Balamitra Kathalu in telugu-Moral Stories for Kis in telugu ప్రకృతి ధర్మం 
పూర్వం ధనపురి అనే గ్రామం ఉండేది. అది పాడిపంటలకు, సిరిసంపదలకు నిలయంగా విలసిల్లేది. ఊరికి సమీపంలో ఉన్న కొండలను, వనాలను ఊరి ప్రజలు దేవతగా కొలిచేవారు. ఊళ్ళో చెట్లను నాటి బిడ్డల్లా సాకేవారు. ధర్మపురి గ్రామస్తులకు ఒక నియమం ఉండేది. వంటకయినా, ఇంటి నిర్మాణానికి అయిన ఎండి మోడైన చెట్లనే ఉపయోగించాలి.,పచ్చని చెట్ల జోలికి పోరాదు. 
తరాలు మారే గ్రామంలో ఊరి వాళ్ళ బుద్దులు పెడదారి పట్టాయి. ప్రజలు ధనాశాపరులయ్యారు. సంపాదన కోసం కలప వ్యాపారం ప్రారంభించారు. అందువల్ల ఊరు చుట్టుపక్కల ఉన్న చెట్లు తగ్గిపోయాయి. కొండలమీద ఉన్న చెట్లు తగ్గిపోయాయి. పచ్చగా మిసమిసలాడే పరిసరాలు బోసిపోయాయి. 
అప్పటి నుండి ధనపురి వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.  ప్రాంతంలో వర్షాలు తగ్గిపోసాగాయి, పొలాలు  బీడుగా మారిపోయాయి. కరువు అంటే ఎలా ఉంటుందో ధనపురి వాసులకు తెలిసొచ్చింది. అమ్మి డబ్బు చేసుకోవటానికి చెట్లన్నీ అయిపోయాయి. చేసేదేమీ లేక ప్రజలు బతుకుదెరువు కోసం వలసపోయారు. కొన్నాళ్లకు ధనపురి మట్టి దిబ్బ అయింది. 
చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన ఊరు మీద మమకారంతో ఒక వ్యక్తి ధనపురి చూడడానికి వచ్చాడు. దారంతా పిచ్చి మొక్కలు, గుబురు పొదలతో నిండి ఉంది. అక్కడక్కడా కొత్తగా వెలసి పెరుగుతున్న చెట్లు కనిపించాయి.  ప్రాంతం అడవిని తలపించింది. వచ్చిన వ్యక్తి పరిసరాలను చూస్తూ ఆశ్చర్యపోసాగాడు. గ్రామం ఉండే ప్రాంతంలో అడుగు పెట్టేసరికి అతడికి ఊరి మధ్యలో ఒక పూరిపాక కనిపించింది. దగ్గరికి వెళ్లి చూసేసరికి అందులో ఒక సాధువు కనిపించాడు. 
మొదట బిత్తరపోయి తర్వాత తేరుకుని వ్యక్తి సాధువుకు నమస్కరించి "స్వామి నా పేరు వీరయ్య" గతంలో ధనపురి వాసిని. కరువచ్చిపడటంతో అందరితో పాటు నేను ఊరి వదిలి వెళ్లాను. ఇక్కడ నేను చూస్తున్నది చిత్రంగా ఉంది. నీటి చుక్క లేని చెరువులు నీటితో నిండుగా కనిపించాయి. చెట్టు చేను అంతరించిపోయిన ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతుంది ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. 
దానికి సాధువు మందహాసం చేశాడు. నాయనా! వికసించడం ప్రకృతి సహజ గుణం. స్వార్థపరుల వల్లే మీ ఊరికి కరువు వచ్చింది. మీరంతా ఎప్పుడైతే ప్రాంతం వదిలివెళ్ళారో ప్రకృతికి హాని జరగడం తగ్గింది. ప్రకృతి దానికి అదే వికసించింది ఇందులో వింతేమీ లేదు వీరయ్య అని సందేహాలను తీర్చాడు సాధువు. 
Balamitra Kathalu in Telugu,The Moral Stories in Telugu,chandamama kathalu in telugu,pancha tantra kathalu in telugu, telugu moral stories,telugu balamitra stories,balamitra stories in telugu
సాధువు మాటలు విన్న వీరయ్య మాటల్లోని సత్యాన్ని గుర్తించాడు. తను ఒకప్పుడు వ్యవసాయం చేసిన భూమిని చూశాడునవనవలాడే గడ్డి మొక్కలు అందులో పెరుగుతున్నాయి. సాధువు వద్దకు వచ్చి "ప్రకృతి కరుణించింది నేను నా కుటుంబాన్ని తీసుకొచ్చి వ్యవసాయం చేసుకుంటాను" అన్నాడు. సాధువు ఆనందించాడు
వీరయ్య తన భార్యా బిడ్డలను తీసుకుని ధనపురికి చేరుకున్నాడు. వ్యవసాయం చేసి చక్కని ఫలితం సాధించాడు. ప్రకృతి తోడవడంతో పంట ఇబ్బడిముబ్బడిగా పండింది. భార్య బిడ్డలు ఆనందంతో పొంగిపోయారు.  వార్త ఎక్కడెక్కడో బతుకుతున్న ధనపురి వాసులకు తెలిసింది. ఒక్కొక్క కుటుంబం ధనపురికి రాసాగింది. పర్యావరణానికి భంగం కలిగించకుండా జీవించడం అలవాటు చేసుకున్నారు. అచిర కాలంలోనే ధనపురి పూర్వ వైభవాన్ని పొంది ఆదర్శ గ్రామం అయింది. సాధువు చెప్పే మంచి మాటలు గ్రామ వాసులకు ఆదర్శాలయ్యాయి. 
వృక్షో రక్షతి రక్షితః  
వృక్షాలను మనం కాపాడితే తిరిగి అవి మనలని కాపాడతాయి.