మోక్షగామి

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
వైశాలీ నగరంలో శంభుడూ, నారాయణుడూ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.“జీవితంలో మనం చేయవలసింది అంతా చేసేశాం. వాన ప్రస్థధర్మం పాటిస్తూ, కుటుంబ వ్యవహారాలలో తల దూర్చకపోయినా విపరీత పరిస్థితుల్లో కలుగజేసుకోక తప్పదు. అందుకని హిమాలయాలకు పోయి మోక్షసిద్ధి కోసం తపస్సు చేసుకుందాం, పద అని శంభుడు పదే పదే పోరసాగాడు. నారాయణుడు చాలా కాలం తాత్సారం చేసి చివరికి సన్యాసానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ దీక్ష. పుచ్చుకుని హరిద్వార్సమీపంలోని తపోవనంలో తపస్సు ప్రారంభించారు
కొన్నేళ్ళ కఠోర తపస్సు తర్వాత భగవంతుడు శంభుడి ముందు ప్రత్యక్షమై, 'వరం కోరుకో!" అన్నాడు. “దేవా జీవితమంటినే అలసట పుట్టింది. బతికి ఉన్నంతకాలమూ తెలిసీ ఎవరికీ అపచారం చెయ్యలేదు. నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామీ!' అని కోరాడు శంభుడు. 'వెర్రివాడా! శక్తి, పదార్థాల సముతుల్యం కోసం విశ్వంలో జనన మరణాలు సృష్టించబడ్డాయి. మోక్షమంటే గతజన్మల వాసనలూ లేకుండా, అత్మల్ని పుఠం పెట్టి తిరిగి జన్మల్ని ప్రసాదించడం జరుగుతుంది. మోక్షమంటే జన్మరాహిత్యమనే భ్రమలో చాలామంది ఉంటారు. ఇలాంటి మోక్షమే కావలిస్తే అలాగే ప్రసాదిస్తాను అన్నాడు భగవంతుడు
ధన్యుణ్ణి స్వామి! మీ రుణం ఎలా తీర్చుకోగలను?” అని అడిగాడు శంభుడు
నా రుణం తీర్పాలంటే జన్మలు తప్పవు వురి! సరే, నీ స్నేహితుడు ఎమంటాడో చూద్దాం పడ. నా వెంటే రా. అతనికి నువ్వు కనబడవులే, అన్నాడు భగవంతుడు
భగవంతుడు ఎదుట నిలబడి వరం కోరుకోమనగానే నారాయణుడు భక్తితో నమస్కరించి ప్రార్ధించాడు. ప్రభూ! యుక్తా యుక్త విచక్షణతో జీవితాలు కొనసాగించవలసిందిగా నీవు మానవులకు వాక్కునీ, జ్ఞానాన్నీ ప్రసాదించావు. అయితే ఇంద్రియ స్వభావాలతో మనసు చంచల గతిని ప్రవర్తించే కారణంగా జీవిత సాఫల్యాన్ని పాందే వీలు కాలేదు. దివ్యమైన ఆత్మానందాన్ని, కోరికలు పట్టి లాగే శరీరంతో పొందలేకుండా ఉన్నాను... 
భగవంతుడు మధ్యలో కలుగజేసుకుని, “మోక్షాన్ని కోరుకో!' అన్నాడు. “నీలో ఐక్యమైపోయిన తర్వాత నేను అన్న భావన లేకపోతే అనందాన్ని అనుభవించే మార్గమే లేదు కదా? అందుకని నాకు మోక్షం వద్దు!” 
మరేం కావాలి? భగవంతుడు నవ్వుతూ ప్రశ్నించాడు. 'నాకు మరల మరల పునర్ణన్మలనివ్వు. ఆరోగ్యకరమైన శరీరాన్ని ప్రసాదించు. చిత్తచాంచల్యానికి లొంగుబాటు కాని మనస్సు ప్రసాదించు. సత్య మార్గాన పయనిస్తూ నిత్యమూ పరోపకారం చేసే సద్చుద్దిని కలిగించు. ప్రతి జన్మలోనూ నీ దివ్యనామస్మరణం చేస్తూ అలౌకికా నందం పొందేటట్టు అను గ్రహించు. మోక్షం కోరి నీలో ఐక్యమైపోతే నేను సమాజానికి చేయగలిగింది ఏమీ ఉండదు కదా?” 
అలాగే కానివ్వు. నీ చిత్తశుద్ది నాకు నచ్చింది. పలాయనవాదంతో మోక్ష సిద్ది కోరుకునేవారికంటే ప్రాపంచిక విషయాలలో ములిగి తేలుతూనే, సన్మార్గాన్ని వీడకుండా, లోకకల్యాణం కోసం పాటుపడే మానవుల అవసరం నాకూ ఉంది. నీ ఇష్టప్రకారమే జరుగుతుంది!" అంటూ భగవంతుడు అక్కణ్బుంచి అదృశ్యమయ్యాడు
ఎమంటావ'ని శంభుణ్ణి తర్వాత ప్రశ్నించాడు భగవంతుడు
"మోక్షంలోనూ ఇన్ని మెలికలున్నాయని ఇప్పుడే తెలిసింది. నారాయణ ఆలోచన బాగుంది. మీ రుణం తీర్చుకోవడానికి జన్మలు తప్పవని మీరే సెలవిచ్చారు కదా, అలాగే దీవించండి! అన్నాడు శంభుడు. “తథాస్తు! అంటూ భగవంతుడు అదృశ్యమయ్యాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids