రుజువు

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids
సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం. ఊర్లో ఒకే దుకాణం ఉండటం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగులేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునే వాడు
వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్భీదు ఇవ్వడం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు
ఒక రోజు చౌకగా వస్తున్నాయని రెండువేల కొబ్బరి కాయలు ఒక్కసారిగా కొనేసాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజునాన్నగారూ! ఇవి మంచిరోజులు కావు. నెలలో పూజలు, వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలో ఆలస్యమైతే నిల్వవలన కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో,' అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు
సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలి గాని, కొబ్బరికాయలన్నీ రోజే అమ్మకం చేయగలను. అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను, అన్నాడు
ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది. “కొబ్బరికాయ ఒకటి కావాలిఅని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకు ముందే పరిచయం ఉండటంతో "ఒక్క కొబ్బరికాయ దేనికమ్మాతీసుకువెళ్తున్నావు? అని అడగాడు
ఇంటికి చుట్టాలు వచ్చారు. పాయసంలో కొబ్బరి కోరు వేసేందుకు,” సమాధానమిచ్చింది సుగుణ
నీకీ విషయం తెలియదా?...” అంటూ సాగదీశాడు సుబ్బరాజు
“ఏ విషయం?” ఆతృతగా అడిగింది సుగుణ
దిష్టి కొబ్బరికాయల పూజ విషయం!” చెప్పాడు సుబ్బరాజు
“ఏమిటా పూజ?" ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణం
ప్రతి ఇల్హాలు ఇంటి యజమానికి మూడు కొబ్బరి కాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి. అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం,' అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు
ఎవరు చెప్పారు?” అడిగింది సుగుణ
పొరుగూరి జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ల ఊరు వారంతా పూజ చేసి సుఖంగా ఉన్నారు. ఇంతవరకు నీ చెవిన పడలేదా?” అడిగాడు సుబ్బరాజు
నాకు తెలియదు' అమాయకంగా అంది సుగుణ.
గ్రహదోష పరిహారార్థం రోజే పూజ చేయి. నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసినవాళ్తందరికీ వూజ గురించి చెప్పు. మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది,” అన్నాడు సుబ్బరాజు
దానితో సుగుణకు ఒళ్లు జలదరించింది. భయంతో మూడు కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళిపోయింది
పూజ గురించి పొరుగూరు జ్యోతిష్కుడు -ఎప్పుడు చెప్పాడు నాన్నా? అడిగాడు సోమరాజు
అదేరా చిట్కా అంటే! మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావలిసిందే చూడు ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు' నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు
మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా!” అడిగాడు సోమరాజు. '
అందరికీ ఇది మూఢనమ్మక్షమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యంఅంటూ సమర్ధ్థించుకున్నాడు సుబ్బరాజు
సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా పూజా విషయం. ఊరంతా పాకింది. సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన రెండువేల వరహాలను చూసి మురిసిపోయాడు
దుకాణం మూసి తం డ్రికొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సువుతి వచ్చి "కొబ్బరి కాయలు తెచ్చారా? దిష్టిపూజ చేయాలి!” అంటూ ఆతృతగా అడిగింది.
కాయలన్ని అమ్ముడుపోయాయి. లాభం. రెండు వేల వరహాలు మాత్రం తెచ్చాను,” నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. “లాభం సంగతి దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకు పదివేలు అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ' తాయెత్తు ఎక్కడిది?” అడిగాడు సుబ్బరాజు
మీకు తెలియదా? గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు. పదివేల వరహాలు ఇచ్చి తాయెత్తు కొన్నాను. దీని వలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు, ' అంది సుమతి
సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు.“తాయెత్తు ఎవరు కొనమన్నారు? అవన్నీ ఒట్టి మూఢనమ్మక్షాలే. తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేశావు?' అంటూ భార్యపై విరుచుకు పడ్డాడు
నాన్నగారూ! ఇందులో అమ్మ తప్పులేదు. మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరున లేవదీసిన పుకారు రెండువేల వరహాలు లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలచుకుని జ్యోతిష్కుడు అమ్మదగ్గర పదివేల వరహాలు తీసుకుని తాయెత్తును అంటకట్టాడు. మీ పుకారే లేకపోతే పదివేల వరహాలు నష్టం వచ్చేది కాదు, అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు
పుకారు లేవదీసింది తమరా?” అంటూ కోపంగా చూసింది సుమతి
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu,Moral Stories for kids in telugu,telugu moral stories for kids

తను స్వార్ధం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు.