విమర్శ 

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
త్రిపర్ణ సామాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడు, సమర్దుడునూ. రాజ్యవ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణను పాటించగలడని పేరుపొందాడు
ఒకసారి సర్వసేనాని శూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, ప్రభూ! మన సామంత రాజ్యాలలో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఎలినవారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పంకట్టడానికి కూడా సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నాడు. తమ ఆజ్ఞ అయితే తక్షణమే వెళ్లి అతనికి బుద్ది చెప్పి వస్తాను, ' అన్నాడు
సేనాని మాటలు విన్న విష్ణువర్ధనుడు, 'అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేం ఆలోచిస్తాం,' అని అప్పటికి అతడిని పంపేశాడు
చక్రవర్తి ఆదేశాలకు ఎదురుచూస్తూ, రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలను చేసుకోసాగాడు శూరసేనుడు. అంతలో రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానేవచ్చింది. ఉత్సాహంగా వెళ్లాడు అతను
విష్ణువర్ధనుడు, శూరసేనుడితో రామాపురం గురించి గాని, అనంతవర్మ గురించిగాని ప్రస్తావించలేదు. 'శూరసేనా! ఉమ్మడి కరుటు౦బపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాము మేము. సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము, ' అన్నాడు
సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి విష్ణువర్దనుడు తరచుగా అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తుండటం కద్దు. అందుకే, “అవశ్యం సెలవీయండి, ప్రభూ! అన్నాడు'శూరసేనుడు.  
అధ్యయనంలో భాగమైన కుటుంబంలో సామరస్యతను గూర్చి, పరిశీలించేందుకుని వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి,' చెప్పాడు విష్ణువర్దనుడు.
నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెల్లి ప్రశాంతంగా ఆలోచించి.. గత మూడు మాసాల్లోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు, వాటిని నీ కుటుంబంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలూ వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి
ఓస్‌, అదెంత భాగ్యం!' అనుకున్న శూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు
మర్నాడు తల వేలాడేసుకుని వచ్చిన సేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్దనుడు.
మహాప్రభూ! తరచి చూస్తే గత మూడు మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కాని, నా ఇద్దరు కుమారులు కాని ఎకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు ఒకటీ ఆరా తప్పితే ఎవీలేవు,” అని విన్నవించుకున్నాడు శూరసేనుడు
విష్ణువర్ధనుడు విస్తుపోతూ, “ఆశ్చర్యంగా ఉన్నదే! మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేసావ్‌? వారిని దండించి నీ దారికి తిప్పుకున్నావా లేదా?' అనడిగాడు
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
అందుకు శూరసేనుడు నవ్వి, " పక్క నేను తాళికట్టిన భార్య, మరోపక్క పిల్లలు పసివాళ్లూ, అనుభవ.శూన్యులూనూ. నా నిర్ణయాలలోని లోతుపాతులు వారికి ఎలా అర్థమవుతాయి? అందుకే వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచనా సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా నిర్ణయాలను మార్చుకున్నాను,' అని జవాబిచ్చాడు
అప్పుడు విష్ణువర్దనుడు మందహాసం చేసి, 'రామపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే, శూరసేనా! అనంతవర్మ సామంతుడైనంత మాత్రాన అతడు మనకు బానిస అని అర్ధం కాదు. మన సామాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒక భాగస్వామిగా ఉంటున్నాడు
చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉంది. వారు మనకు చెల్లిస్తున్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు, అన్నాడు శాంతంగా.
ప్రభూ! అన్నాడు శూరసేనుడు తెల్లబోయి
శూరసేనా! క్షణం అధికారమదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబంలోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ, భర్త్వకూ కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో పొందికంటూ కుదరడం లేదు
అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయపరమైన శాసనాల విషయంలో. ఏలికల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంలో వింత ఎమున్నది? మన శాసనాలపట్ల అనుమానాలు రేగాయంటే లోపం మనదే అవుతుంది. సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది
క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూశాడు విష్ణువర్దనుడు. “మనకు అధికారం ఉందికదా అని.. విమర్శించిన వారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యలలోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే
విష్ణువర్దనుడి నిశిత దృష్టికి, విశాల దృక్చధానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు శూరసేనుడు.
నా అజ్ఞానానికి మన్నించండి, మహా ప్రభూ! స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలనూ, శంకలనూ నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను, అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu