బంద్
రాజు! ఈ రోజు మన వూరిలో
బంద్ చేయమని నాయకుడు చెప్పాడు” అని శ్రీనివాస్ చెప్పడంతో,
రాజు, “బంద్ ఎందుకు చేయమన్నారు”
అని అడిగాడు.
“ఆ సంగతి మనకెందుకు.
సాయంత్రానికి మన నాయకుడు మనకి
డబ్బు ఇస్తాడు” అని చెప్పి రాజు
కొందిరి మిత్రులతో బయట తిరుగుతూ తెరిచి
వున్న దుకాణాలను బలవంత౦గా మూయించసాగాడు. ఆ సమయంలో ఒక
వ్యక్తి స్కూటర్పై అటూ రాసాగాడు.
అది గమనించిన రాజు స్నేహితులతో కలసి,
ఆ వ్యక్తిని ఆపి, “ఈ రోజు
బంద్ వెనక్కి తిరిగి వెళ్ళండి” అన్నాడు.
ఆ వ్యక్తి తాను
అవసరంగా వెళ్ళాలని వారిని ఎంతో
బ్రతిమాలినా, వాళ్ళు వినలేదు. రాజు కోపంతో ఆ
స్కూటర్ టైర్లకున్న గాలిని తీసి, “మంచిగా చెబితో విననంటున్నావ్. ఇవుడు స్మూటర్ని
తోసుకుంటూ ఇంటికి వెళ్ళు” అనడంతో, ఆ వ్యక్తి బాదతో
వెళ్ళాడు.
మధ్యాహ్నమైంది. అందరు భోజనాలకని ఇళ్ళకు
వెళ్ళుచున్నారు. రాజు తాను గొప్ప
పని చేసినవాడిలా సంతోషంగా గెంతుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట కంగారుగా
వున్న చెల్లి, “అన్నయ్యా! అమ్మకి జ్వరం ఎక్కువగా వుంది.
హాస్పిటల్కు వెళ్ళాలంటే బంద్
వలన ఏ వాహనం లేదు.
నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఆలస్యమైతే
కష్టం” అనడంతో, రాజా అలాగే వెనక్కి
తిరిగి పరిగెత్తాడు.
రాజూ వూరంతా తిరిగాడు.
డాక్టర్లు వున్నారు, కాని బంద్ వలన
బయటకి రావడానికి భయపడ్డారు. ఆఖరికి చిన్న ఇంటి ముందు
డాక్టర్ ప్రకాష్ అన్న బోర్డు కనిపించడంతో,
ఆయన తప్పకతన ఇంటికి వస్తాడన్న ఆశతో ఆ ఇంటి
తలుపులు తట్టాడు. ఒక ముసలాడు తలుపు
తెరిచి, రాజా ద్వారా సంగతి
తెలుసుకుని, “భయపడకు, మా వాడు చాలా
మంచివాడు. అర్ధరాత్రి అయిన రోగి ఇంటికి
వెళతాడు. వుండు పిలుస్తాను” అంటూ
లోపలికి వెళ్ళాడు.
లోపల నుండి డాక్టర్ బయటికి వచ్చారు. ఆయన్ని చూడడంతో రాజు నిర్జాంతపోయాడు. ఆయన
ఎవరో కాదు ఉదయం స్కూటర్
మీద వస్తుంటే, తాను అడ్డుపడి టైరు
గాలి పీకి పంపిన వ్యక్తి.
“ఆయన ఎందుకు తనకి సహాయం చేస్తాడు”
అని బాదపడతూ రాజు వెనుతిరిగాడు. అంతలో డాక్టర్, రాజుని పిలిచి విషయం అడగడంతో రాజు
ఏడుస్తూ ఆయన కాళ్లపైపడి తల్లి
సంగతి చెప్పాడు.
వెంటనే డాక్టర్ తన మందుల పెట్టె
తీసుకుని కాలి నడక మీద
రాజు ఇంటికి వచ్చి, అతని తల్లిని పరీక్షించి,
తగిన మందులు ఇచ్చాడు. కొంతసేపటికి ఆమెకు జ్వరం తగ్గింది.
రాజు, డాక్టర్ చేతులు పట్టుకుని, “నన్ను క్షమించండి. ఉదయం
మిమ్మల్ని అంత అల్లరి చేసినా
మనసులో పెట్టుకోకుండా మా అమ్మకు వైద్యం
చేసారు. నిజంగా మీరు దేవుడు” అన్నాడు.
డాక్టర్ అతని భుజంపై తట్టుతూ,
“బంద్ అన్నది ఎందుకు చేయాలి. ఆ నాయకులు వారి
స్వార్థం కొరకు మీలాంటి వారితో
ఇలా చేపిస్తుంటారు. కాని దాని వలన
ఎందరు నష్టపోతారో అన్నది ఎవ్వరు ఆలోచించరు, ఈ రోజు నీకు
వచ్చిన కష్టం ఇంకా ఎందరికి
వచ్చిందో, మరి వారి పరిస్థితి
ఆలోచించావా. ఇకపై ఎవరి మాటలు
విని ఇలా బంద్లు
చేయకు. చక్కగా చదువుకో. నలుగురికి ఉపయోగవడు. నువ్వే కాదు నీ స్నేహితులు
మారాలి. అపుడు మన దేశం
బాగా అభివృద్ధి చెందుతుంది” అని వెళ్ళిపోయాడు.
0 Comments