బాలమిత్ర కథలు-రాజుకు జ్ఞానోదయం
అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుందేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ది. ఒకరోజు చంద్రసేన రాజు గారికి నిద్రలో కల వచ్చింది. ఆ కలలో ఒక అద్భుతమైన భవనం నేలమీద ఆనకుండా గాలిలో తేలుతున్నట్లు కనిపించింది. అంత అందమైన భవనం తన సొంతం చేసుకోదలచిన చంద్రసేనుడు తెల్లవారుతూనే 'ఆహా నిన్న రాత్రి కలలో వచ్చిన భవనము ఎంత అందంగా వుంది'. అది నిజమైతే నా జన్మ ధన్యమైనట్టే. ఇలాంటి అద్భుతాలు కలలోనే జరుగుతాయి కాబోలు ఆ కలనే ఎలాగైనా నిజం చేసుకోవాలని అని ఎవరైనా అలా గాలిలో తేలే భవనం నిర్మిస్తే వారికి తన అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యం అంతట చాటింపు వేయించాడు.
“తాతగారు ఎవరు మీరు ఎక్కడ నుండి వచ్చారు. నా నుండి ఏ సహాయం కోరుతున్నారు” అని అడిగాడు రాజుగారు.
“మహారాజా నా పేరు శివయ్య సుబ్బరాయుడు సత్రం నివాసిని. నాకు మీరు న్యాయం చేయమని వేడుకునేందుకు వచ్చాను” అన్నాడు ఆ వృద్ధుడు.
ఎవరు మీకు అన్యాయం చేసినవాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎంతటి వాళ్ళయినా నేను శిక్షిస్తాను” అన్నాడు రాజుగారు.
“మహాప్రభో నాకు అన్యాయం చేసిందితమరే. నిన్న రాత్రి మా ఇంట్లో చొరబడి నా సొత్తు అంతా మీ భటులతో దోచుకెళ్ళారు అన్నాడు వృద్ధుడు.
నీకేమైనా పిచ్చి పట్టిందా. అసలు మతివుండే మాట్లాడుతున్నావా! ఎదురుగా ఎవరు ఉన్నారో తెలుస్తుందిగా! నేనే పది మందికి. దానాలు, చేసేవాడను, దేశానికి రాజును నేను దోచుకోవడం ఏమిటి” అన్నాడు రాజుగారు.
“అవును ప్రభూ. మీరు నా కలలో కనిపించి నా ఇంటి సొత్తు మొత్తం దోచుకెళ్ళారు” అన్నాడు వృద్ధుడు
“కలలు నిజమౌతాయా అమాయకుడిలా ఉన్నావు యిలా ఎక్కడైనా విన్నామా చూసామా నేను తలచుకుంటే నీకు ఏ శిక్షనైనా విధించగలను. పోనీలే వృద్ధుడని వూరుకున్నాను. కానీ నీ ప్రవర్తన మితిమీరి పోతుంది. ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకొని నీ ప్రవర్తన మార్చుకుని నన్ను క్షమాపణలు అడుగు. వృద్ధడవన్న జాలితో క్షమాభిక్ష పెడతాను అన్నాడు” రాజుగారు.
“కలలు. నిజం అవుతాయనే కదా పునాదులు లేకుండా గాల్లో తేలే ఇల్లు నిర్మించే తలంపు మీకు వచ్చినప్పుడు నా కల ఎందుకు నిజం కాదూ” అన్నాడు వృద్దుడు.
విషయం అర్ధమైన రాజుగారికి “కలలు కలలే' అని జ్ఞానోదయం కలిగింది.
“నువ్వు చెప్పింది నిజమేతాత. కలలు నిజం కావు అని నాకు నీ ద్వారా తెలిసి వచ్చింది” అన్నాడు రాజుగారు.
“తమరికి ఈ విషయం అనుభవ పూర్వకంగా తెలియ జేయడానికే ఈ వేషం” అంటూ తన మారువేషాన్ని తీసివేసాడు మంత్రి సుబుద్ధి.
0 Comments