళ్ల బెదిరింపును ఏ మాత్రమూ లక్ష్యపెట్టలేదు. వాళ్లు చక్రవర్తి వద్దకు వెళ్ళి, తమకు జరిగిన అవమానాన్ని వెయ్యింతలుగా చేసి చెప్పారు. మహారాజు తన సామంతులందరినీ వెంట బెట్టుకుని, పెద్ద సేనతో సుప్రతి వర్మ ఎలే దేశం మీదికి దండయా(తకు వచ్చాడు. అతడు జనహింస ప్రారంభించే సరికి, బాధితులైన ప్రజలు పుండ్రవర్ధనానికి వచ్చి, రాజభవనం ముందు ఆక్రోశించారు. అయినా రాజు చలించలేదు:
త్వరలోనే విక్రమసేనుడు పుండ్రవర్దనానికి వచ్చి, నగరాన్ని ముట్టడించాడు. మంత్రులూ, పురోహితులూ, నగర ముఖ్యులూ రాజు వద్దకు వచ్చి, తాత్సారం దేనికి అని అడిగారు. రాజు చిరునవ్వుతో, "విచారించకండి. శత్రువును నిర్మూలించే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయాని కల్లా ఈ పని జరగటం మీరే చూస్తారు,” అన్నాడు.
ఆయన తన కుమార్తె సుదర్శనను పిలిపించి, ఆమెతో మధురంగానూ, గౌరవంగానూ, “"అమ్మానీ భర్త బలం చూసుకుని నేను శత్రువుతో యుద్ధం తెచ్చుకున్నాను. అందుచేత ఈ రాత్రి వారు నీవద్దకు వచ్చినప్పుడు, తెల్లవారెసరికల్లా శత్రునాశనం జరిగేలా చూడు, అన్నాడు.
సాలెవాడు ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు, రాజకుమార్తె అతనితో సంగతి అంతా చెప్పింది. వాడు చిరునవ్వు నవ్వుతూ, “ప్రియా, హిరణ్యకశివుణ్ణి, కంసుణ్జీ, మధుక్రైటభులనూ చంపిన నాకు మానవ మాత్రులను చంపటమనగా ఎంత? నా చక్రాయుధంతో శత్రువులను నిర్మూలిస్తానని నీ తండ్రికి చెప్పు. అన్నాడు.
సుదర్శన గర్వంతో ఈ మాట తన తండ్రికి చెప్పింది. మర్నాడు ఉదయానికల్లా విక్రమసేనుడు వధించబడతాడని, ఆయన సొత్తు ఎవరికి దొరికినది వారు ఉంచుకో వచ్చని రాజు నగరంలో చాటింపు వేయించాడు. ప్రజలు హర్షించారు. (ఇంకా ఉంది)