తొమ్మిది నుండి తొంబై
భళ్లున
తెల్లవారింది. బెడ్ మీద కామేశ్వరం
కళ్లు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన
విషయం ఏం చేసాడో తెలుసుకోవాలన్న
ఆతృతతో టేబుల్ మీద ఉండే సెల్ కోసం వెతికాడు. అది కనబడలేదు. పొరపాటున హ్యాండ్ బ్యాగులో గాని పెట్టేసానేమో అని
బ్యాగు తెరిచి చూసాడు. కనబడలేదు. ఆశ్చర్యం కలిగి చిన్న చిన్న
శబ్దంతో ఒకటీ ఒకటీ వెదకడం
మొదలుపెట్టాడు.
ఆ శబ్దాలకి కావేరి
నిద్ర విరిగి కళ్లు, విప్పి,“ఏంటండీ అలా వెతుకుతున్నారూ?” బద్దకంగా
అంది.
“ఏమౌంతుంది. ఏమిటి? రాత్రి సెల్ ఈ టేబుల్ మీద
పెట్టింది బాగా గుర్తు. ఇప్పుడు
చూస్తే కనబడడం లేదు. ఈ ఇంట్లో
ఏ సామాను ఎక్కడ పెట్టింది అక్కడ
ఉండి చావదు కదా! నేను
ఎప్పుడూ చెపుతుంటాను సీరియల్సు చూడడానికి వచ్చేపోయే పిల్లలు మీద ఓ కన్ను వేసి ఉంచు అని. పట్టించుకుంటేగా!” ఆవేశంగా
అన్నాడు.
కావేరికి ఒళ్లు మండింది. “బాగుంది
వరస. ఎక్కడ. ఏదీ కనబడకపోయినా బాగా
నా మీద విరుచుకుపడడం మీకు
అలవాటైపోయింది. బాగా వెతకండి. ఎన్నిసార్లు
నా మీద విరుచుకుపడిన సామానులు
మీకు దొరికి సారీ చెప్పారో ఒక్కసారి
గుర్తుకు తెచ్చుకోండి!” తిరిగి ముసుగు తన్ని పడుకుంది. అప్పుడే
మడి బట్టలుతో చేరిన బామ్మ కామేశ్వరంతో
“ఒరేయ్ కామూ” కోవెలలో ఆచార్యులుగారుంటారు.
ఒక్కసారి ఈ నెంబరుకి ఫోను
చేసి మా బామ్మ సీరియల్
చూసి వస్తుంది. అంతవరకూ అభిషేకాలు కొంచెం ఆపమను” అని చిన్న కాగితం
మీద ఉన్న నెంబరు అందించింది.
కామేశ్వరం ఒక్కసారి ఉలిక్కిపడి “కాలం ఎంత మారిపోయింది
అనుకొని” ఒసేయ్... బామ్మ సెల్ కనబడక
లేచింది మొదలు వెతుకుతున్నాను. నువ్వు
గాని చూసావా?” ఆతృతగా అడిగాడు. బామ్మ ఒక్కసారి ఖంగుతిని
“అదేవిటిరా అలా వుంటావూ రాత్రి
నేను నీ సెల్లుతో కామాక్షమ్మతో
ఓ పది నిముషాలు మాట్లాడుతున్నప్పుడు
ఠక్కున ఆగిపోయింది. బ్యేలన్సు నొక్కి చూస్తే జీరో అని వస్తే
ఇక్కడే పెట్టేసాను. ఇంతలో ఎలా. మాయమయ్యింది”
బామ్మా కూడా ఆశ్చర్యపోయింది.
అప్పుడే
అక్కడకు చేరిన పేపర్ బాయ్
అంతా విని తన సెల్లు
తీసి “సార్... దీనితో మీ సెల్లు నెంబరుకి
ఫోను చెయ్యండి. రింగవుతే ఏ మూల ఉందో
తెలినిపోతుంది” అని సెల్లు చేతికి
అందించాడు.
కామేశ్వరం “గుడ్ ఐడియా!” ఆ
అబ్బాయిని మెచ్చుకొని తన సెల్లు నెంబరుకి
రింగు చేసి ఆతృతగా సెల్లు
చెవి దగ్గరపెట్టాడు. శబ్దం చక్కగా వినబడింది.
నిదానించగా అది బాత్రూంలో
నుండి వస్తున్నట్లు గ్రహించి వెళ్లి తలుపు తోసాడు. గడియ
పెట్టి ఉంది. “అరేయ్..... చంటీ” అన్నాడు కోపంగా.
గడియ ఠక్కున విడింది. దాడి చేతిలో సెల్లు
చూని “ఇక్కడేం చేస్తున్నావు? నీ చేతిలో సెల్లు
ఏమిటి?” అన్నాడు.
చంటీ ఒక్కసారి. బితుకు
బితుకుమంటూ “కోప్పడకండి డాడి. నిన్న స్కూలుకి
వెళ్లలేదుకదా! హోం వర్కు ఏం
ఇచ్చారో తెలీదు: కావ్యని అడిగి తెలుసుకొని చేయాలని
సెల్లు తీసుకొచ్చాను. టీచరు హోంవర్కు చేయలేదంటే
చంపేస్తుంది” అన్నాడు, కామేశ్వరం ఒక్కసారి “అంతా కాల మహిమ...
ఈ రోజుల్లో తొమ్మిది సం॥ల
పిల్లల నుండి తొంబై సం॥ల వారికి నహితం ఎంతో అవనరమైపోయింది”
అనుకున్నాడు.
0 Comments