బాలమిత్ర కథలు-లవణాసురుడు
శ్రీరాముడు అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్న రోజులలో లవణాసురుడనే రాక్షసుడు అడవులలో దుర్భేద్యమైన కోట కట్టుకొని నివశిస్తూందేవాడు.
వాడు అరణ్యములలోని మృగములను వేటాడి చంపి తినటము, గాగుకుండా అక్కడి మునులను, జనులను బాదిస్తూ వారిని చంపి తినటము సాగించాడు. లవణాసురుని బాధల నుండి తమని రక్షించమని వేడుకోవడానికి ఆగస్యన్ మహాముని నాయకత్వంతో అడవులలోని మనుషులంతా అయోధ్యా నగరానికి వచ్చారు.
శ్రీరాముడు వచ్చిన మునులను. ఆహ్వానించి అర్హక పాద్యాదులు. ఇచ్చి సుఖాసనులను చేసి “మహర్షులారా! స్వాగతం. సుస్వాగతం. మీ దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమయింది. అందరూ క్షేమమే గదా! మీ తపస్ఫాధనలు, యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతున్నవి కదా! అంటూ కుశల ప్రశ్నలు వేశాడు.
మునులు “రామభద్రా! తమ దయవలన రాజ్య
మంతటా ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు. కాని అడవులలో ఉన్న మాకే ఇబ్బందులు వచ్చాయి” అన్నారు. “ధర్మరక్షణ ప్రజాక్షేమమే ధ్యేయంగా రాజ్య మేలుతున్న నా రక్షణలో ప్రజలకు ఇబ్బందులా! మీకు వచ్చిన ఆపదే ఏమిటి చెప్పండి. తక్షణమే తీరుస్తాను” అన్నాడు రాముడు.
చవన మహర్షి. పైకి లేచి “రామచంద్రా అరణ్యంలో లోకభకరుదైన లవణాసురుడనే రాక్షసుడొకడున్నాడు. వాడు యధేచ్ళగా అడవిలోని పెను మృగాలను చేతులతోనే చంపేస్తూ జంతువులను. భక్షించటమేగాకుండా ముని వాటన్‌లపై దండెత్తి, అందినంత మంది మునులను, అడవిలోని ప్రజలను భక్షించి వేస్తున్నాడు. అతని ధాటికి అడవిలోని జంతుజలాలు అంతరించి త్వరలోనే అడవి జీవ శున్యమైపోతుంది. మేము కూడా అరణ్యాలు వదిలివేసి ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయి మరో సురక్షత ప్రాంత చూసుకోవాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకు బ్రతుకుతున్నాము” అన్నాడు.
రాముడు “ఇంతకి ఎవరా లవణాసురుడు! వాడి బలం ఏపాటిది. ఇంతటి బలం వాడికెలా వచ్చింది!” అన్నాడు.
చవన మహర్షి “రామచంద్రా! ఆ లవణాసురుడు బ్రహ్మవరప్రసాది. ఇంద్రాది దేవతలను ఓడించాడు. అతని వద్ద శివప్రసాదితమైన “శూలాయుధం” ఉంది. ఆ శూలం ధరించి వచ్చిన అతనిని ఎదిరించిన వారు బ్రహ్మాది దేవతలైన ఎదిర్చిపోరాడలేరు. శూల మహిమవలన పరాజతులు కాకతప్పదు. ఆ శూల మహిమ వలన బలగ్వరితుడై ఉన్నాడు. అతని బాధల నుండు మహర్షులను రక్షించు" అన్నాడు ముక్త కంఠంగా.
“అలాగే! త్వరలోనే అతన్ని అంతమొందిస్తాము” మీరు నిశ్చింతగా వెళ్లిరండి” అని వాళ్లకు వీడ్కోలు చెప్పాడు.
శ్రీరాముడు లక్ష్మణ భరత శతృఘ్నలను చూసి
“విన్నారుగదా! అవణాసురుని సమాచారం. ఆ
లవణాసురిని వధించి మునులకు అడవిలోని జనులకు శాంతిని చేకూర్చటం మన తక్షణ కర్తవ్యం”
అన్నాడు. శతృఘ్నుడు “అ'ప్రజా! నేను వెళ్లి ఆ లవణాసురుని వధించి వస్తాను. నాకు ఆజ్ఞ ఇవ్వండి” అన్నాడు. శ్రీరాముడు తమ్మున్నీ ఆశీర్వదించి “తమ్ముడూ! శంకర ప్రసావితమైన శూలాయుధం అతని వద్ద ఉంది. అది ధరించినవాడు యుద్దానికి వస్తే వాడిని ఎదిరించటం ఎవరికీ సాధ్యం కాదు. ఉపాయంగా అతన్ని ఎదిరించి అతనిని వధించు” అంటూ తన అంబుల పోదిలోని ఒక దివ్యాస్త్య్రం తీసి ఇచ్చి “దీనితో అతన్ని వధించు” అంటూ ఒక అస్తాన్ని ఇచ్చి “విజయీభవ!” అంటూ ఆశీర్వదించాడు.
శతృఘ్నడు కొలది సైన్యంతో లవణాసురుడుంటే ఆరణ్యానికి వచ్చి సైన్యాన్ని దూరంగా వుంచి ధనుర్భాణాలతో తాను ఒక్కడే కాలినడకన లవణాసురుని కోట వద్దకు వచ్చాడు.
ఆ సమయంలో లవణాసురుడు ఆహారసేకరణ కొరకు అడవిలోకి వెళ్లి అడవి దున్నలను, సింహాలను చంపి వాటిని భుజంపైకి వేసుకొని కోటకు వచ్చాడు. కోటలోకి వెళ్లబోతున్న లవణాసురుని అడ్డుకొని ఎదురుగా నిల్చి “దానవా! నన్ను దాటుకొని కోటలోకి వెళ్లటం అసాధ్యం. నన్ను జయించి. కోటలోకి వెళ్లు” అన్నాడు శతృఘ్నుడు. లవణాసరుడు “ఓరి మానవా! లవపుత్రుడా! నీకు ఎంత ధైర్యం? సరాసరి నా కోటకే వచ్చి నన్ను యుద్దానికి పిలుస్తున్నావా!” ఇంక తిరిగి పోలేవు. నీ పెద్దలను తలుచుకో” అన్నాడు. చంపిన జంతువులను కింద పడవేసి యుద్దానికి సిద్దమవుతూ.
శతృఘ్నుడు “రాక్షసాధకా! అయోధ్యా నగరాన్ని ఏలుతున్న శ్రీరామచంద్రుని సోదరులను శ్రీరాముని ఆజ్ఞతో నిన్ను చంపాలనే ఇటు వచ్చాను” అన్నాడు విల్లుసారిస్తూ. లవణుడు “ఓహో! ఆ అల్పుడైన రావణాసురుని వధించిన ఆ రాముని తమ్ముడివా! రావణుని చంపినప్పుడే మీ అన్నను చంపాలను కున్నాను. అప్పుడే గదా అని అప్పుడు పేక్షించాను. సరే, ఇప్పుడు తప్పదు. ముందు నిన్ను వధించి తరువాత అయోధ్యపై దండెత్తికెళ్లి ఆ రాముని, మిగిలిన నీ సోదరులను వధిస్తాను కాచుకో” అంటూ చుట్టు ప్రక్కల నున్న వృక్షాలను వేళ్లతో సహా పెల్లగించి శతృఘ్నపై విసిఠాడు. అది అమాంతం పైన పడడంతో శతృఘ్నుడు తూలి క్రిందపడి మూర్చపడి పోయాడు. చలనం లేకపోవడంతో “చచ్చిపోయాడు” అనుకుంటూ తాను కిందపడవేసిన జంతువును భూమిపైకి ఎత్తుకొని లోనికి ప్రవేశించ పోయాడు.
శతృఘ్నుడు తెప్పరిల్లి పైకి లేచి, “నిలు! నిలుదానవా! నీవు లోనికి పోలేవు అంటూ దివ్యాస్త్రాన్ని సందించి ఆ రాక్షసునిపైకి ప్రయోగించాడు. అది భూభోనంబోంతరాణాలు ధ్వని చేస్తూ, పర్వతంలాగ వున్న ఆ రాక్షసుని వక్ష స్థలాన్ని తాకి చీల్చివేసి పాతాళంలోకి పోయి.తల శివత్రి శతృఘ్నుని వద్దకు చేరింది. రక్తధారలు ప్రవహిస్తూ; పర్వతంలా నేల కూలిపోయాడు రాక్షసుడు. రాక్షసుని హారణతో అతని ఇంటినున్న ఈశ్వర ప్రసాలిత దివ్యాస్తం వెలుగులో బయటకు వచ్చి కైలాసం చేరింది.
0 Comments