అక్బరు బీర్బల్ కథలు - కడివెడు తెలివి
ఒకసారి అక్సర్‌కు ఎందుకో బీర్బల్ మీద బాగా కోవం వచ్చి అతణ్జి తక్షణమే ఆగ్రా నుంచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. బీర్బల్ మారు మాట్లాడకుండా సామాన్లన్నీ సర్దుకుని దూర ప్రాంతంలో వున్న ఒక మారుమూల పల్లెకు చేరుకున్నాడు. అతడు ఏ వూరికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. కొన్ని వారాలు గడిచాక అక్బర్‌కు ఒక దేశం రాజు నుంచి ఒక వింత అభ్యర్థన వచ్చింది. “దయచేసి ఒక కడివెడు తెలివి వెంటనే పంపించండి” అని.
చక్రవర్తికి ఆ రాజు ఏం కోరుతున్నాడో అర్ధం కాక తికమక పడ్డాడు. చింతాక్రాంతుడు కూడా అయ్యాడు. అన్నీ వున్న మొఘల్ చక్రవర్తి తాను. కానీ 'కడి వెడు తెలివి' అంటే ఏమిటి? ఒకవేళ తాను అదిపంపిచకపోతే రాజుల దృష్టిలో చులకనైపోతాడు.
అక్చర్ ఒక ఉపాయం ఆలోచించి ఒకో వ్యక్తికి
ఒకో మేకను, ఒకో సందేశాన్ని యిచ్చి అన్ని గ్రామ పెద్దలకు పంపించాడు. “ఈ మేకను ఒక నెల రోజులు వుంచుకోండి. దాని పోషణ ఖర్చులు నేను యిస్తాను. సరిగ్గా ఒక నెల తర్వాత ఆ మేకను వెనక్కి పంపండి. అయితే ఈ నెల రోజులలో అది ఏ మాత్రం బరువు పెరగకూడదు, తగ్గకూడదు. లేకుంటే మీకు కఠిన శిక్ష పడుతుంది" అనేది ఆ సందేశం.
ఆ సందేశం అందులోని అన్ని గ్రామాల పెద్దలు ఆశ్చర్యపోవటమే. గాక విచారగ్రస్థులయ్యారు. ఆ సందేశం తాను నివాసం వుంటున్న వారి పెద్దకు కూడా రావటంతో బీర్చల్, “అసాధ్యమేం కాదు: ప్రత్తిర్లోజూ సరిగ్గా ఒకే పరిమాణంలోనే మేత వేయండి. దాన్ని బాగా పోషించండి. ఆ తర్వాత దాన్ని ఒక బోనులో వుంచిన పులి ఎదురుగా కట్టెయ్యండి. నిరంతరం ప్రాణ భయంతో అది లావెక్కదు” అన్నాడు బీర్బల్.
అక్బర్ కు వెంటనే అర్థమైంది. బీర్బల్ సలహా వల్లనే ఆ గ్రామ పెద్ద అలా చేయగలిగాడని. వెంటనే ఆ గ్రామానికి మనుషులను పంపించాడు. ఆ తర్వాత పొరుగు దేశం రాజు కోరిన కోరిక గురించి చెప్పాడు.
“ఓస్ అదెంత పని! నాకు కొద్ది వారాల సమయం యివ్వండి” అన్నాడు బీర్బల్.
ఇంటికి వచ్చి తమ తోట మాలిని పిలిచి ఒక గుమ్మడి గింజ తెచ్చివ్వమన్నాడు బీర్బల్. దాన్ని నాటి, ప్రతి దినం సక్రమంగా నీరు పెట్టాడు. త్వరలోనే ఆ గింజ మొలకెత్తి, కొన్నాళ్ళు తర్వాత ఆ మొక్క పూలు పూసింది. క్రమక్రమంగా ఆ గింజలు, లేత గుమ్మడి కాయలయ్యాయి. ఒక పిందెను ఒక మట్టి కుండలోకి పంపి దాన్ని అలాగే కొద్దిరోజులుంచాడు.
అలా అలా ఆ పిందె బాగా పెరిగి ఆ కుండ నిండా అయింది. అప్పుడు బీర్బల్ చెట్టు నుంచి దాని కాడను తెంపేసాడు. తర్వాత ఆ కుండ మూతి చుట్టూ ఒక గుడ్డ చుట్టి అక్బర్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
“అయ్యా, ఇదిగోండి కడివేడు తెలివి. దీన్ని ఆ రాజుగారికి ఒక చిన్న సందేశంతో పంపండి “మీరు కోరిన కడివెడు తెలివి స్వీకరించండి. దయచేసి దాన్ని తీసుకుని ఖాళీ కడవ మాకు పంపించండి. కాని మీరు కుండెను గానీ, గుమ్మడి కాయను గానీ పగుల గొట్టొద్దు” అని అన్నాడు బీర్బల్.
0 Comments