నిబద్దుడి ఎంపిక
పట్టువదలని విక్రమార్కుడు
చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగే మౌనంగా
శ్మశానం కేసి . అప్పుడు
శవంలోని బేతాళుడు “రాజా, నీ కోరికలు
నెరవేర్చుకోవడానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం. లేదా
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్ధపరులేనని,
తమ బాగు తాము చూసుకునేవారేనని
నీవు భావిస్తుండవచ్చు. దురాశాపరులనుంచి, తమ సమస్యలు తప్పితే
ఇంకేవీ పట్టించుకోని
అధిక సంఖ్యాక ప్రజలనుంచి నిజాయితీపరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరుచేసి గుర్తించడం చాలా
కష్టం. దురాశాపరులలో కూడా అటువంటి నిజాయితీపరులు
ఉంటారని నీవు తెలుసుకోవడానికి నడవసాగాడు నీకు
ఒక కథ చెబుతాను విను"
అంటూఇలా చెప్పసాగాడు.
పూర్వం,
కాశీరాజుకు ప్రపంచమంతటి నుంచి గౌరవ ప్రపత్తులు లభించేవి.
దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీ పాలకుడిగా ఉండేవాడు. ప్రతాప్సింహుడు
ధైర్యసాహసాలకి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ప్రజల శ్రేయస్సు, సంతోషంకోసం
అతడు శతవిధాలా పాటుపడేవాడు. కాశీ ప్రజలు కూడా తమ
రాజును ఎంతగానో గౌరవించేవారు. రాజ్యపరిపాలనలో సుద్వీర్ణకాలం గడిపిన తర్వాత రాజు కూడా అలసిపోయాడు.
ఈ విషయాన్ని అతడు ప్రధానామాత్యుడు చంద్రశేఖరశాస్త్రితో చర్చించాడు.
ప్రభూ! పాలనావ్యవహారాలతో మీరు విసిగిపోయారు. మీకు విశ్రాంతి కావాలి.
రాజుగా మీరు ఈ రాజ్యానికి
అత్యున్నత అధిపతిగా ఉన్నారు. కాని వీటితో పాటు
రాజ కోశాధికారిగా కూడా మీకు కొన్ని
విధులున్నాయి. రాజకోశాన్ని తగిన విధంగా నిర్వహించడానికి
ప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ, ఈ
అదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసి
ఉంటుంది. కానీ ఇతర బాధ్యతలను
మోస్తూ ఈ పనిచేయడం చాలా
కష్టం. అందుకే మీరు అలసిపోతున్నారు. అన్నాడు
మహామంత్రి.
'రాజనేవాడు తప్పకుండా రాజ్య పాలనా వ్యవహారాలలో
పాలుపంచుకోవాలి, కాని కోశాగారాన్ని నిర్వహించిన
బాధ్యతను అతడుఎందుకు మోయాలి? కాని మీరు చెప్పింది
మాత్రం నిజం. నేను అధికభారంతో
కుంగిపోయాను. నాపై ఈ ప్రత్యేక
బాధ్యతకు ఏది మూలకారణం?' అని ప్రశ్నించాడు రాజు.
దానికి మంత్రి
సమాధానమిస్తూ, వాస్తవానికి కాశీరాజు రాజ్య కోశాధికారి పదవిని
సాంప్రదాయికంగానే నిర్వహిస్తూ వచ్చారు. మీ తండ్రి రాజా
యుద్ధవీరసింహుడు ఈ సంప్రదాయాన్ని అమలులోకి
తెచ్చాడు. 'మంత్రివర్యా, మీరు నాకంటే అనుభవశాలురు,
పెద్దవారు కూడా. మీరు మా
తండ్రిగారిని కూడా సేవించారు. మీతో
ఆయన చాలా విషయాలు చర్చించుంటారు.
కాశీలో ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి తగిన కారణం ఎమిటో
దయచేసి నాకు బోధపర్చండి'. మహామంత్రి
మందహాసం చేస్తూ... 'రాజా, ఈ తప్పనిసరి
సంప్రదాయం వెనుక ఒక అవమానకరమైన
ఘటన దాగి ఉంది.
మీ
తండ్రి తన రాజ్యంలో ప్రజలు
ఎలా ఉంటున్నారో చూడటానికని తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్లేవారు. అదేసమయంలో
రాజ సేవకులు ఎలా పని చేస్తున్నారో
కూడా పరిశీలించేవారు. రాజు మారువేషంలో ఉండగా
అతడిని ఎ ఒక్కరు కూడా గుర్తించగలిగేవారు
కాదు. అవిధంగా మీ తండ్రి తన
రాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నింటిపట్లా అప్రమత్తంగామెలిగేవాడు.
'రాజు
మారువేషంలో వెళ్లేటప్పుడు నేను కూడా ఆయనను
అనుసరించేవాడిని. ఒక రాత్రివేళ రాజు
నగరాన్ని దాటి వెళ్లారు.
ఆ సమయంలో రాచ గిడ్డంగిలోకి ప్రవేశించాము.
ఆ సమయంలో కోశాగారం లోపల వెలుతురు ఉండటం
చూసి ఆశ్చర్యపోయాము. అక్కడ ఎవరో మాటలాడటం
కూడా విన్నాము. మేం నిశ్శబ్దంగా అక్కడికి
వెళ్ళి జరుగుతున్నది చూసి నిర్ధాంతకు గురైనాము.
రాజకోశాధికారి తన సహాయకుడి తోడ్పాటుతో
కోశాగారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అతడు సాక్ష్యాధారాలతో సహా
దొరికిపోయాడు. ఈ ఘటనలో కోశాధికారి
తప్పించుకుని పారిపోయాడు. కాని అతడి సహాయకుడు
మాత్రం పట్టుబడ్డాడు. రాజు వెనువెంటనే కోశాధికారిని
పట్టుకుని రేపటి దినం తన
ఆస్టానానికి తీసుకు రావలసిందని ఆదేశించాడు'.
ఆ మరుసటి దినం,
మీ తండ్రి యుద్ధ వీరసింహుడు తన ఆస్థానంలోని సహాయకులందరినీ
పిలిపించాడు. జరిగిన నేరం చర్చించారు. కోశాధికారి
తీవ్రతప్పిదం చేశాడని అందరూ అంగీకరించారు. కోశాధికారికి రాజు మరణ శిక్ష విధించాడు. అయితే, రాజు
దయార్ద హృదయుడు. నన్ను కూడా సలహా
అడిగాడు. దాంతో తప్పు చేసిన
కోశాధికారిని నగర ప్రజలందరి ముందు
అవమానించి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయంచాము.
అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తుండగా
జబ్బుపడ్డాడు. దాంతో అతడి కథ
ముగిసింది.
రాజు
మాత్రం అప్పటినుంచి చాలాజాగ్రత్తగా ఉండేవాడు. ఆనాటినుంచి కాశీ రాజే స్వయంగా
కోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు. అలా ఈ సంప్రదాయం
కొనసాగుతూ వచ్చింది. గత చరిత్ర విన్న
ప్రతాపసింహుడు నేను కూడా ఆ నిర్ణయాన్ని
ఆమోదిస్తాను. కాని ఈ అదనపు
పని భారం రాజ్యపాలనపై (ప్రభావం
చూపుతుంది, ఈ సమస్యకు శాశ్వతమైన
పరిష్కారం కావాలి. రాజు ఆదేశానికి విధేయత
చూపగల పరిష్కారం. ఇది రాజ్యపాలనను సులభతరం
చేయడమే కాకుండా, కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా' అన్నాడు.
"శాశ్వత
పరిష్కారమా? అయితే, అత్యంత నిజాయితీ కలిగిన వ్యకికి కోశాగార బాధ్యతను
అప్పగించండి. బయటి వ్యక్తికి బాధ్యతను
అప్పగించడం కంటే మన ఆస్థానంలోని
వారినుంచే ఎవరో ఒకరిని ఈ
పనికి మనం ఎంచుకుంటే బాగుంటుందని
తన అభిప్రాయాన్ని వ్యక్తం
చేశాడు మహామంత్రి".
మనం రేపు ఉదయాన్నే
ఆస్థానంలో ఈకొలువుకు తమ పేరు నమోదు
చేసుకోమంటూ పిలుపిద్దాము. వచ్చిన పత్రాలను అన్నింటినీ పరిశీలించి ముఖాముఖీ మాట్లాడిన తర్వాతే అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుందాము. దీనికోసం ఒక ఎంపిక మండలిని
ఏర్పరుద్దాము. రాజుగా మీరు ఆ మండలికి
నేతృత్వం వహించండి. నేనూ, సేనాధిపతి, రాజవైద్యుడు,
రాజగురువు ఈ మండలిలో ఉంటాము
అన్నాడు మంత్రి.
రాజు దీనికి అంగీకరించాడు.
కోశాధికారి పదవికోసం నమోదు చేసుకోవలసిందని రాజప్రకటన
వెలువడింది. ఆస్థానంలోఉన్న నూటొక్కమందిలో వందమంది తమ పేరు నమోదు
చేసుకున్నారు. రాజు తీవ్రంగా ఆలోచించాడు.
ఈ పదవి అంతముఖ్యమైంది కాబట్టి
దాదాపు అందరూ నమోదు చేసుకున్నారా?
తర్వాత అతడు ఎంపిక మండలిని
సమావేశపర్పాడు. ఈ పదవికి
పేరు నమోదు చేసుకోని ఎకైక
అభ్యర్థి పేరు విశాలగుప్తుడు. ఇతడు
ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడు. రాజ్య ఆర్థిక విధానాలపై
సలహా ఇస్తుంటాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన
ద్రవ్య వ్యవహారాలకు కూడా బాధ్యత వహిస్తుంటాడు.
సరైన
అర్హత, అనుభవం ఉన్న వ్యక్తి ఈ
పదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదని
ఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు.
ఆస్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులను
పిలిపించి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు.
ఆ
మరుసటి దినం, అభ్యర్థుల గుణగుణాల
పరిశీలన ప్రారంభమైంది. రాజాస్టానంలో రాజ సభికులు, సామాన్య
ప్రజలు కూడా ఉన్నారు. రాజు
తరపున ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నించసాగాడు. కోశాధికారి పదవికి పేరునమోదు చేసుకున్న అందరికీ ఒక ప్రశ్న. ఈ
పదవికి మీరే తగిన అభ్యర్థినని ఎందుకు భావిస్తున్నారు? ఈ పదవికి మీరు
ఎందుకు నమోదు చేసుకున్నారు?
రాజు
అడిగిన ప్రశ్నకు ఆ వందమంది అభ్యర్థులలో
ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోగా,
తానే తగిన అభ్యర్థినని రుజువు
చేసుకోలేకపోయారు. దాంతో ప్రధానమంత్రి రాజు
అనుమతితో, ఆ పదవికి పేరు
నమోదు చేయని వ్యక్తిని సంబోధిస్తూ
నీవు ఈ పదవికి పేరు
ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించాడు.
విశాలగుప్తుడు
తన ఆసనం నుంచి లేచి
వినయంగా ఇలా సమాధానమిచ్చాడు.“అయ్యా!
నేను ఇప్పుడు చేస్తున్న పనులు బాధ్యతలతో పూర్తిగా
సంతృప్తితో ఉన్నాను. ఆస్థాన ఉద్యోగిగా నేను రాజ్య (శ్రేయస్సు
కోరి ఆర్ధిక వ్యవహారాలపై నా అభిప్రాయాన్ని తరచుగా
వ్యక్తపరుస్తూ ఉన్నాను. అందుకే రాజ కోశాధికారి పదవికి
నేను పేరు నమోదు చేయలేదు.
ఈ పదవికి నేను తగిన వాడిని
కానని నాకు నేనుగా భావించడంతో
నా అభ్యర్థిత్వం అంతటితోనే ముగిసిపోయిందని నేను భావించాను.
తర్వాత
దేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు. “గౌరవనీయులైన
కాశీపురవాసులారా! కాశీ నగర రాజునైన
నేను రాజుగా నా విచక్షణాధికారాన్ని ఉపయోగించి, విశాలగుప్ప్తుడిని
కాశీ రాజ్య కోశాధికారిగా నియమిస్తున్నాను.
ఈ కొత్త పదవికి అనుగుణంగా
అతడి జీతభత్యాలు నిర్లయించాలని ఆదేశిస్తున్నాను. ఆస్థానంలో ఒక్క క్షణం చీము
కుడితే చిటుక్కుమనేంత నిశ్శబ్దం ఆవరించింది.
బేతాళుడు ఈ కథ చెప్పి,
విక్రమార్కుడితో, “ఓ రాజా, విశాలగుప్తుడిని
రాజ్య కోశాధికారి పదవికి ఎందుకు ఎన్నుకున్నట్లు? అతడు వాస్తవానికి ఆ
పదవికి పేరునమోదు చేసుకోలేదు. పైగా రాజాస్థానంలో యావన్మంది
ముందూ తన ప్రస్తుత బాధ్యతల
పట్ల తాను సంతోషంగా ఉంటున్నానని
ప్రకటించాడు కూడా. ఇప్పుడు ప్రశ్న
ఎదంటే ఆ పదవికి అర్హుడిని
కానని తనకు తానుగా ప్రకటించుకున్న
విశాలగుప్పుడినే ఆ పదవికి ఎందుకు
ఎంపిక చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం
తెలిసీ చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది,
అన్నాడు.దానికి విక్రమార్కుడు, 'అభ్యర్థులందరూ కోశాగారంలోని ధనాన్ని దుర్వినియోగపర్పాలనే పథకాన్ని తమ మనస్సులలో ఉంచుకునే
వచ్చారని రాజు అర్ధం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యే
అవకాశాన్ని ఏ మాత్రం కల్పించకూడదని రాజు భావించాడు'.
అందుకనే,
ఈ పదవికి పేరునమోదు చేసుకోని వారి పైనే రాజు
దృష్టి పెట్టాడు. ఆ తర్వాతే అతడు
తక్కువ వేతనం లభిస్తున్న ఆ
పదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో
తాను ఊహించినదే సరైనదని రాజు అభిప్రాయానికొచ్చాడు. ఆ తర్వాత
సభలో విశాలగుప్తుడి సమాధానం విన్న రాజు, అతడు
తన బాధ్యతలతో సంతుష్టి చెందాడని, నిజాయితీపరుడని, దురాశ లేనివాడని గ్రహించాడు.
ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థి
అని అప్పటికే తేలిపోయింది. ఈ పరిస్థితిలోనే రాజు
సరైన నిర్ణయం తీసుకోగలిగాడు. రాజుకీవిధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై
తిరిగీ చెట్టెక్కాడు.
0 Comments