Chandamama Kathalu in Telugu for Kids

అపవాదు

Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
పూర్వం గొప్ప ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడూ, సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు.
ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరకు పిలిచి. "నాయనా నా అనంతరంమన వ్యాపారం చక్కగా సాగించునీవూ, చెల్లెలూ. సఖ్యతగా ఉండండిఇదే నా తుదికోరిక,” అని చెప్పాడు
తండ్రి పోయిన కొద్దికాలానికే సుబుద్ధి మూడు నౌకల మీద సరుకులు వేసుకుని దేశాంతరాలకు బయలుదేరాడు.
బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలితో, “చెల్లీ, నేను చాలాకాలానికి గాని ఇంటికి తిరిగిరానునేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు. పరులతో ఎన్నడూ ప్రసంగించవద్దు, అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువును తన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువును తన వెంట తీసుకుని నౌకలతో సముద్రంమీద బయలుదేరాడు.  
రెండేళ్లు గడిచాయి. మూడో ఏడు నడుస్తోంది.
సుబుద్ది నౌకలు ఒకానొక రేవు పట్టణం చేరుకున్నాయి. అక్కడ లంగరు దించి, తన వెంట ఒక గిన్నెలో రత్సాలూరత్తకంబళాలూ మొదలైన బహుమానాలు తీసుకుని సుబుద్ధి దేశపు రాజు సుదర్శనుడి వద్దకు వెళ్లాడు.
తాను తెచ్చిన బహుమతులు సుదరృనుడికి సమర్పించితమదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, అని సుబుద్ధి అడిగాడు.
సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు వణిజుడు కూడా తన కలాంటి అమూల్యమైన బహువుతులు ఇచ్చివుండలేదు.
అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేటందుకు అనుమతి ఇవ్వటమే కాక, అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడడానికి సపరివారంగా రేవుకు కూడా వచ్చాడు.
నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శన రాజు కన్ను సుమిత్ర చిత్తరువుపై పడింది.
ఎవ్వరీ సుందరవతి? అని సుదర్శన రాజు సుబుద్దిని అడిగాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu

'ప్రభూ, ఆమె నా చెల్లెలు'.
'అందానికి తగిన శీలం రూడా ఆమె కున్నదా?' అని అడిగాడు సుదర్శన రాజు.
'ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు,  అన్నాడు సుబుద్ధి'.
అయితే నేనామెను నా పట్టమహిషిగా చేసుకుంటాను, అన్నాడు సుదర్శనుడు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయ జనించింది.
చివరకు వైశ్యాంగన మాకు రాణి కావడమా? మా భార్యలు ఈమెకు సేవచేయడమా?” అనుకున్నాడు దుర్మార్లుడైన సేనాని. అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు.
ప్రభూ,  స్త్రీని నేను బాగా ఎరుగుదును. ఆమె దుళ్శీల.
ఈమాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది.
'దుళ్ళీలను శీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయించేసాను'అన్నాటు రాజు సుబుద్ధితో.
ప్రభూ, మీ సేనాని చెప్పేది అసత్యంచేతనైతే అతను మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెలిని  ఎరుగుదు నంటున్నాడు కాబట్టి, ఆమె వేలి ముది కను తీసుకురమ్మనండి, ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నదీ తెలుసుకు రమ్మనండి, అన్నాడు సుబుద్ధి.
సుదర్శనుడికి ఇది. న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో, “రెండు నెలలకాలంలో నీవు  స్త్రీ ఉంగరమూ, పుట్టుమచ్చ రహస్యమూ తెలుసుకొనలేకపోయినట్లయితే నీ తల తీయించేస్తాను. అని తెలియపరిచాడు.
సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాసి పెద్దమ్మ వద్దకు వెళ్లి తను వచ్చిన పని చెప్పి, పెద్దమ్మా, నాకా పిల్ల పుట్టుమచ్చ రహస్యమూ, ఉంగరమూ తెచ్చిపెడితివానీకు అంతులేని బంగారం ఇస్తానుఅని ఆశపెట్టాడు.
Chandamama Kathalu in Telugu,Chandamama Kathalu for kids,telugu Chandamama Kathalu,telugu Chandamama Kathalu for kids,Chandamama Kathalu for children in telugu,panchatantra stories for children in telugu,panchatantra stories in telugu for kids,balamitra stories in telugu,balamitra kathalu in telugu,balamitra kathalu in telugu for kids,kids balamitra kathalu
పేదరాశి పెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికి వెళ్తి ఆమెతో కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి, ఆమె వీపు మీద ఎడము వైపున పుట్టువుచ్చ ఉన్నట్లు తెలుసుని, ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికి ఇచ్చింది.
సేనాని వెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగివచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరమూ, పుట్టుమచ్చ రహస్యమూ తెలియజేశాడు.
సుమిత్రతపై చేసిన అపవాదును సేనాని రుజువు చేశాడు గనక సుదర్శనుడు కోపంతో సుబుద్దికి మరణదండన విధించాడు.
కాని సుబుద్ది ఒక్క కోరిక కోరాడు. “
నేనీ దూరదేశంలో మురణీంచే ముందు ఒక్కసారి నా చెల్లెలిని చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒక్క సారి కలుసుకోనివ్వండి. తరువాత నిశ్చింతగా వంరణదండన 'అనుభవిసాను.
దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలి కొక లేఖ రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపాడు.
తన అన్న చెప్పినట్లు నడుచుకోక పేదరాసి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకుని సుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే,. ఆమె తిన్నగా రాజువద్దకు వెళ్లి, “ప్రభూ, కర్ణాభరణం చూడండి. ఇది విలువయినదేనా?” అని అడిగింది.
సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్సాలను పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే. కాని దీనిని నాకెందుకు చూపుతున్నావు. అని ఆశ్చర్యంగా అడిగాడు.
'తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు'.
తాము ధర్మస్వరూపులు. ఇది నాకు తిరిగి ఇప్పించండి. అన్నది సుమిత్ర దీనంగా.
రాజు సేనానిని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణలను చెప్పి, “ఈమె కర్టాభరణం దొంగిలించావట. దానిని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయి, అన్నాడు. 
సేనాని నిర్ధాంతపోయి, “ప్రభూ, అసలీమె ఎవరో నేనెరగను. నా జన్మలో ఎన్నడూ నేనీమె ముఖవెైనా చూసి ఉండలేదు. నేనీమె కర్ణాభరణం దొంగిలించటమేమిటి? అన్నాడు.
వెంటనే సుమిత్ర రాజు సుదర్శనుడి వైపు తిరిగి, "ప్రభూ! నేను సుబుద్ది చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండక పోతే, మా అన్నకు తమరు మరణదండన ఎందుకు విధించారో సెలవివ్వండిఅని ప్రశ్నించింది.
తన సేనాని చేసిన మోసమూ, సుమిత్ర చేసిన యుక్తీ సుదర్శనుడికి అర్హమైపోయింది.
ఆయన తన సేనానికి మరణదండన విధించి, సుబుద్ధిని ఖైదు నుండి విడిపించి, సుమిత్రను పెళ్లాడి చాలాకాలం సుఖంగా రాజ్యం చేసాడు.