దొంగసొత్తు
సోమేశ్వరాన్ని
మాణిక్యవర్మ పరిపాలిస్తున్న రోజులవి. మంత్రి అఖండనాథుడి సలహా సంప్రదింపులతో పాలన
నల్లేరుపై బండి నడకలా సాగుతోంది.
ఒకనాడు రాత్రి, కాపలా కాస్తున్న సైనికుల
చేతికి గజదొంగ కామరాజు అనుకోకుండా చిక్కాడు. కామరాజు చాలాకాలం నుంచి సోమేశ్వరరాజ్యంలోని ప్రజల కంటిపై
కునుకు లేకుండా చేస్తున్నాడు. ధనవంతులైతే రాత్రిళ్లు మేల్కొని పగలు నిద్రపోవడం ప్రారంభించారు.
కామరాజుని
దండించి స్థావరం వివరాలు తెలుసుకుని, అక్కడి సంపదనంతా స్వాధీనం చేసుకున్నాడు సైనికాధికారి. మరుసటి రోజు సభలో కామరాజు
ప్రవేశ పెట్టబడ్డాడు. స్వాధీనం చేసుకున్న సొత్తులో అధిక భాగం నగరంలోని
ప్రముఖ ధనవంతుడు నీలకంఠుడిదే! అయితే నీలకంఠుడు
ఏ రోజు కూడా సొత్తు
పోయిందని ఫిర్యాదు చేసినవాడు కాదు.
“మంత్రివర్యా.. నీలకంఠుడు అభిమానవంతుడు కావడం చేత పోయిన తన సంపద గురించి మనకు తెలియపరిచి ఉండడు. తక్షణమే అతడిని పిలిపించి అప్పగించండి. మాణిక్యవర్మ అజ్ఞచేశాడు. “ప్రభూ... నీలకంఠుడి సొమ్ముపోగా మిగిలినది ఎవరెవరిదో నిర్ణయించుకునేందుకు కొంత వ్యవధి అవసరం. రెండు రోజుల తర్వాత సొమ్మంతటినీ హక్కుదారులకు అందిద్దాం. నీలకంఠుడిని కూడా అప్పుడే రప్పిద్దాం, అని చెప్పిన అఖండనాధుని మాటలకు రాజు సమ్మతించాడు. రెండు రోజుల తర్వాత సొమ్ముహక్కుదారులంతా సభకు రప్పించబడ్డారు. ఒక్కొక్కరే వచ్చి పోయిన తమ సొమ్ము వివరాలు, ఆధారాలు చెప్పి తీసుకు వెళ్ళసాగారు. నీలకంకఠుడి వంతు వచ్చింది. అయితే చాచేందుకు వీలు లేకుండా అతని చేతులకు సంకెళ్ళు వేయబడి ఉన్నాయి.

ఆ
దృశ్యం చూసి ఆశ్చర్యపోతున్న మాణిక్యవర్మకు
సందేహనివృత్తి చేస్తూ, “మహారాజా... నీలకంఠుడు కామరాజు కంటే పెద్ద గజదొంగ.
పలు అక్రమవ్యాపారాలతో, పన్నులు ఎగవేసి కోట్లాది వరహాలు పోగేశాడు. “దొంగసాత్తుకు లెక్క ఉండదు' అనే
సామెతను నిజం చేస్తూ, పోయిన
ధనంపై మనకు ఎలాంటి ఫిర్యాదు
చేయలేదు.
నీలకంఠుడి
బలహీనతను గమనించిన కామరాజు పలుమార్లు అతని ధనాన్నే దొంగిలించాడు.
నీలకంఠుడి నిష్క్రియ నాకు అనుమానం తెప్పించింది.
దీని కారణంగానే మిమ్మల్నిరెండ్రోజుల గడువు కోరి, ఈ
సమయంలో వివరాలన్నీ 'తెలుసుకున్నాను." వినమ్రంగా చెప్పాడు
అఖండనాథుడు. విషయం తెలుసుకున్న మాణిక్యవర్మ
అఖండ నాధుడిని అభినందించి నీలకంఠుడీకి కఠిన కారాగారశిక్ష, కామరాజుకు
సాధారణ కారాగారశిక్ష విధించాడు.
0 Comments