వ్యత్యాసం
చ౦ద్రాపీడుడు
కాంచన నగరపు రాజు. ఆయన
వద్ద ధవళముఖుడని ఒక సేవరుడుండేవాడు. ధవళముఖుడు
ఏ రోజు కూడా కొలువునుంచి
నేరుగా ఇంటికి వచ్చేవాడు కాడు.
ఎక్కడో ఒక చోట భోజనం
చేసి తాంబూలం వెసుకుని, బాగా పొద్దు పోయినతర్వాత
ఇల్లు చేరుకునేవాడు.
ధవళముఖుడి
భార్య ఒక రోజు తన
భర్తను “మీరు ప్రతిరోజూ ఎక్కడో
భోజనం చేసి వస్తారు కదా,
ఎవరు మీకు భోజనం పెడతారు?
ఎందుకు పెడతారు?” అని అదిగింది.
ధవళముఖుడు
భార్యతో, “నాకు ఇద్దరు మంచి
స్నేహితులున్నారు. అందులో ఒకడు కల్యాణవర్మ అనేవాడు.
అతను నాకు తన వద్ద
ఉన్నది ఏది కావాలన్నాఇస్తాడు. ఇక
రెండో వాడు వీరబాహు అనేవాడు.
అతను నాకు (ప్రాణస్నేహితుడంటే అవసరమైతే
నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు
వేస్తాడు'' అన్నాడు.
తన
భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని
విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది.
“నాకుమీ మిత్రులను ఒకసారి
చూపుతారా? అని భర్తనడిగింది.
“దానికేం
భాగ్యం? రేపు నా వెంటరా,
ఇద్దరి ఇళ్లకూ వెళ్తివద్దాం, అన్నాడు ధవళముఖుడు.
మర్నాడు
ఉదయం భార్యా భర్తలిద్దరూ కల్యాణవర్మ ఇంటికి వెళ్లారు. అతడు వారిని గొప్పగా
సత్కరించాడు. తన భర్త
చెప్పినదానిలో
అతిశయోక్తి లేదని ధవళ ముఖుడి
భార్య తెలుసుకున్నది.
తరవాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు. చదరంగం ఆడుతున్నవీరబాహు, ధవళముఖుడి కేసి ఒకసారి చూసి “ఏమోయ్, వచ్చావా? కూచో ' అని తిరిగి ఆటలో నిమగ్నుడ య్యాడు.
భార్యాభర్తలు కొంచెంసేపు కూచుని“వెల్తివస్తాం,' అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే, మంచిది' అన్నాడు.
ధవళముఖుడితో
భార్య, 'కల్యాణవర్మ కన్న వీరబాహు మికు
మంచి స్నేహితుడని చెప్పారుగదా, ఇతనికన్న అతనే మనల్ని ఎంతో
ఆదరంగా చూశాడే?' అన్నది.
“వారిద్దరి
మధ్యా గల వ్యత్యాసం చూడాలంటే,
రేపు నువు ఇద్దరిదగ్గరికీ వెళ్ళి,నామీద రాజుగారికి ఆగ్రహం
వచ్చిందని
చెప్పు,
అన్నాడు ధవళముఖుడు భార్యతో.
ఆమె
మర్నాడు ముందుగా కల్యాణవర్మఇంటికి వెల్లి అతనితో, “అయ్యా, నా భర్తపై రాజుగారు
అలిగారు. మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా? అని అడిగింది. కల్యాణవర్మహడలిపోయి అమ్మా! నేను
వర్తకం చేస్తుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను. నీ
భర్త దేశం వదిలి పారిపోవడం
మంచిది. అన్నాడు.
ధవళముఖుడి
భార్య వీరబాహు ఇంటికి వెళ్లి అతనితో కూడా
అదే మాట చెప్పింది. ఈ
మాట వింటూనే వీరబాహు డాలూ, కత్తీ పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో,
“మిత్రమా నీమీద రాజుకు కోపం
తెప్పించిన తుచ్చుడెవడో ' చెప్పు! వెంటనే ఆ పాపాత్ముడిని హతమార్చుతాను!”
అన్నాడు ఆవేశంతో.
ధవళముఖుడు
నవ్వుతూ, “కూచోవోయ్. మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముఖుణ్ణి
చేశారులే!' అన్నాడు. అతడు వెళ్ళిపోయాక, ధవళముఖుడు
భార్యతో,“చూసావు గదా, నా ఇద్దరు
మిత్రులలో గల వ్యత్యాసం!' అన్నాడు.
0 Comments