Chandamama Kathalu for Kids in Telugu

వేట

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
పంచవని రాజ్యం రాజు విక్రమధీరుడు మహావీరుడు. అయితే అతనికి తనను మించిన వారు లేరన్న అహంకారం జాస్తి
అతడికి వేటంటే ప్రాణం. వీలు చూసుకుని తరచుగా అరణ్యానికి వెళ్ళి జంతువుఅను వేటాడేవాడు
ఎప్పటిలాగే ఒక పర్యాయం విక్రమధీరుడు మెరికల్లాంటి కొంతవముంది సైనికులను వెంట తీసుకుని అరణ్యానికి వేటాడటానికి వెళ్లాడు. ఒక జింక పిల్లను చూసి బాణం గురిపెట్టాడు. అదే సమయానికి దూరం నుంచి ఒక బాణం వచ్చి జింక పిల్లను తాకింది. అది నేలకు ఒరిగింది
తను గురిపెట్టిన జింక పిల్లను వేటాడినది ఎవరా అని విక్రమధీరుడు బాణం దూసుకొచ్చిన దిశగా చూశాడు. ఒక పొదమాటునుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని వేష ధారణ చూసిన విక్రమధీరుడు అతడు తప్పక వేటగాడు అయి ఉంటాడని భావించాడు. వేటగాడు మహారాజును సమీపించినంతనే నవమస్కరించి, 'మహారాజా! క్షమించండి. మీరు జింక పిల్లకు బాణం గురిపెట్టిన విషయం తెలియక నేను బాణం వదిలాను, అన్నాడు
విక్రవుధీరుడు కన్నెరజేసి, ఎవరు నువ్వుఅని ప్రశ్నించాడు. “నా పేరు రణమల్లు. పొట్టపోసుకోవడానికి జంతువులను వేటాడుతుంటాను,” అని చెప్పాడతను
నేను వేటాడ దలిచిన జింకపిల్లను నీవు వేటాడి పెద్ద తప్పు చేశావు. అందుకు శిక్షగా నీ కుడిచేతి బొటన వేలును నరికిస్తాను.' అన్నాడు విక్రమధీరుడు. “మహారాజా! తెలియక చేసిన తప్పుకు అంత శిక్ష తగదు. విలుకాడికి కుడిచేతి బొటన వేలు ప్రాణంతో సమానమని మీకు తెలియనిది కాదు, అన్నాడు రణమల్లు
నీవు నన్ను మించిన విలుకాడివా?' అని పరిహసించాడు విక్రమధీరుడు.
మీరు యుద్ద భూమిలో ఎంత వీరులో, అరణ్యంలో నేనంత వీరుణ్ణీ, బదులు పలికాడు రణమల్లు
విక్రమధీరుడు ఆగ్రహంతోతక్షణం విడిప్రాణం తీయండి.” అని భటులను ఆదేశించాడు
భటులు రణమల్లు మీద కత్తులు దూస్తుండగా హఠాత్తుగా ఒక మహా వృక్షం మీదనుంచి భయంకరమైన కొండ చిలువ మహారాజు మీదపడి అతణ్ణి  చుట్టేసింది. 
మహారాజు, సైనికులు బిత్తరపోయారు. కొండ చిలువ బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు గాని, అతని శక్తి చాలలేదు. సైనికులు, కత్తులు దూసి కూడా కొండ చిలువ వమీద దాడి వసే స్త మహారాజుకు మరింత ప్రమాదమని శంకించారు
దృశ్యం చూసిన రణిమల్లు తక్షణమే విల్లు సంధించి రాజుకు చిన్న గాయమైనా తగులకుండా, కొండ చిలువ మీదకు వదిలాడు. దాంతో కొండ చిలువ పట్టు సడలించింది. అదే అదునుగా వికముధీరుడు కొండచిలువ బారి నుంచి బయటపడి పరుగున ఇవతలికి వచ్చాడు. రణమల్లు కొండచిలువను సమీపించి తన మొలనున్న చురకత్తి తీసి దాని ప్రాణం తీశాడు
విక్రమధీరుడు, రణమల్లును కౌగలించుకుని, “అహంకారంతో నిన్ను చులకన చేసి మాట్లాడాను. నీ ప్రాణం తీయించబోయాను. అయినా నీవు నన్ను కాపాడావు. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నా శత్రురాజుకు వస్తే నేను అతని చావునే కోరతాను. నీలా దయచూపను. నీవు నా కంటే గొప్పవాడివి. నన్నుమన్నించు, అని కోరాడు
అందుకు రణమల్లు, “మహారాజా! విలుకాడికి చేతి బొటనవేలు ఎంత ముఖ్యమో, మనిషి అనేవాడికి మానవత్వం అంత ముఖ్యం. ఒక మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతే గాని ఇందులో నా గొప్పదనం ఏమీలేదు,” అని వినయంగా బదులు పలికాడు
విక్రమధీరుడు తన మెడలోని ముత్యాలహారం తీసి, రణమల్లు మెడలో వేసి అతనికి కృతజ్ఞతలు చెప్పి, వెనుదిరిగాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu