మహారాజయోగం
బుందేల్
ఖండ్‌లో ఒకప్పుడు ఠాగూర్ వంశంవారు
జనరంజకంగా పరిపాలించారు ఆ వంశానికి చెందిన
రూపసింహుడనేవాడు కడు పేదవాడు. అతనికి
ధనంగాని, అస్తి కాని, చివరకు
బంధువులుగాని లేరు. అతనికున్న అస్తి
యావత్తూ చినిగిపోయిన దుస్తులూ, రెండు గోనేనే పట్టాలూ,
ఒక గొడ్డలీ.
ఈ
గొడ్డలితో రూపసింహుడు రోజూ ఉదయం నుంచీ
మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు
కొట్టి, వాటిని తెచ్చి మూడు రూపాయలకు అమ్ముకునే
వాడు. అందులో రెండు రూపాయలు ఖర్చుపెట్టి
చాకలివాళ్ల దగ్గిర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునే వాడు. మరొక రూపాయికి
గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు.
ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి, వాయువేగంతో నగరపు వీధుల వెంట
రాజరీవితో సవారి అయి వెళ్లేవాడు.
మంచి
యువకుడూ, అందగాడూ అయిన ఈ వ్యక్తిని
చూసి అందరూ అతనెవరో రాజనుకునేవారు.
ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజూ ఠాకూర్ రాజ వంశ గౌరవాన్ని
నిలబెట్టి, చీకటిపడగానే అద్దె దుస్తులనూ గుర్రాన్ని
తిరిగి ఇఛ్చివేసి తన మామూలు దుస్తులు
ధరించి, చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలూ, శనగపప్పూ
కొని తిని, కాసిని మంచినీళ్లు
తాగి, ఒక గోనెపట్టా నేలమీద
పరుచుకుని, మరొకటి మీద కప్పుకుని నిద్రపోయేవాడు.
తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు
అడవికి బయలుదేరాడు.
ఒకనాడు
రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా సమీపంనుంచి సువాసన
తగిలింది. వెళ్లి చూసేసరికి మంచి గంధపు చెట్టు
కనిపించింది.
రూపసింహుడు
గొడ్డలితో మంచి గంధపు చెట్టు
బెరడు కొంత చెక్కి తీసుకుని,
యధాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి
తిరిగి వచ్చాడు.
ఆ
సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయి పోతుండగా
నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి
ఎదురై "నమస్కారం మహా ప్రభూ,” అన్నాడు. 'ఎవరవోయ్ నీవు?” అని ఠీవిగా ప్రశ్నించాడు
రూపసింహుడు
“ప్రభూ,
నేను వ్యాపారం చేసుకునే వాణ్ణి. తమ దేశంలో వ్యాపారం
ముగించుకుని పోతున్నాను, అని విన్నవించుకున్నాడు పరదేశి.
రూపసింహుడు
తన జేబులోనుంచి గంధపు చెట్టు బెరడు
తీసి, పరదేశికి ఇస్తూ, “ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహళరాజుకు అందజెయ్యి, నీ పని సానుకూలం
అవుతుంది!” అని తన
గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్లి పోయాడు.
ఆ
ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళ రాజుకు అందజేశాడు. గంధపు చెక్క ఎరగని సింహళ రాజు
ఆ కానుకకు ముగ్గుడై, వర్తకుడికి సమస్త సదుపాయాలూ గాక,
అతనిద్వారా రూపసింహుడికి రత్నాలు
పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు.
ఆ
వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు
నగరు కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు
గుర్రం మీద రాజదుస్తులు ధరించి
గుర్రంమీద ఎక్కి వచ్చాడు. 'నమస్కారం,
మహాప్రభూ,” అన్నాడు వర్తకుడు.
“ఎవరు
నీవు? అన్నాడు రూపసింహుడు, గురం ఆపి.
“మహాప్రభూ,
నేను పరదేశి వ్యాపారిని తాము పంపిన కానుక
సింహళరాజుకు అందజేశాను. ఆయన తమకీ పాదుకలు
పంపారు, అన్నాడు వర్తకుడు.
“నీవిప్పుడు
ఏ దేశానికి పోతున్నావు? అని అడిగాడు రూపసింహుడు.
“అరేబియా దేశం వెళుతున్నాను, అన్నాడు
వర్తకుడు.
“అయితే
అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా
కానుకగా బహుకరించు, నీ పని సానుకూలమవుతుంది,"
అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి, శరవేగంతో వెల్లిపోయాడు.
వర్తకుడు
అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి, ఆ అమూల్యమైన
కానుకను పంపిన రాజు సామాన్యుడై
ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు.
వాటిలో ఉత్తమోత్తమమైనవి నూరు తెప్పించి చక్రవర్తి
వర్తకుడికి ఇచ్చాడు.
“రూపసింహ
ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి,
ఈ నూరుగుర్రాలు మా కానుకగా వారికి
అందజెయ్యి. వారు పంపిన కానుక
ఆనందాన్ని కలిగించింది. అని వర్తకుడికి చెప్పాడు.
వర్తకుడు ఆ నూరు గుర్రాలనూ
శ్రద్ధగా వెంటబెట్టుకు వచ్చి మామూలు ప్రకారం
కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రంమీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసి
ఆగాడు. వర్తకుడు నూరు అరేబియా గుర్రాలనూ
చూసి, “మహా ప్రభూ, అరేబియా
చక్రవర్తి మీకు వీటిని కానుకగా
పంపారు. స్వీకరించండి!" అన్నాడు.
“నీవిప్పుడు
ఏ దేశం పోతున్నావు?' అని
అడిగాడు రూపసింహుడు.“నేను తిరిగి సింహళం
పోతున్నాను, అన్నాడు వర్తకుడు. “అయితే విటిని తీసుకుపోయి
సింహళరాజుకు మా కానుకగా ఇవ్వు,
అంటూ రూపసింహుడు వేగంగా వెళ్లిపోయాడు.
వర్తకుడు
నూరు అశ్వాలనూ సింహళరాజుకు సమర్పించి, "అది రూపసింహఠాకూర్ కానుక
అని విన్నవించాడు.
ఈ
కానుక చూడగానే సింహళ రాజు హృదయం
ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే
కాక, అతని స్నేహం మరింత
విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడనీ, అందగాడనీ, వర్తకుడివల్ల విని సింహళ రాజు
తన ఎకైక పుత్రికను అతనికిచ్చి
పెళ్లి చేయతలపెట్టాడు. రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులూ,
ఆభరణాలూ ఇచ్చి, పెద్ద పరివారాన్ని వర్తకుడి
వెంట పంపాడు.
రూపసింహుడి
నివాసస్థానం తెలియని కారణం చేత వర్తకుడు
సింహళ రాజు పంపిన పరివారాన్ని
నగర కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే, రూపసింహుడు గుర్రంమీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం
అందజేశాడు. రూపసింహుడు, ఆ సందేశాన్ని తీసుకుని,
'మర్చాడు అదేచోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళిపోయాడు.
రూపసింహడు
తన అరువు దుస్తులనూ, గుర్రాన్నీ
ఇచ్చివేసి, సింహళ రాజు పంపిన
దుస్తులనూ అభరణాలనూ ధరించి ఆ రోజు కట్టెలమ్మగా
వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి
కూడలికి చేరాడు. అక్కడ వర్తకుడూ, సింహళ
రాజు పరివారమూ సెద్ధ్దంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ
దేశానికి ప్రయాణమై వెళ్లారు.
సింహళ
రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళరాజుకు కుమూరులు లేనందున, కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం
పరిపాలించాడు.
0 Comments