Chandamama Kathalu for Kids in Telugu-Chandamama Kathalu in Telugu for Children

తేడా 

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
ఆ రోజు ఎదురింటి రోజీ పుట్టినరోజు వేడుకకి వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఇంట్లో ఎవరితోను మాట్లాడకుండా రెండు బుగ్గలమీదా చేతులుంచుకుని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది ఆరేళ్ల దీపిక. 
దీపిక తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కగానొక్క కూతురయిన దీపికను వాళ్లు ఎంతో అపురూపంగా చూసుకుంటారు మరి. 
నువ్వేమయినా దీపూని కోప్పడ్డావా?”' అని అడిగాడు భార్య మైత్రేయిని.
లేదే... ఎందుకలా అడుగుతున్నారు అంది మైత్రేయి భర్తతో. 
మరయితే రోజూ గలగలా నవ్వుతూ ఇల్లుపీకి పందిరివేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది?” 
‘నేను వంటింటి పనిలోపడి గమనించనేలేదు సుమండీ! ఎదురింటి డాక్టరు గారమ్మాయి రోజీ పుట్టినరోజుకి వెళ్లేటప్పుడు బాగానే ఉందే! పదండి కనుక్కుందాం’ అంది మైత్రేయి.
ఏమ్మా దీపూ! అలా ఉన్నావేం?”' లాలనగా అడిగిన తండ్రికేసి చూసిన దీపిక కళల్లో ఏదో బాధ కదలాడింది.
మరేమో రోజీకి ఎన్ని బహుమతులొచ్చాయో నాన్నగారూ! కార్లు, బొమ్మలు, బట్టలు ' అంది రోజీ. 
'వెంకటరాజుకి విషయం అర్థమయింది. 
అన్నట్టు దీపూ! రేపు బడిలో పాటల పోటిలున్నాయన్నావు. బాగా సాధన చేసావా? ఎదీ ఓసారి పాడి వినిపించుమరి!  అన్నారాయన దీపిక దృష్టిని మళ్లిస్తూ... 
తను అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది దీపిక. తల్లి పాటలో ఒకటి రెండు చోట్ల ఎలా చక్కని భావాన్ని పలికించాలో చెప్పి సరిదిద్దింది
మరునాడు సాయంత్రం వెంకటరాజు వచ్చేసరికి దీపిక గుమ్మందగ్గరే ఎదురయింది. పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చినత్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని తండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది.
ఎంతో ఖరీదు చెయ్యని పుస్తకం చూసి ఎందుకంత సంతోషం తల్లీ!” అని అడిగారు వెంకటరాజు నవ్వుతూ
“మరేమో నాకు బహుమతి ఇస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్దయ్యాక ఎంతో గొప్ప గాయనివి అవుతానని మెచ్చుకున్నారుగా.
అంటే ఇది నీ ప్రతిభకి గుర్తింపుగా వచ్చిన పుస్తకం అన్నమాట ' అన్నాడు తండ్రి.
దీనిని భద్రంగా దాచుకుంటాను. ఎంత పెద్దయినా దీనిని నేను మర్చిపోలేను నాన్నగారూ! ” అంది దీపిక మెరుస్తున్న కళ్లతో
చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం, వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేవి వారిని ఉన్నత స్థానాలకు తీసుకు వెళాయని తెలిసిన వెంకటపతి రాజు కూతురి తల ప్రేమగా నిమురుతూ అన్నారు
దీపూ! ఇప్పటికయినా కానుకలకీ బహుమతికీ తేడా తెలిసిందా! కానుకలనేవి మనకి ఇష్టమైన వారు మనమీద ప్రేమతో ఇచ్చేవి. బహుమతి మన స్వయంకృషితో మన ప్రతిభకి గుర్తింపుగా మనం సంపాదించుకునేది. రెండూ సంతోషం కలిగించేవే అయినా మన కష్టం లేకుండా వచ్చేవాటికంటె మనం కష్టపడి సాధించుకున్న బహుమతులకే ఎక్కువ విలువని నీకు అర్ధమయిందిగదా!
దీపిక బాగా అర్ధమయిందన్నట్టు తల ఊపడమె కాకుండా తనకి వచ్చిన బహుమతిని అలాగే అపురూపంగా గుండెకి హత్తుకుని చుట్టుప్రక్కల స్నేహితులందరికి చూపించేందుకు సంబరంగా బయటికి పరిగెత్తింది.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu