Balamitra Kathalu in Telugu-The Moral Stories in Telugu వంకాయ రామలింగడు 
పిల్లలు మీరు తెనాలి రామలింగడి తెలివి గురించి ఎన్నో కథలు చదివి ఉంటారు కదా కానీ తన తెలివి వల్ల కాకుండా అదృష్టం తోనే సమస్య నుంచి బయట పడ్డాడు అది ఏంటో చూద్దామా! 
శ్రీకృష్ణదేవరాయలు ఏదో రాచకార్యం మీద ఉడిపి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ మందిరానికి వెళ్లారట. అక్కడి పూజారులు ఆరోజు భగవంతునికి నివేదించిన పదార్థాలను తినమని రాజుగారికి ఇచ్చారట. రాయలవారికి, అందులోని వంకాయ కూర విశేషంగా నచ్చిందట. కూర వండిన వంకాయల గురించి మెచ్చుకో గా వాటిని 'మట్టుగుల్ల' రకం అంటారని ఒక్క ఉడిపిలోనే పండిస్తారని పూజారులు చెప్పారు. 
వెంటనే రకం వంగనారు, విత్తనాలు తెప్పించమని సేనాధిపతిని ఆదేశించారు. హంపిలోని తన ఉద్యానవనంలో పక్కగా నారుని నాటి విత్తనాలను చల్లమన్నారట. ఆ వంగనారు రెండు నెలల తర్వాత పూత ఆరంభమై కాయలు కాయటం మొదలైంది. అప్పటినుంచి శ్రీకృష్ణదేవరాయలు తన రాజధాని హంపిలో ఉంటే ప్రతిరోజు భోజనంలో గుత్తి వంకాయ కూర ఉండవలసిందే! నవరత్నాలు బంగారం విచ్చలవిడిగా దానం చేసే రాజుగారు ఒక్క వంకాయ కూడా ఎవరికీ ఇచ్చేవారు కాదు. 
ఒక రోజు మన రామలింగడు ఏదో విషయం చర్చించడానికి ఉదయాన్నే రాజమందిరానికి వెళ్ళాడు. అప్పుడే రాజుగారు తోటలో నుంచి వస్తూ కొన్ని వంకాయల్ని వంటవాడికివ్వడం అతని కంటపడింది. సహజంగానే రామలింగడికి అనుమానం కలిగింది స్వయంగా రాజుగారే వంకాయలు కోసి తెచ్చి వంటవాడికి తెచ్చివ్వడమా? అదీగాక ఆ రకం వంకాయలని రామలింగ కవి ఎప్పుడూ చూసింది లేదు.  
చక్రవర్తి గారినీ ప్రభు ఇదేం విడ్డూరం! మీరే స్వయంగా వంకాయలు కోసి తెచ్చి ఇవ్వాలా! తోటమాలి తెచ్చేవాడు కదా అని అడిగాడు. " ఏం లేదు రామలింగ ఈరోజు కోద్దామనిపించింది... అంటూ వేరే విషయంలోకి మాటమార్చి హడావిడిగా అక్కడినుంచి వెళ్లిపోయారు రాజుగారు. 
Balamitra Kathalu in Telugu,The Moral Stories in Telugu,chandamama kathalu in telugu,pancha tantra kathalu in telugu, telugu moral stories,telugu balamitra stories,balamitra stories in teluguరామలింగడు మరునాడే తోటమాలి బజార్లో కనిపించినప్పుడు వివరాలు తెలుసుకున్నాడు. రామలింగడికి ఎలాగైనా వంకాయల కూర తినాలనిపించింది.  రోజు సాయంకాలం ఆ తోట పక్కనుంచి వెళుతూ తోటమాలి దూరంగా ఉండటం కనిపెట్టాడు.  మూల నుంచి కొన్ని వంకాయలు పోసి భుజం మీద కండువాలో కట్టి త్వరగా త్వరగా ఇంటికి చేరి వాటితో కూర వండమన్నాడు.  రాత్రి భార్య ,భర్తలు ఇద్దరికీ కూర రుచి భలే నచ్చేసింది. 
అది వేసవి కాలం కావడంతో ఆరేళ్ల వయసు ఉన్న రామలింగడి కొడుకు మిద్దె మీద మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి కూర తినే అవకాశం మళ్ళీ రాదు కాబట్టి వాడు కూడా తింటే బాగుండు అనిపించింది రామలింగడికి. ఎంత లేపినా వాడు లేవకపోయేసరికి చెంబుడు నీళ్లు వాడి మీద కుమ్మరించాడు. నిద్రమత్తులో ఉన్న పిల్లాడికి వంకాయ కూర తినిపించి బట్టలు మార్చి పడుకోబెట్టారు. 
Balamitra Kathalu in Telugu,The Moral Stories in Telugu,chandamama kathalu in telugu,pancha tantra kathalu in telugu, telugu moral stories,telugu balamitra stories,balamitra stories in teluguమర్నాడు ఉదయాన్నే వంగతోటకి వెళ్ళిన రాయలవారికి దొంగతనం జరిగిందని తెలిసిపోయింది. తనకేం తెలియదని లబోదిబో మన్నాడు తోటమాలి. తన తోటలోనే దొంగతనం జరిగినందుకు చివుక్కుమంది రాజుగారి మనస్సు.  విషయం తిమ్మరుసుకు చెప్పి దొంగలు కనిపెట్టగలవా అని అడిగాడు. మహామంత్రి తోటమాలిని పిలిపించి ఎన్నో ప్రశ్నలు వేయగా చాలా రోజుల క్రితం రామలింగ కవి బజార్లో కనిపించినప్పుడు వంకాయల గురించి ఆరా తీసిన విషయం చెప్పాడు. ఇటువంటి సాహసానికి పాల్పడింది రామలింగడడని మంత్రిగారికి అర్థమయింది కానీ అడిగితే అతను ఒప్పుకోడు. అందుకు ఒక ఉపాయం ఆలోచించి తన కొడుకుతో సహా రాజుగారి దర్శనానికి రమ్మని కబురంపాడు సిపాయితో.  
ఇద్దరు వచ్చాక పిల్లాడిని మాటల్లో పెట్టి ఒరేయ్ అబ్బాయి! నిన్న రాత్రి ఏం కూర తిన్నావో జ్ఞాపకం ఉందా అని అడిగాడు. వాడు తడుముకోకుండా వంకాయ కూర అన్నాడు. "నిజమా రామలింగా! అన్నారు" రాజుగారు. నాకేం తెలియదు ప్రభు వాడెప్పుడూ తిన్నాడో ఏమో. వేసవి కాబట్టి బజార్లో వంకాయ దొరకడం లేదు అన్నాడు రామలింగడు ధైర్యంతో. 
అబ్బాయి నీకు సరిగ్గా జ్ఞాపకం ఉందా? మళ్లీ అడిగాడు తిమ్మరుసు. జ్ఞాపకం లేకే నిన్న రాత్రి పెద్ద వర్షం పడింది కదా! నా బట్టలు తడిసి పోయాయి అప్పుడే తిన్నాను.  మాటలు విన్న మంత్రిరాజు గారు పిల్లాడికి ఏదో కల వచ్చి ఉంటుందని భావించి కొన్ని బంగారు కాసులు ఇచ్చి పంపించేశారు. తను ఎన్నో సార్లు తెలివితేటలతో సమస్య నుంచి బయట పడినా ఈసారి మట్టుకు అదృష్టమే రక్షించింది అని తెలుసుకున్నాడు రామలింగడు. అంతే కాదు ఇతరుల సొమ్మును ఆశించకూడదని గుణపాఠాన్ని కూడా నేర్చుకున్నాడు