కప్ప
తిక్క కుదిరింది
ఒక దట్టమైన అడవిలోనే కొలనులో ఎన్నో
కప్పలు జీవిస్తున్నాయి. ఒక రాత్రి పూట ఈ కప్పలన్నీ నీటిలో నుంచి తలలు పైకెత్తి సేద తీరుతున్నాయి. వాటిలో
పెద్దదైన బోదురు కప్ప ఇలా గొప్పలు
చెప్పుకో సాగింది "హ హ హ!
వినండి పొట్టి బుడంకాయ లారా! ఇక నుంచి
నేనే ఈ కొలనుకు రాజును"
పాత తరం కప్పలు ఈ
బడాయి మాటలు పట్టించుకోలేదు కానీ
చిన్న కప్పలు మాత్రం ససేమిరా అన్నాయి. ఆకలిగొన్న ఒక కొంగ కప్పల బెకబెకలు విని
అటువైపు వచ్చింది. కొలను నిండా ఉన్న కప్పలను చూసి దానికి నోరూరింది
తరువాత మళ్ళీ కొంగ ఆకస్మికంగా కొలను లోకి రావడం
చూసి కప్పలు బెకబెకలు ఆపేసి
గమ్మున ఉండిపోయాయి. అయితే ఈ సంబడం ఎంతో సేపు నిలవలేదు. బోదురు
కప్ప తన ఆధిక్యతను మళ్లీ చాటుకోవడం మొదలుపెట్టింది. "హ
హ హ! నేనే ఈ
కొలనుకు రాజును" అని చెప్ప సాగింది. దీనికి చిన్న కప్పలు మళ్లీ
నిరసన తెలుప సాగాయి.
ప్రస్తుతానికి
దాని ప్రాణాలు దక్కినా ప్రాణ భయంతో, గాయాలతో వణికిపోయింది. ఇకనుంచి బడాయిలు చెప్పుకోకూడదు అని నిశ్చయించుకుంది. తాను
కావటానికి పెద్ద కప్పనే అయినా
తోటి కప్పలకు వలె తనకు నిరంతరం
ప్రాణాపాయం పొంచివుందని తెలుసుకుంది.
0 Comments