నిజమైన సంతోషం
ఎణ్ణర్థం క్రితం పప్పూ తండ్రి కుటుంబ అవసరాల కోసం నగరంలోని ఒక వడ్డి వ్యాపారి నుండి ఇరవై వేల రూపాయల రుణం తీసుకున్నాడు. ఆ వడ్డివ్యాపారి కలప వ్యాపారం చేస్తూ ప్రజలకు రుణ రూపంలో డబ్బులు ఇచ్చేవాడు.
ఎవరైనా గడువు ముగిసేలోగా బకాయిని చెల్లించకపోతే, “చూడు.. మీ పొలంలో, చందనం చెట్లు ఉన్నాయి. నీవు తెలివైనవాడివే కదా. నేను చెప్పిన దాన్ని ఇప్పటికే గ్రహించి ఉంటావు. ఇప్పుడు చెప్పు, వాటికి నేనెంత చెల్లించాలి ఆవిధంగా నీ రుణభారం కూడా తీర్చుకోవచ్చనుకుంటాను..' అని బేరం పెట్టేవాడు.
పప్పూ తండ్రి తీసుకున్న రుణం కూడా ఇలాగే కొండెక్కసాగింది. పెరిగి పెరిగి అది ఇప్పటికి ఇరవై అయిదు వేల రూపాయలకు చేరుకుంది. తీసుకున్న రుణం చెల్లించవలసిందిగా వడ్డి వ్యాపారి అతడికి చాలాసార్లు గుర్తు చేశాడు. అయితే పప్పూ నాన్న ఆ మొత్తం చెల్లించలేకపోయాడు. అతడికి కొంత పొలం ఉంది. దాంతో అతడు కుటుంబ అవసరాలకోసం సాగు చేసేవాడు. అలాగే అతడి ఇంటి ముందు 150 సంవత్సరాలనాటి పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టు కూడా పూర్వీకుల ఆస్థిలాగా తయారయింది. కొంత కాలం క్రితం వరద వెల్లువెత్తి అతడి పొలంలోని పంటను మొత్తంగా తుడిచిపెట్టేసింది. ఇలా జరగకపోయి ఉంటే అతడు చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ ఏడు కూడా ఏపుగా పెరిగిన పంటను చూస్తూ అతడిలా ఆలోచించాడు. 'దేవుడు దయదలిస్తే పంట అమ్మిన తర్వాత నా రుణం మొత్తాన్ని ఒకేసారి చెల్తించివేస్తాను.' కాని జరగబోయేది ఎవరికీ తెలియదు కదా.
ఒక రోజు ఉదయం వడ్డీ వ్యాపారి బండి పప్పూ ఊరిలో ప్రవేశించింది. ఎగుడు దిగుడుగా ఉండే దారి పొడవునా దుమ్ము రేపుకుంటూ అది పప్పూ ఇంటికి వచ్చింది.
వడ్డీ వ్యాపారిని చూడగానే, పప్పూ తండ్రి ప్రమాదాన్ని శంకించాడు. వడ్డీ వ్యాపారి క్రూరత్వం అతడికి బాగా తెలుసు. ఇరుగు పొరుగు వారికి వినపడేలాగా, తన రుణం తీర్చమంటూ అతడు గట్టిగా అరవకపోతే ఆదే పదివేలు అనుకున్నాడు.
కానీ, వడ్డీవ్యాపారి మాత్రం పప్పూ నాన్నతో వడవడ మాట్లాడుతున్నాడు. నారాయణా, ఇప్పుడే నాకు రావలసిన డబ్బు చెల్లించు. నాకు డబ్బుతో అవసరం ఉన్నప్పటికీ నీ అవసరం కోసం దాన్ని నీకిచ్చాను. అయితే నీవు మాత్రం నా అప్పు బకాయి ఇంతవరకు చెల్లించలేదు.
ఇలా మాట్లాడుతూ వడ్డీ వ్యాపారి అసలు విషయానికి వచ్చాడు. ఆ ఇంటి ముందు ఉన్న మఱ్ఱి చెట్టు వారిదని అతడికి ముందే తెలుసు. “ఈ మఱ్ఱి చెట్టుని ఏం చేసుకుంటారు? దాన్ని నాకు ఇచ్చేయండి. మీ రుణం బకాయి తీరిపోతుంది. పైగా మరి దేనికీ మీరు గాభరా పడనవసరం ఉండదు.”
వడ్డి వ్యాపారి నోట ఈ మాట వినగానే పప్పూ తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ మరర్రిచెట్టును అమ్మడం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదు. కాని అతడేం చేయగలడు. పైగా తన పరువు పోయే ప్రమాదం కూడా ఉన్నదాయె.
పప్పూ తోటి విద్యార్థి అఖిల ఈ విషయం వినగానే, తానొక పెద్ద పర్వతం కింద కప్పబడి పోయినట్లు భావించింది. మఱ్ఱిచెట్టు లేకపోతే తామంతా ఎక్కడ ఊగులాడాలి మరి?
అఖిల ఈ విషయాన్ని ప్రీతికి చెప్పగానే ప్రీతి కూడా నమ్మలేకపోయింది. అఖిల ఊరకే చెణుకులేస్తోందని ఆమె భావించింది. 'అబద్దాలు మాని నోరు మూసుకోవే. ఇంత పెద్ద చెట్టును పట్టుకుని కోసివేసే ఘనులెవ్వరు ఇక్కడ?'
గుర్నాధం ఊడలు పట్టుకుని ఊగేందుకు సమయం లేకపోతే చెట్టు ఎక్కేవాడు. అతడు కూడా ఈ విషయం విని బాధపడ్డాడు. పావురం గూట్లో పెట్టిన రెండు గుడ్ల మాటేమిటి?
మైనా గూట్లో పాటలు పాడుతున్న చిన్న గువ్వలున్నాయి. వాటి గతేమిటి మరి?
చెట్టుకు పట్టనున్న గతి తెలిసి పిల్లల్లో ప్రతి ఒక్కరూ విచారపడ్డారు. వాళ్ళ హృదయాల్లో బాధ పేరుకుంది. మఱ్ఱిచెట్టుకు ఎలాంటి హానీ జరగకూడదని వారందరూ భావించారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా విచారపడ్డారు. ఎందుకంటే వారికీ ఆ చెట్టంటే ప్రాణం మరి. ఆ చెట్టుకింద ఆడుకునే వారు పెరిగి పెద్దయ్యారు కూడా.
మఱ్ఱిచెట్టుమిద నివసించే పక్షులు చెట్టుకింద పిల్లలు విచారంగా ఉండడం గమనించాయి. ఏదో కీడు జరగనుంది. ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లుగా పక్షులు ఇప్పటికే అర్ధం చేసుకున్నాయి కూడా.
'పిల్లల ముఖాలు ఎందుకలా నీరసంగా ఉన్నాయి. దేవుడు ఆగ్రహించాడా? అని అడిగింది గోరింక.
దానికి ఉడుత, “నేను కూడా మిమ్మల్ని ఈ విషయం అడగాలనుకున్నాను. ఎదో తెలియని ఆందోళనతో నా గుండె కొట్టుకుంటోంది..
ఉన్నట్లుండి వడ్డీ వ్యాపారి బండి అక్కడికి వస్తుండటం కనిపెంచింది. అది సరిగ్గా పప్పూ ఇంటి ముందు ఆగింది. దాంట్లొంచి కొంతమంది దిగారు. వారి చేతుల్లో గొడ్డళ్ళు, రంపాలు కూడా ఉన్నాయి.
పప్పూ నాన్న వడ్డీవ్యాపారి ముందు నిలుచున్నాడు. అతడి ముఖం వాడిపోయింది, అతడు మతిలో లేనట్లు కనబడుతున్నాడు. క్షణాల్లోపే, మరరిచెట్టును కోత వేయడానికి వడ్డీవ్యాపారి వచ్చినట్లు వార్త సుడిగాలిలా పాకిపోయింది. ఈ మాట వినగానే పిల్లలు నమ్మలేనట్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
పప్పూకి బిల్లూ అనే స్నేహితుడున్నాడు. అతడు పప్పూ కంటే రెండేళ్ల పెద్దవాడు. అతడు కాస్త చురుకైనవాడు కూడా. ఉన్నట్లుండి అతడి మనసులో ఒక ఆలోచన తట్టి స్నేహితులతో చెప్పాడు. అదన్నమాట విషయం. పిల్లలందరిక తెలిసిపోయింది.
వడ్డీవ్యాపారి ఆ మఱ్ఱిచెట్టును కోయవలసిందిగా తన మనుషులను ఆదేశించడానికి ముందే ఫళణి, రవి, నరేంద్ర, వెంకీ, తిరుమాల్, బాలా, లలిత, యమున, వాసుకి, మహేష్, శశి, శివకువూర్, రాజు ఇంకా అనేకమంది పిల్లలు తమ హుండీలతో పాటు వచ్చి తాము దాచుకున్నదంతా బిల్లూ పరచిన బట్టపై పోశారు.
కుర్చీలో కూర్చుని ఉన్న వడ్డీ వ్యాపారి జరుగుతున్న తతంగాన్ని మొత్తంగా చూస్తున్నాడు. హుండీలలో అయిదు
రూపాయలే ఉండగా కొంతమంది హుండీలలో యాఖై రూపాయలవరకు ఉన్నాయి. కొంతమంది దగ్గర వందరూపాయల వరకు ఉండగా మరికొందరి దగ్గర అంతకుమించిన డబ్బుంది. అతడు చూస్తుండగానే 3వేల రూపాయల డబ్బు పోగయింది.
“పిల్లలూ ఇది చాలా తక్కువ డబ్బురా. ఇది నాకెందుకూ పనికిరాదు, చెప్పాడు వడ్డీవ్యాపారి.
“మామయ్యా, ఈ మఱ్ఱి చెట్టును మాత్రం కోతకు వేయకు. నీకు మాటిస్తున్నాము. మేం ప్రతినెలా డబ్బు వసూలు చేసి క్రమం తప్పకుండా నీకు ఇస్తాము. అని బిల్లూ చెబుతూ తన వద్ద పోగుపడిన డబ్బును వడ్డీ వ్యాపారికి ఇచ్చాడు
పిల్లలందరూ చేతులు జోడించి అతడి ముందు నిలుచున్వారు, పిలల ముఖ భంగిమలను, వారి ముకుళిత హస్తాలను చూసి వడ్డీ వ్యాపారి హృదయం ద్రవించింది. కాసేపు ఆలొచించి తన చేతిని పప్పూ నాన్న భుజంఫై వేసి 'ఈ పిల్లల ముఖాల్లోని ప్రేమానురాగాలను, చూస్తూంటే మఱ్ఱి చెట్టును కొయ్యాలనిపించడం లేదు. వారు తమ పరిసరాలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని కరుణించుగాక! మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుగాక. నా బాకీని నీవే తీర్చు. నీకు ఎంత అనిపిస్తే అంతే వడ్డీని ఇవ్వు. వడ్డీ ఇవ్వలేను అంటే కూడా ఫరవాలేదు.
పప్పూ నాన్న కూడా వారితో పాటు చేతులు ముడుచుకునే ఉన్నాడు.
తేనీరు తాగిన తర్వాత వడ్డీ వ్యాపారి బయలుదేరిపోవడానికి తన బండిలో కూర్చోగానే, మర్రిచెట్టు పైనుండి పక్షుల కిలకిలారావాలను అతడు విన్నాడు. ఉడతలు కిచకిచమంటూ ఒక కొమ్మనుండి మరొక కొమ్మమీదికి ఎగురుతూ సంతోషం పట్టలేకపోతున్నాయి.
పక్షులు పాట పాడుతూ తనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వడ్డవ్యాపారి తలిచాడు.
తర్వాత పప్పూ నాన్న పిల్లలతో మాట్లాడుతూ “పిల్లలూ, మర్రి చెట్టును నిజంగా మీరే కాపాడారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను..
పిల్లలంతా మఱ్ఱి చెట్టుకిందికి చేరి గంతు లేయసాగారు. మఱ్ఱి చెట్టు తలెత్తుకుని నిలబడి ప్రశాంతంగా చూస్తూ మందహాసం చేయసాగింది.
0 Comments