అన్యాయం మంగలిది
పూర్వం బాగ్జాద్ నగరంలో ఆలీ అనే మంగలి ఉండేవాడు. అతడు అందరు మంగళ్లవంటివాడు కాడు. క్షారం చేయటంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది.
బాగ్జాదులోని ధనికులూ, పలుకుబడి గలవారూ ఆలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు. ఒకనాడు ఆలి ఇంట్లో వంటచెరకు కావలిసి వచ్చింది. దాంతో కట్టెల వాళ్ళ కోసం చూస్తూ అతను విధివాకిట నిలబడ్డాడు. కొద్ది సేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెలమోపు వేసుకుని అటుగా వచ్చాడు.
ఆలీ వాణ్ణి పిలిచి, "నాకు నీతో బేరమాడేటందుకు తీరిక లేదు గాని, ఆ గాడిదపై ఉన్న కర్ర యావత్తూ ఐదు
రూపాయలకి ఇస్తావా? అని అడిగాడు.
బాగ్జాదులో వంటచెరకుకు గిరాకీ హెచ్చు. సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్దబేరం గదా అని సరేనన్నాడు. వాడు గాడిదమీది కట్టెలన్నీ దింపెసి డబ్బు అడిగాడు.
“గాడిద వీపున ఉన్న కొయ్య జీను మాట ఎమిటి? అంతా కలిపే మాట్లాడాను,' అన్నాడు ఆలీ.
“అదెట్లా? అన్నాడు కట్టెలవాడు.
“ఆ జీను కూడా కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తూ ఐదు రూపాయలకి బేరం చేశాను, అన్నాడు ఆలీ.
“ఇదేం బేరమండోయ్? దీనికి నేనెంత మాత్రం ఒప్పను, అన్నాడు కట్టెలవాడు.
ఇది విని ఆలీ కట్టెలవాడి దవడ వాయ గొట్టి కట్టెలూ, జీనూ కూడా లాక్కుని పంపేశాడు. దెబ్బలు తిన్న కట్టెలవాడు
చెప్పలేని బాధతోనూ, ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు వోయి జరిగినది విన్నవించుకున్నాడు.
కాని ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది ఆలీయే కావటం చేత, ఆయన కట్టెల వాడి మొర వినిపించుకోలేదు.
కట్టిలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆయనకూ ఆలీయే మంగలి కావడంతో,
వాడి మొర పెడచెవిన పెట్టాడు.
“నాకెవరూ సహాయం చేసేవాళ్లు లేరు. నా గతి అంతే! అనుకుంటూ కట్టెలవాడు ఇంటిదారి పట్టాడు.
వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై, “ఎమిటి నాయనా, అంత విచారంగా ఉన్నావు? అని అడిగాడు. దానికి కట్టెలవాడు ముసలివాడి దగ్గిర తన భాద వెళ్త్లబోసుకున్నాడు.
“దీనికే ఇంత బేజారైపోతావెందుకు? నువు మన ఖలిఫా దగ్గిరికి వెళ్ళి చెప్పుకో. నీకు న్యాయం జరగవచ్చు, అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు.
కట్టెలవాడు రాజభవనానికి వెళ్లాడు. కొద్ది సేపట్లోనే వాడికి ఖలీఫా దర్శనం లభించింది. వాడు ఖలిఫాను సమీపించి ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాం చేశాడు. ఖలీఫా వాడు వచ్చిన పనిని విచారించాడు.
కట్టిలవాడు జరిగినదంతా చెవ్పాడు.
“న్యాయం ఆలీ పక్షానే ఉంది. అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెబుతాను విను, అంటూ ఖలీఫా కట్టెలవాడి చెవిన ఒక రహస్యం చెవ్పాడు.
కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్తాడు.
కొద్ది రోజులు గడిచాక. కట్టెలవాడు మంగలి ఆలీ వద్దకు పోయి, “నాకూ, నా నేస్తానికీ క్షౌరం చెయ్యటానికి ఏం పుచ్చుకుంటావు?' అని అడిగాడు.
“రెండు రూపాయలిస్తే మీ ఇద్దరికీ క్షారం చేస్తాను, అన్నాడు ఆలీ.
“మంచిది. ముందు నాకు క్షౌరం చెయ్యి, అన్నాడు కట్టెలవాడు.
వాడి తల నున్నగా గొరిగేసినాక ఆలీ, “నీ నేస్తమెక్కడ? అని అడిగాడు.
“బయట ఉండొచ్చు. లోపలికి తీసుకొస్తాను, అని కట్టెలవాడు బయటికెళ్ళి తన గాడిదెను లోపలికి లాక్కొచ్చాడు.
'ఈ మనిషి నేస్తానికి క్షౌరం చెయ్యి, అన్నాడు కట్టెలవాడు.
“ఎమిటి?” గాడిదకు క్షౌరం చెయ్య మంటావా? అన్నాడు ఆలీ మండిపడి.
తక్షణం వెళ్లకపోతే చావగొడతానని బెదిరించాడు.
వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకెళ్ళి మంగలి ఆలీ మీద ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదును విన్న ఖలిఫా, తన భటులను పిలిపించి, 'మంగలి ఆలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి, అని
ఆజ్ఞాపంచాడు.
వాళ్లు ఆలీని పట్టుకొచ్చారు.
'ఈ మనిషి నేస్తానికి క్షౌరం చెయ్యటానికి మాట ఇచ్చి తరవాత చేయనని నిరాకరించావుట. ఏమిటి కారణం? అని
అడిగాడు ఖలీఫా కోపంగా.
ఆలీ నేలకు వంగి సలాం చేసి, 'ఏలిన వారు చెప్పినది నిజమే గాని, మనిషికి గాడిద నేస్తం కావటం గాని, గాడిదకు క్షౌరం చెయ్యడం గాని లోకంలో ఎక్కడైనా కద్దా? అని అడిగాడు.
“నువ్వన్నది నిజమే. కాని జీనును వంట చెరుకుకింద కొనటం మటుకు ఎక్కడైనా కద్దా? వెంటనే ఈ గాడిదకు క్షౌరం చెయ్యి, అన్నాడు ఖలీఫా.
ఆలీకి తప్పలేదు. వాడు గాడిద శరీరానికి సబ్బునురుగు రాచి క్షౌరం చేస్తుంటే దర్బారులో ఉన్న వారంతా విరగబడి నవ్వారు. ఆలీ పరువంతా బుగ్గిలో కలిసి పోయింది.
నాటినుంచి ఎవరు అతడి వద్ద క్షౌరం చేయించుకునే వారు కాదు.
0 Comments