ఎవరిది పాపం 

అనగా అనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడూ, దైవభక్తిపరాయణుడూ
ఒకరోజున కౌశికుడు ఒక పండితుణ్ణి విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలూ పెరుగూ తెచ్చే పాలమనిషిని పిలిచి, “అమ్మీ, రేపు గట్టిగా తోడుపెట్టిన పెరుగు తెచ్చావంటే, మామూలుకంటి, ఎక్కువ డబ్బులిస్తాను, అని చెప్పాడు
పాలమనిషి కల్తీలేని గట్టిపెరుగు తోడుపెట్టి, ముంత భద్రంగా గంపలో పెట్టుకుని వురునాడు ఉదయం బ్రాహ్మడి ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబ నడుస్తూ ఉండగా, గాలి విసురుకు పెరుగుముంత. మీది గుడ్డ కాస్తా తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడ పక్షి త్రాచు పాము నొకదానిని కాళ్లతో పట్టుకుని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగిలకొట్టుకుంటూన్న త్రాచుపాము విషం కక్కింది. విషం సరాసరి పాల మనిషి నెత్తిన ఉన్న పెరుగుముంతలో వచ్చిపడింది.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
పాలమనిషి తిన్నగా కొశికుని ఇంటికి వెల్లి, పెరుగుముంత ఇచ్చేసి, చక్కాపోయింది. కౌశికుడు ముంత పట్టుకుపోయి భద్రపరచుకున్నాడు
విందు సమయమయింది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్ని చాలా రుచిగా ఉండంటం చేత, సుష్టుగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు
ఐతే. భోజనమైన కొంచెం సేవటిలోనే పండితుడు గిలగిల తన్నుకుని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఎమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు? ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకుని, కొశికుడు ఎంతగానో విచారించాడు
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు వ్రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది. పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది. అనే సమస్యతో అతను తికమకలు పడసాగాడు
పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక పాపం అతనిదే అనుకున్నాడు. కాని వెంటనే అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి, పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అని ఉత్సాహంతో వడ్డించాడు
కాని, పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు? తెలిసి వుంటే వడ్డించడు కదా? బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపం అతనికి అంటదు, అని తర్కించుకున్నాడు
పోనీ, పెరుగు తెచ్చిన పాలమనిషిది తప్పా! ఊహు, గంపమీద గుడ్డ ఎగిరిపోవతం కాని, ముంతలో పాము విషం పడటం కాని ఎదీ తెలియదు ఆమెకు. అందుచేత పాలమనిషికి పాపము చెందదు అని నిశ్చయించుకున్నాడు
ఐతే. ముంతమీదినుంచి గుడ్డ తొలగకుంటే, పాము కక్కిన విషం పెరుగులో కలియటం, పండితుడు చనిపోవడం జరగదు కదా! కనుక, గుడ్డను తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు, అని మల్లీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి విచకుంటే ప్రాణి. కోటి బ్రతికేది ఎట్లా? వాయుదేవుడికి వీచటం సహజగుణం. వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు. అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు
పోతే, విషం కక్కిన పాముకి చెందుతుందా పాపం? అదీ సమంజసంగా కనబడలేదు. గరుడపక్షి తనను గోళ్ళతో నొక్కిపట్టుతూ ఉంటే బాధ భరించలేక, ప్రాణంపోయే సమయంలో అది విషం కక్కింది. విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగ్గా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా? కాబట్టి పాముని తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు
ఇక మిగిలిందల్లా గరుడపక్షే. దాని ఆహారంకోసం అది త్రాపత్రయపడి పామును పట్టుకుంది కాని, తక్కిన గొడవంతా దానికేం తెలుసు. పైగా ముంతలోనే విషంకక్కమని అదేం పామును నిర్చంధించలేదే? అందుచేత గరుడపక్షి పూర్తిగా నిరపరాధి. విధంగా చూసినా, ఇందులో ఎవరినీ తప్పుపట్టడానికి వీలులేకుండా ఉంది. విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమ ధర్మరాజు వద్దకుపోయి, సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకూ ఎమీ తోచక, అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగేడు. వారూ ధర్మం నిరయించలేకపోయారు
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
యముడు తిన్నగా విష్ణువు దగ్గరకు ' పోయి విన్నవించాడు. విష్ణువుకీ పాలుపోయింది కాదు. సభ చేశాడు. ఎవరూ ధర్మ నిర్ధారణ' చేయలేకపోయారు. అప్పుడు యముడు '“చిత్రగుప్తుడితో ఇది తేలే విషయం కాదు. నేను మళ్లీ చెప్పేవరకూ పాపం ఎవరికీ చెందినట్లు లెక్క రాయవద్దు, అన్నాడు
ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒకే చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. చెట్టుమీద ఉన్న పక్షి దంపతులు రోజున తాము గరుడిని వల్ల విన్న వృత్తాంతాలు- కౌశికుడు పండితుడికి విందు చేయడం, పండితుడు చనిపోవడం, దీనిగురించి యముడు తిప్పలు పడటం చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న  బ్రాహ్మణుడు సంగతి అంతా రెండవ వానికి చెప్పిదీనికే ఇంత బ్రహ్మాండమా? నన్నడిగితే తీర్పు చెప్పేవాడిని. వస్తుపరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు పోయాడు. పాపం కౌశికుడిదే అన్నాడు
ఆసమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులు మాటలు విని, బ్రాహ్మణుడిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. ' మాటలు నీవు అన్నావా లేదా? అని యముడు బ్రాహ్మణుడిని అడిగాడు. “అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు
అప్పుడు యమధర్మరాజు రెండు కుండల పెరుగు తెప్పించాడు. ఇందులో - ఒకదానిలో రహస్యంగా విషం కలిపించి,  బ్రాహ్మణుడి ముందు పెట్టించాడు.  'బ్రాహ్మడా రెండు కుండలలోనూ  దేనిలో విషం కలిసి ఉందో చెప్పు, అన్నాడు
బ్రాహ్మణుడు తెల్లబోయాడు. రెండు కుండల్లో ఏది విషం కలిసినదో, ఏది కలియనిదో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూచి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగుకుండ అయితే తను మరణిస్తాడు
అప్పుడు యముడు కోపించి, 'బ్రాహ్మడా నీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టు ఉండక, పరులమీద నిందలాడావు. అందుచేత, పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది, అని చెప్పి, అతని పేరు చిత్రగుప్తుడి లెక్కలలో వ్రాయించాడు
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా బ్రాహ్మణుడికి అంటుకున్నది.